మిడిల్ క్లాస్ కాంబో.. వాళ్లని ఒప్పించారంటే..?
అంతేకాదు ఆనంద్ దేవరకొండకు మొదటి సక్సెస్ ఫుల్ సినిమా అంటే కూడా ఇదే అని చెప్పొచ్చు. దొరసాని థియేట్రికల్ రిలీజైనా కూడా మిడిల్ క్లాస్ మెలోడీస్ ఓటీటీలో రిలీజై మంచి మౌత్ టాక్ తెచ్చుకుంది.
By: Ramesh Boddu | 13 Oct 2025 12:54 PM IST2020 కోవిడ్ లాక్ డౌన్ లో ఓటీటీ ఆడియన్స్ ని మెప్పించిన సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్. వినోద్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వర్ష బొల్లమ్మ లీడ్ రోల్ లో నటించారు. థియేట్రికల్ రిలీజ్ అవకాశం లేని టైంలో ఓటీటీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. అంతేకాదు ఆనంద్ దేవరకొండకు మొదటి సక్సెస్ ఫుల్ సినిమా అంటే కూడా ఇదే అని చెప్పొచ్చు. దొరసాని థియేట్రికల్ రిలీజైనా కూడా మిడిల్ క్లాస్ మెలోడీస్ ఓటీటీలో రిలీజై మంచి మౌత్ టాక్ తెచ్చుకుంది.
బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా..
ఐతే మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమా తర్వాత ఆనంద్ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు. రెండేళ్ల క్రితం అతనికి బేబీ సినిమాతో మరో సూపర్ హిట్ దక్కింది. సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. బేబీ సినిమాకు విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ కూడా పెద్ద అసెట్ అయ్యింది. ఆనంద్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాగా బేబీ నిలిచింది.
బేబీ తర్వాత కూడా ఆనంద్ మళ్లీ వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు. ఇదిలాఉంటే మరోసారి ఓటీటీ ఆడియన్స్ కోసం మూవీ చేస్తున్నాడట ఆనంద్. అది కూడా తనకు మొదటి హిట్ ఇచ్చిన వినోద్ తోనే ఆనంద్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. వినోద్ అనంతోజు డైరెక్షన్ లో ఆనంద్ దేవరకొండ హీరోగా ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తుని. ఇప్పటికే తెలుగు స్టార్స్ తో నెట్ ఫ్లిక్స్ వెబ్ సీరీస్, సినిమాలు చేస్తుంది.
ఐదేళ్లుగా అతను ఒక మంచి ఛాన్స్ కోసం..
వినోద్, ఆనంద్ కలిసి చేసే నెట్ ఫ్లిక్స్ సీరీస్ ఏంటి.. ఎలాంటి జోనర్ లో ఈ కాంబో సినిమా వస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ తర్వాత వినోద్ మరో సినిమా డైరెక్ట్ చేయలేదు. దాదాపు ఐదేళ్లుగా అతను ఒక మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు. నెట్ ఫ్లిక్స్ లాంటి అద్భుతమైన ఫ్లాట్ ఫాం లో ఛాన్స్ అంటే అది చలా మంచి విషయమని చెప్పొచ్చు.
విజయ్ దేవరకొండ బ్రదర్ ఆనంద్ తన కెరీర్ ని స్లో అండ్ స్టడీగా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. యువ హీరోల్లో కూడా బీభత్సమైన పోటీ వాతావరణం ఉంది. ఎవరు డిఫరెంట్ గా చేసి ఆడియన్స్ ని మెప్పిస్తున్నారో వాళ్ల సినిమాలే చూస్తున్నారు. బేబీ తర్వాత గం గం గణేశ ఎలా వచ్చిందో అలా వెళ్లింది. అందుకే నెక్స్ట్ రాబోతున్న సినిమాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టాడు ఆనంద్ దేవరకొండ.
