Begin typing your search above and press return to search.

హీరో-డైరెక్టర్-హీరోయిన్.. ఒక్క ప్రశ్నతో రివీల్ అయిందిగా!

రీసెంట్ గా జరిగిన ఓ సినిమా ఈవెంట్‌ లో చిన్న ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.

By:  M Prashanth   |   30 April 2026 4:53 PM IST
హీరో-డైరెక్టర్-హీరోయిన్.. ఒక్క ప్రశ్నతో రివీల్ అయిందిగా!
X

రీసెంట్ గా జరిగిన ఓ సినిమా ఈవెంట్‌ లో చిన్న ఇన్సిడెంట్ సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. బేబీ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో హీరోయిన్లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మళ్లీ జంటగా నటిస్తున్న కొత్త చిత్రం ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్. ఆ సినిమాకు ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తుండగా, టీజర్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌ లో గ్రాండ్ గా జరిగింది.

ఆ ఈవెంట్ లో మూవీ టీమ్ సినిమా విశేషాలు పంచుకుంటుండగా, ఓ ప్రశ్న కాసేపు అసౌకర్యానికి గురయ్యేలా చేసింది. బేబీ తర్వాత వైష్ణవి తన ఇమేజ్ మార్చుకోవాల్సిన అవసరం ఉందా? ఎపిక్ ఆ మార్పుకే సంకేతమా? అనే యాంగిల్ లో ప్రశ్న రావడంతో, ఆమె వెంటనే సమాధానం ఇవ్వలేకపోయారు. కాసేపు ఆలోచనలో పడిపోయిన ఆమె పరిస్థితి గమనించిన హీరో ఆనంద్, దర్శకుడు ఆదిత్య హాసన్ వెంటనే స్పందించారు.

మొదటగా దర్శకుడు ఆదిత్య హాసన్ ప్రశ్నను క్లారిటీ చేసేందుకు ప్రయత్నిస్తూ.. ఎవరి కోణంలో ఆ ఇమేజ్ మార్పు? అంటూ తిరిగి ప్రశ్నించారు. ఆ తర్వాత హీరో ఆనంద్ దేవరకొండ ముందుకు వచ్చి తన హీరోయిన్ గా అండగా నిలిచారు. సినిమా పాత్రల గురించి మాట్లాడేటప్పుడు, నటీనటుల ఇమేజ్ కంటే కథలోని క్యారెక్టర్ ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

"ఒక హీరో లేదా హీరోయిన్ కెరీర్ మొత్తం ఒకే ఇమేజ్‌ ను కొనసాగించడం సాధ్యం కాదు. ప్రతి సినిమాలో పాత్రను బట్టి మార్పులు రావడం సహజం. బేబీలో వైష్ణవి చేసిన పాత్రను ప్రేక్షకులు ఎంతో మెచ్చుకున్నారు. ఇప్పుడు ఎపిక్ లో కూడా ఆమె స్ట్రాంగ్ రోల్ లో కనిపించనుంది" అని ఆనంద్ వివరించారు. అంతేకాకుండా, సినీ ఇండస్ట్రీలో స్ట్రాంగ్ ఉమెన్ రోల్స్ అరుదుగా వస్తాయని ఆయన గుర్తు చేశారు.

"సాధారణంగా ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాల్లో మాత్రమే స్ట్రాంగ్ ఫిమేల్ రోల్స్ ఉంటాయి. అలాంటిది వైష్ణవికి మూడేళ్లలోనే రెండు మంచి పాత్రలు రావడం గొప్ప విషయం" అని అన్నారు. అప్పుడు వైష్ణవి కూడా చిరునవ్వుతో స్పందించారు. ఆ ఇన్సిడెంట్ మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ముఖ్యంగా హీరోయిన్‌ కు హీరో, దర్శకుడు ఇచ్చిన మద్దతు పట్ల పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇండస్ట్రీలో సాధారణంగా హీరోలే ఎక్కువగా ఫోకస్‌ లో ఉండే పరిస్థితుల్లో, హీరోయిన్ కు ఇలా అండగా నిలవడం మంచి సంకేతమని సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

ఉమెన్ క్యారెక్టర్స్ కు ప్రాధాన్యత పెరగాల్సిన అవసరం ఉన్న సమయంలో, ఇలాంటి రెస్పాన్సులు ఎంకరేజ్ చేస్తాయని అంటున్నారు. మరోవైపు ఆ సంఘటనతో ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే బేబీ సినిమాతో హిట్ కాంబినేషన్‌ గా గుర్తింపు పొందిన ఆ జంట.. మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అన్న ఆసక్తి నెలకొంది. టీజర్‌ కు వస్తున్న రెస్పాన్స్ కూడా పాజిటివ్‌ గా ఉండటం గమనార్హం. మొత్తానికి, ఒక చిన్న ప్రశ్నతో మొదలైన ఇన్సిడెంట్.. హీరో-హీరోయిన్-డైరెక్టర్ మధ్య ఉన్న కోపరేషన్ ను రివీల్ చేసింది. ఇదే ప్రేక్షకులు కోరుకునే సహకారం అనే చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.