Begin typing your search above and press return to search.

అందరూ తడబడితే.. అనకాపల్లి నిలబడింది!

నిన్న థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో అనకాపల్లి కాస్త మంచి టాక్ తెచ్చుకుంది. సిగ్మా, తెల్లకాగితం, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లాంటి సినిమాలకు రిలీజ్‌కు ముందు మంచి క్యూరియాసిటీ ఉంది.

By:  M Prashanth   |   3 Oct 2026 11:22 AM IST
అందరూ తడబడితే.. అనకాపల్లి నిలబడింది!
X

నిన్న థియేటర్లలోకి వచ్చిన సినిమాల్లో అనకాపల్లి కాస్త మంచి టాక్ తెచ్చుకుంది. సిగ్మా, తెల్లకాగితం, డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ లాంటి సినిమాలకు రిలీజ్‌కు ముందు మంచి క్యూరియాసిటీ ఉంది. డోరతి కూడా డిఫరెంట్ జానర్‌తో వచ్చింది. కానీ మొదటి రోజు తర్వాత బయటకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే అనకాపల్లి పేరు కాస్త బెటర్‌గా వినిపిస్తోంది. స్టార్ పవర్ కంటే కథలోని ఎమోషన్ ఈ సినిమాకు ఉపయోగపడినట్టు కనిపిస్తోంది.

సిగ్మా రిలీజ్‌కు ముందు మంచి అంచనాలే తెచ్చుకుంది. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం కావడం, సందీప్ కిషన్ హీరోగా ఉండటం సినిమాకు ముందే బజ్ తెచ్చాయి. కానీ కథ, కథనం అనుకున్న స్థాయిలో పట్టుకోలేదనే అభిప్రాయాలు ఎక్కువగా వచ్చాయి. ముఖ్యంగా హీరో-విలన్ మధ్య ఆటలో కావాల్సిన ఉత్కంఠ తగ్గిందనే కామెంట్స్ వినిపించాయి. దీంతో విడుదల తర్వాత సినిమా మీద ఉన్న హైప్ కొంచెం తగ్గింది.

తెల్లకాగితం యూత్ లవ్ స్టోరీగా వచ్చింది. మొదటి భాగంలో ప్రేమకథ, కొన్ని సన్నివేశాలు బాగున్నాయనే టాక్ వచ్చినా తర్వాత కథ ట్రాక్ తప్పిందనే అభిప్రాయం ఎక్కువగా వినిపించింది. నక్షత్ర నటన మాత్రం ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంది. విజువల్స్, రెండు పాటలకు కూడా మంచి రెస్పాన్స్ ను వచ్చింది. కానీ సినిమా మొత్తం ఒకే స్థాయిలో పట్టుకోలేకపోవడం దాని మీద ప్రభావం చూపింది.

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్‌కు రిలీజ్‌కు ముందు మంచి ప్రచారం దక్కింది. ఫహాద్ ఫాసిల్, సారా కాంబినేషన్, రాజమౌళి ప్రెజెంటర్‌గా ఉండటం, కార్తికేయ నిర్మించడం సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. ఫస్ట్ హాఫ్ లో ఫహాద్ సారా సన్నివేశాలు, ఫాంటసీ కామెడీ కొంతవరకు వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ లో సరదా తగ్గి కథ సాధారణంగా మారిందనే అభిప్రాయాలు రావడంతో సినిమా మీద టాక్ మిక్స్డ్‌గా ఉంది.

డోరతి మాత్రం వేరే జానర్‌లో వచ్చింది. అందరికీ ఈజీగా కనెక్ట్ అయ్యే కథ కాదనే అభిప్రాయం మొదటి నుంచే ఉంది. సినిమా ప్రయత్నం కొత్తగా అనిపించినా, టోన్ వల్ల ఒక్కో ప్రేక్షకుడికి ఒక్కోలా అనిపించే అవకాశం ఉంది. అందుకే దీనిపై వచ్చిన రెస్పాన్స్ కూడా మిక్స్డ్‌గానే ఉంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పోలిస్తే డోరతికి వేరే రకం ఆడియన్స్ అవసరం పడుతోంది.

అనకాపల్లిలో విక్రమ్ సాహిదేవ్, సంధ్య వశిష్ఠతో పాటు త్రినాథరావు నక్కిన పాత్రకు కూడా మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. ముఖ్యంగా రెండో భాగంలో ఎమోషన్, క్లైమాక్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయనే టాక్ వినిపిస్తోంది. టౌన్ నేపథ్యం, కుటుంబ బంధాలు సినిమాకు దగ్గరైన ఫీల్ ఇచ్చాయి. నిన్నటి రిలీజ్‌ల్లో ఇదే కాస్త బెటర్‌గా నిలిచింది. మొదటి రోజు వచ్చిన ఈ రెస్పాన్స్ వీకెండ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్ వరకు వెళ్తే అనకాపల్లికి మరింత ఉపయోగపడొచ్చు.