Begin typing your search above and press return to search.

మూడేళ్లయినా వదలని 'బేబీ' సెంటిమెంట్

ఆనంద్ దేవరకొండ కెరీర్ లో 'బేబీ' సినిమా తెచ్చిన మార్పు అంతా ఇంతా కాదు. ఆ సినిమా వచ్చి మూడేళ్లు దాటిపోయినా ఆ సెంటిమెంట్ మాత్రం ఆనంద్ ను ఇంకా వదలడం లేదు.

By:  M Prashanth   |   18 Aug 2026 4:00 AM IST
మూడేళ్లయినా వదలని బేబీ సెంటిమెంట్
X

ఆనంద్ దేవరకొండ కెరీర్ లో 'బేబీ' సినిమా తెచ్చిన మార్పు అంతా ఇంతా కాదు. ఆ సినిమా వచ్చి మూడేళ్లు దాటిపోయినా ఆ సెంటిమెంట్ మాత్రం ఆనంద్ ను ఇంకా వదలడం లేదు. ఇప్పుడు లైనప్ లో ఉన్న రెండు ప్రాజెక్టులు చూస్తే ఈ విషయం ఈజీగా అర్థమవుతుంది. అప్పట్లో బేబీ టీమ్ లో పని చేసిన వాళ్లే ఇప్పుడు రెండు వేర్వేరు ప్రాజెక్టులతో ఆనంద్ తో మళ్లీ చేతులు కలిపారు.

2023లో వచ్చిన 'బేబీ' ఆనంద్ థియేట్రికల్ మార్కెట్ ను ఒక్కసారిగా మార్చేసింది. సాయి రాజేష్ డైరెక్ట్ చేసిన ఈ లవ్ స్టోరీకి ఎస్కేఎన్ ప్రొడ్యూసర్ కాగా, ధీరజ్ మొగిలినేని సహ నిర్మాతగా వ్యవహరించారు. ఒక చిన్న సినిమాగా రిలీజైన బేబీ.. కేవలం నాలుగు రోజుల్లోనే 31 కోట్ల గ్రాస్ కొల్లగొట్టి బాక్సాఫీస్ దగ్గర సృష్టించిన సెన్సేషన్ అందరికీ తెలిసిందే.

ఇప్పుడు అదే సెంటిమెంట్ తో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య మళ్లీ ఆనంద్ తో నటిస్తోంది. ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో వీళ్లిద్దరూ కలిసి నటించిన 'ఎపిక్' సినిమా సెప్టెంబర్ 11న థియేటర్లలోకి రాబోతోంది. బేబీలో హిట్ అయిన ఈ పెయిర్ మూడేళ్ల తర్వాత మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎపిక్ కు మంచి బజ్ తెచ్చిపెట్టింది. అయితే ఇది కూడా బేబీ లాంటి ఇంటెన్స్ లవ్ స్టోరీనా కాదా అనేది రిలీజ్ అయితే కానీ తెలియదు.

ఇక మరోవైపు బేబీకి కో ప్రొడ్యూసర్ గా ఉన్న ధీరజ్ మొగిలినేని కూడా ఆనంద్ తో ఓ కొత్త సినిమా ప్లాన్ చేశాడు. 'బలగం' సినిమాకు రైటింగ్ టీమ్ లో పని చేసిన నాగరాజు ఈ చిత్రంతో డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. బలగం లాంటి రూటెడ్ స్టోరీకి పని చేసిన రైటర్ కావడంతో ఆటోమేటిక్ గా ఈ ప్రాజెక్ట్ మీద జనాల్లో మంచి ఆసక్తి నెలకొంది.

ఇక్కడ మరో ఆసక్తికరమైన పాయింట్ ఒకటుంది. బేబీ హిట్ అయింది కదా అని అదే టీమ్ అంతా కలిసి మళ్లీ ఒకే సినిమా చేయలేదు. ఎవరికి వాళ్లు విడిపోయి ఆనంద్ తో రెండు డిఫరెంట్ ప్రాజెక్టులు సెట్ చేసుకున్నారు. ఒక పక్క హీరోయిన్ వైష్ణవితో ఎపిక్ చేస్తూనే.. ఇంకో పక్క కో ప్రొడ్యూసర్ ధీరజ్ నిర్మాణంలో కొత్త కథకు ఓకే చెప్పాడు. సీక్వెల్స్ గొడవ లేకుండానే బేబీ టీమ్ కనెక్షన్ ఇలా కంటిన్యూ అవుతోంది.

నిజానికి బేబీ తర్వాత ఆనంద్ చేసిన 'గం గం గణేశా' బాక్సాఫీస్ దగ్గర ఆశించిన రిజల్ట్ ఇవ్వలేదు. అందుకే ఇప్పుడు తన లైనప్ ను చాలా జాగ్రత్తగా సెట్ చేసుకుంటున్నాడు. ఎపిక్ తో పాటు 'తక్షకుడు' అనే మరో సినిమా కూడా ఆనంద్ చేతిలో ఉంది. మిడిల్ క్లాస్ మెలోడీస్ తీసిన వినోద్ అనంతోజు డైరెక్ట్ చేసిన ఈ మూవీ డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.