ఎలైట్ క్రికెట్ లీగ్ లో 'అనకాపల్లి' ట్రైలర్.. సూపర్ రెస్పాన్స్!
ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పాటలు, టీజర్ తో మంచి ప్రమోషనల్ హైప్ క్రియేట్ అవ్వగా, ఇప్పుడు వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.
By: M Prashanth | 27 July 2026 3:12 PM ISTటాలీవుడ్ లో రా అండ్ రస్టిక్ కథలకు ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది. నేటివ్ ఎలిమెంట్స్ తో పాటు పక్కా మాస్ యాక్షన్ ఉన్న సినిమాలు ఆడియన్స్ ను త్వరగా కనెక్ట్ చేస్తాయి. ఇదే కోవలో ఇప్పుడు 'అనకాపల్లి' అనే పవర్ ఫుల్ టైటిల్ తో ఒక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సిద్ధమైంది. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీకి ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహించారు. భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, ప్రముఖ దర్శకుడు త్రినాథరావు నక్కిన కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.
లేటెస్ట్ గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. విశాఖపట్నంలో ఎంతో గ్రాండ్ గా జరిగిన ఎలైట్ క్రికెట్ లీగ్ సీజన్ 2 వేదికగా ఈ ట్రైలర్ ను లాంచ్ చేయడం విశేషం. టాలీవుడ్ థండర్స్ టీమ్ సభ్యులైన హీరో శ్రీకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సుధీర్ బాబు, తరుణ్, అశ్విన్ బాబు వంటి పలువురు సినీ ప్రముఖులు వేలాది మంది అభిమానుల సమక్షంలో ఈ వీడియోను రిలీజ్ చేసి చిత్రయూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన పాటలు, టీజర్ తో మంచి ప్రమోషనల్ హైప్ క్రియేట్ అవ్వగా, ఇప్పుడు వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, ఇందులో చూపించిన విజువల్స్ చాలా సహజంగా, రస్టిక్ టోన్ లో కనిపించాయి. హీరో హీరోయిన్ల మధ్య సాగే లవ్ ట్రాక్ ఫీల్ గుడ్ గా అనిపిస్తుంటే, యాక్షన్ సీన్స్ మాత్రం వర్త్ అనిపించేలా ఉన్నాయి. ముఖ్యంగా విలన్ గా నటించిన తారక్ పొన్నప్ప నెగిటివ్ షేడ్స్ లో తన మార్క్ చూపించినట్లు అర్థమవుతోంది.
మాస్, యూత్ ఆడియన్స్ కు కావలసినంత యాక్షన్ అండ్ రొమాన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయని ట్రైలర్ కట్ చూస్తుంటే క్లారిటీ వస్తోంది. యాక్షన్ కే పరిమితం కాకుండా ఈ కథలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మిడిల్ క్లాస్ పేరెంట్స్ క్యారెక్టర్లలో దర్శకుడు త్రినాథరావు నక్కిన, నటి ఇంద్రజ కనిపించిన తీరు చాలా న్యాచురల్ గా ఉంది.
ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు మాస్ ఎలిమెంట్స్ ను సమానంగా బ్యాలెన్స్ చేస్తూ అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా ఈ చిత్రాన్ని రూపొందించారనిపిస్తోంది. ఈ సినిమాకు త్రినాథరావు నక్కిన స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించడం కూడా ఒక పెద్ద అసెట్ గా మారింది. దేవ్ జండ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, డీఓపీ వర్క్ యాక్షన్ సీక్వెన్స్ లకు మంచి ఎలివేషన్ ఇచ్చాయి. శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటింగ్ వర్క్, ఉదయ్ భాగవతుల సంభాషణలు కథనానికి తగిన స్పీడ్ ను అందించినట్లు అర్థమవుతోంది.
నిర్మాణ విలువల పరంగా కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను తెరకెక్కించారు. ప్రస్తుతం ఆడియన్స్ కోరుకునే రా అండ్ రియలిస్టిక్ డ్రామాగా వస్తున్న ఈ 'అనకాపల్లి' చిత్రం ఆగస్ట్ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. సరైన ప్రమోషనల్ ప్లాన్ తో వస్తున్న ఈ ప్రాజెక్ట్ కు ట్రైలర్ బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. కాండ్రేగుల కుమార్ రాజా కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 7న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ రస్టిక్ లవ్ అండ్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.
