Begin typing your search above and press return to search.

మాస్ వయొలెన్స్‌లో ప్యూర్ లవ్ స్టోరీ.. అనకాపల్లి టీజర్

విక్రమ్ సాహిదేవ్ హీరోగా పరిచయమవుతున్న 'అనకాపల్లి' సినిమా టీజర్ తోనే హాట్ టాపిక్ గా మారింది.

By:  M Prashanth   |   29 March 2026 12:26 PM IST
మాస్ వయొలెన్స్‌లో ప్యూర్ లవ్ స్టోరీ.. అనకాపల్లి టీజర్
X

విక్రమ్ సాహిదేవ్ హీరోగా పరిచయమవుతున్న 'అనకాపల్లి' సినిమా టీజర్ తోనే హాట్ టాపిక్ గా మారింది. సినిమా చూపిస్త మావ, నేను లోకల్, ధమాకా వంటి బిగ్ హిట్స్ అందుకున్న సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ త్రినాధరావు నక్కిన స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. టీజర్ చూస్తుంటే ఇది కేవలం ఒక మాస్ యాక్షన్ సినిమా మాత్రమే కాకుండా, లోతైన ఎమోషన్స్ ఉన్న పక్కా లోకల్ స్టోరీ అని అర్థమవుతోంది.





​టీజర్ మొదలవ్వడమే హీరో పవర్‌ఫుల్ డైలాగ్స్‌తో చాలా సీరియస్‌గా స్టార్ట్ అవుతుంది. అనకాపల్లిలో బతకాలంటే ఎదుటివాడికి మనమంటే భయం ఉండాలంటూ హీరో ఇచ్చే ఎంట్రీ మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ఉంది. అయితే ఆ వయొలెన్స్ వెంటనే ఒక అందమైన పల్లెటూరి ప్రేమకథగా మారిపోతుంది. అమాయకమైన చూపులతో, స్వచ్ఛమైన నవ్వుతో సాగే ఈ లవ్ స్టోరీ టీజర్‌కు ఒక కొత్త ఫీల్‌ను తీసుకొచ్చింది.

​విక్రమ్ సాహిదేవ్ తన మొదటి సినిమాతోనే నటుడిగా మంచి ఇంపాక్ట్ చూపించేలా ఉన్నాడు. ఒకవైపు మొండితనం చూపిస్తూనే, మరోవైపు లవ్ సీన్స్‌లో చాలా సాఫ్ట్‌గా కనిపిస్తూ వేరియేషన్స్ బాగానే మెయింటైన్ చేశాడు. హీరోయిన్ సంధ్యా వశిష్ట కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకుంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ సినిమాకు మెయిన్ పిల్లర్‌గా నిలిచేలా కనిపిస్తోంది.

ఇక సీనియర్ నటి ఇంద్రజ, త్రినాధరావు నక్కిన హీరో తల్లిదండ్రులుగా కీలక పాత్రల్లో కనిపించారు. ​సాంకేతికంగా ఈ సినిమా చాలా రిచ్‌గా ఉంది. పల్లెటూరి వాతావరణాన్ని చాలా సహజంగా చూపిస్తే, డ్యావ్‌జాంద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌లో ఉన్న టెన్షన్‌ను బాగా ఎలివేట్ చేసింది. దర్శకుడు ఖగేష్ తమ్మినేని మాస్ ఎలిమెంట్స్‌కు, ఫ్యామిలీ ఎమోషన్స్‌కు మధ్య సరైన బ్యాలెన్స్ కుదిర్చినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.

కథలో ఏదో తెలియని ఏమోషన్ దాగి ఉందనే విషయాన్ని టీజర్‌లో ఎక్కడా రివీల్ చేయకుండా జాగ్రత్త పడ్డారు. ​ఫైనల్ గా 'అనకాపల్లి' టీజర్ ఈ సమ్మర్ బరిలో ఒక గట్టి సినిమా రాబోతుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. యాక్షన్ ప్రియులతో పాటు, ఎమోషనల్ లవ్ స్టోరీస్ ఇష్టపడే వారికి కూడా ఈ సినిమా నచ్చేలా ఉంది. ఏప్రిల్ 30న విడుదల కాబోతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.