Begin typing your search above and press return to search.

పండక్కి పోలిశెట్టి.. OGతో బిగ్ సర్ ప్రైజ్

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు అనగనగా ఒక రాజు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   24 Sept 2025 12:50 PM IST
పండక్కి పోలిశెట్టి.. OGతో బిగ్ సర్ ప్రైజ్
X

టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. ఇప్పుడు అనగనగా ఒక రాజు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఆ సినిమాకు మారి దర్శకత్వం వహిస్తున్నారు. యంగ్ అండ్ క్రేజీ బ్యూటీ మీనాక్షీ చౌదరీ హీరోయిన్ గా కనిపించనున్నారు.


మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పుడు వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నారు. 2026 జనవరి 14వ తేదీన థియేటర్స్ లోకి చిత్రాన్ని తీసుకురానున్నారు.

ఇప్పటికే అనగనగా ఒక రాజు మూవీపై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లింప్సెస్ అన్నీ సూపర్ రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు మేకర్స్ తాజాగా క్రేజీ అప్డేట్ ఇచ్చారు. విడుదలపై మళ్లీ క్లారిటీ ఇస్తూ.. ప్రోమోను రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అది కూడా ఓజీ మూవీతోనని చెప్పారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో నటించిన ఓజీ మూవీ.. మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తమ మూవీ అనగనగా ఒక రాజు సంక్రాంతి ప్రోమోను విడుదల చేస్తున్నట్లు మేకర్స్ బుధవారం ఉదయం అనౌన్స్ చేశారు. ఆ సమయంలో స్పెషల్ పోస్టర్ గా రిలీజ్ చేయగా.. అందరినీ మెప్పిస్తోంది.

అందులో నవీన్ పోలిశెట్టి.. బ్లూ అండ్ వైట్ కుర్తా, పైజామాలో సంక్రాంతి బుల్లోడిలా ఉన్నారు. బ్యాక్ గ్రౌండ్ లో భారీ జెయింట్ వీల్ ఉండగా.. పెద్ద ఎత్తున ప్రజలు కనిపిస్తున్నారు. మొత్తంగా పండగ వాతావరణం పోస్టర్ ద్వారా ఉట్టిపడుతోంది. సంక్రాంతికి కానుకగా సినిమాను జనవరి 14న తీసుకొస్తున్నట్లు రైటప్ ద్వారా క్లారిటీ ఇచ్చారు.

అయితే సినిమా కచ్చితంగా ఆడియన్స్ అలరిస్తుందని.. పోలిశెట్టికి మంచి హిట్ దక్కుతుందనే అంచనాలు అందరిలో ఉన్నాయి. జాతిరత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నవీన్.. ఇప్పటివరకు కొన్ని సినిమాల్లో ముఖ్య పాత్రల్లో కనిపించి హీరోగా మారారు. ఆ తర్వాత మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చి మెప్పించారు. ఇప్పుడు అనగనగా ఒక రాజు సినిమాతో ఏం చేస్తారో వేచి చూడాలి.