సోనూ సూద్ వదిలిన 'అనకాపల్లి' మాస్ సాంగ్.. ఎలా ఉందంటే..
ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి లేటెస్ట్ గా 'డర్టీ గ్యాంగ్‌స్టర్స్' అనే మాస్ లిరికల్ పాటను రిలీజ్ చేశారు.
By: M Prashanth | 3 Aug 2026 9:40 AM ISTరా అండ్ రస్టిక్ కాన్సెప్ట్‌లతో వచ్చే సినిమాలకు ఆడియన్స్ లో ఎప్పుడూ ఒక రకమైన క్రేజ్ ఉంటుంది. పక్కా లోకల్ నేటివిటీతో, ఇంటెన్స్ యాక్షన్ తో సిద్ధమవుతున్న చిత్రం 'అనకాపల్లి'. విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను భవ్య శ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఖగేష్ తమ్మినేని దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్ నుంచి లేటెస్ట్ గా 'డర్టీ గ్యాంగ్‌స్టర్స్' అనే మాస్ లిరికల్ పాటను రిలీజ్ చేశారు. ఆది కూడా రియల్ హీరో సోనూ సూద్ సర్ ప్రైజ్ తో ఆయన చేతుల మీదుగా రిలీజ్ చేశారు.
విడుదలైన ఈ సాంగ్‌ను గమనిస్తే సినిమా ఏ రేంజ్‌లో రా అండ్ రస్టిక్‌గా ఉండబోతోందో అర్థమవుతోంది. కేకే అందించిన లిరిక్స్‌కు దేవ్ జండ్ అందించిన ఇంటెన్స్ ట్యూన్ పవర్‌ఫుల్ వైబ్‌ని క్రియేట్ చేస్తోంది. పృథ్వీ చంద్ర, ఈకే కలిసి ఈ పాటను చాలా హై ఎనర్జీతో ఆలపించారు. లిరికల్ వీడియోలో చూపించిన లోకేషన్లు, యాక్షన్ కట్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్‌గా, మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. ఈ సాంగ్ లాంచ్ చేసిన సందర్భంగా సోనూ సూద్ చిత్రయూనిట్‌కు తన శుభాకాంక్షలు తెలియజేశారు.
దర్శకుడు త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు కేవలం సహ నిర్మాతగానే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే అందించడం విశేషం. అంతేకాకుండా ఇందులో ఆయన ఒక కీలక పాత్రలో కూడా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్‌లకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. కమర్షియల్ హంగులతో పాటు రా అండ్ రియలిస్టిక్ టచ్ ఉన్న కథలతో వస్తున్న సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర మంచి ఆదరణ దక్కుతుండటంతో 'అనకాపల్లి' మూవీపై కూడా పాజిటివ్ బజ్ నెలకొంది.
ఈ సినిమాకు ఉదయ్ భాగవతులు డైలాగ్స్ అందించగా, మాయా.వి సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకృష్ణ అట్టలూరి ఎడిటర్‌గా వ్యవహరించారు. కాండ్రేగుల కుమార్ రాజా కో ప్రొడ్యూసర్‌గా పనిచేసిన ఈ సినిమాలో ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా, శ్రీనివాస్ వడ్లమాని, నందిని రాయ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. దేవ్ జండ్ మ్యూజిక్, డిఫరెంట్ లిరిసిస్ట్‌ల కాంబోలో వస్తున్న పాటలు ప్రమోషన్లకు ప్లస్ పాయింట్‌గా మారాయి.
చిన్న సినిమాలైనా సరే కంటెంట్‌లో దమ్ము ఉంటే థియేటర్లలో నెత్తిన పెట్టుకోవడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. 'అనకాపల్లి' టీమ్ కూడా అదే నమ్మకంతో ప్రమోషన్ల డోస్ పెంచుతూ ఆడియన్స్‌కి రీచ్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది. రా అండ్ రస్టిక్ యాక్షన్ ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ పరంగా ఆకట్టుకోవడంలో సక్సెస్ అయింది. ప్రస్తుతం ప్రీ రిలీజ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ 'అనకాపల్లి' సినిమా ఆగస్ట్ 7న థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. మరి ఈ రస్టిక్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ సాధిస్తుందో చూడాలి.
