ఎపిక్ గ్లింప్స్: బేబీ కాంబోలో క్రేజీ లవ్ స్టొరీ.. కమ్ముల×వంగా!
సాధారణంగా ప్రేమకథలంటే ఒకే రకమైన ఫ్లో ఉంటుంది. అబ్బాయి అమ్మాయి వెంట పడటం, లేదా ఇద్దరూ ఇష్టపడటం చూస్తుంటాం. కానీ ఇక్కడ దర్శకుడు ఏదో కొత్తగా ట్రై చేసినట్లున్నారు.
By: M Prashanth | 1 Dec 2025 10:55 PM IST'బేబీ' సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ క్రియేట్ చేసిన జంట మళ్లీ వస్తోంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య అనగానే ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఆ ఎమోషనల్ కనెక్షన్ గుర్తొస్తుంది. వాళ్లిద్దరూ మరోసారి కలిసి నటిస్తున్నారంటే ఆ అంచనాలు హై లెవల్ లో ఉంటాయి. ఇప్పుడు ఆ అంచనాలకు తగ్గట్టే, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నుంచి ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఫస్ట్ లుక్ లోనే సినిమా థీమ్ ఏంటో చెప్పకనే చెప్పేశారు.
సాధారణంగా ప్రేమకథలంటే ఒకే రకమైన ఫ్లో ఉంటుంది. అబ్బాయి అమ్మాయి వెంట పడటం, లేదా ఇద్దరూ ఇష్టపడటం చూస్తుంటాం. కానీ ఇక్కడ దర్శకుడు ఏదో కొత్తగా ట్రై చేసినట్లున్నారు. లండన్ వీధుల్లో మన ఊరి నేటివిటీని మిక్స్ చేస్తూ చూపించిన విజువల్స్ ఆసక్తి రేపుతున్నాయి. క్లాస్ వాతావరణానికి, పక్కా లోకల్ మాస్ కు మధ్య జరిగే కథలా అనిపిస్తోంది.
'90s' వెబ్ సిరీస్ తో అందరి మనసు గెలుచుకున్న ఆదిత్య హాసన్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. టైటిల్ 'ఎపిక్' (Epic). దీనికి 'ఫస్ట్ సెమిస్టర్' అనే ఆసక్తికరమైన ట్యాగ్ లైన్ తగిలించారు. గ్లింప్స్ లో వైష్ణవి తనకు కాబోయే వాడు ఎలా ఉండాలో.. డ్రెస్సింగ్ సెన్స్, మ్యూజిక్ టేస్ట్ గురించి కండిషన్లు పెడుతుంటే, ఆనంద్ దేవరకొండ మాత్రం లండన్ బ్రిడ్జ్ మీద గద్దర్ గెటప్ లో, చేతిలో కర్ర, కాలికి గజ్జె కట్టుకుని మాస్ ఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చారు.
ఈ గ్లింప్స్ లో మేజర్ హైలైట్ పాయింట్ క్యారెక్టర్ల డిజైనింగ్ అనే చెప్పాలి. శేఖర్ కమ్ముల సినిమా హీరో లాంటి సాఫ్ట్ అబ్బాయికి, సందీప్ రెడ్డి వంగా సినిమాలోని హీరో లాంటి అమ్మాయి తగిలితే ఎలా ఉంటుందో.. ఈ కథ అలా ఉండబోతోందట. ఈ రివర్స్ కాంబినేషన్ వినడానికే క్రేజీగా ఉంది. పైగా 90s సిరీస్ లోని ఆ చిన్నపిల్లాడు రోహన్ క్యారెక్టరే పెద్దయ్యాక ఈ హీరో అని చెప్పడం మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్.
నిర్మాణ విలువల పరంగా సితార సంస్థ ఎప్పుడూ రాజీపడదు, అది విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్, అజీమ్ కెమెరా పనితనం చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి. నటుడు శివాజీ, వాసుకి ఆనంద్ లాంటి సీనియర్లు కీలక పాత్రల్లో కనిపిస్తుండటం సినిమాకు మరో ప్లస్ పాయింట్. లండన్ బ్యాక్ డ్రాప్ లో ఈ సాఫ్ట్ లవ్ స్టోరీ ఆడియెన్స్ ను కచ్చితంగా అలరించేలా ఉంది.
రిలీజ్ చేసిన చిన్న గ్లింప్స్ తోనే సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశారు. 'బేబీ' తర్వాత మళ్ళీ వారి కలయికలో వస్తున్న సినిమా కావడంతో యూత్ లో మంచి బజ్ ఉంది. దానికి తోడు డైరెక్టర్ మార్క్ ఫన్, ఎమోషన్ మిక్స్ అయినట్లు కనిపిస్తోంది. మరి ఈ 'ఎపిక్' లవ్ స్టోరీ.. ఫస్ట్ సెమిస్టర్ లోనే ఆడియెన్స్ మనసు గెలుచుకుంటుందా లేదా అనేది చూడాలి. త్వరలోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
