రాజు గారి పెళ్లి సాంగ్.. రచ్చ రంబోలా..!
నవీన్ పొలిశెట్టి హీరోగా మారి డైరెక్షన్ లో వస్తున్న సినిమా అనగనగా ఒక రాజు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది
By: Ramesh Boddu | 27 Dec 2025 11:11 AM ISTనవీన్ పొలిశెట్టి హీరోగా మారి డైరెక్షన్ లో వస్తున్న సినిమా అనగనగా ఒక రాజు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని మొదటి సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు సినిమా నుంచి రాజు గారి పెళ్లి రో సాంగ్ రిలీజ్ చేశారు. నవీన్ పొలిశెట్టి పెళ్లి సాంగ్ గా ఫుల్ ఎనర్జిటిక్ గా ఈ సాంగ్ ఉంది. ముఖ్యంగా సినిమాలోని కాస్టింగ్ అంతా కలిసి చాలా అందంగా కలర్ ఫుల్ గా ఉండేలా ఉంది ఈ పాట.
సాంగ్ కి స్పెషల్ ఎట్రాక్షన్..
రాజు గారి పెళ్లి రో సాంగ్ ని చంద్రబోస్ రాయగా అనురాగ్ కులకర్ణి, సమీరా భరధ్వాజ్ ఆలపించారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ కి ఈ ఇద్దరి ఎనర్జీ తోడై ఈ సాంగ్ కి స్పెషల్ ఎట్రాక్షన్ తెచ్చిపెట్టింది. రాజు గారి పెళ్లి రో సాంగ్ తో అనగనగా ఒక రాజు సినిమాపై మరింత బజ్ పెరిగింది. స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి సినిమా అంటేనే ఫుల్ ఫన్ ఉంటుందని ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు.
అనగనగా ఒక రాజు సినిమా ఒక విలేజ్ లో రాజు చేసే సందడి ఎలా ఉంటుంది. అతని హడావిడి.. పెళ్లి.. విలేజ్ పాలిటిక్స్ ఇలా అన్నీ కలిపి ఈ సినిమాలో చూపించనున్నారు. పర్ఫెక్ట్ సంక్రాంతి సినిమాగా అనగనగా ఒక రాజు సినిమా వస్తుంది. ఈ సినిమాను నిర్మాత నాగ వంశీ రాజేంద్ర ప్రసాద్ లేడీస్ టైలర్ తో పోల్చారంటే సినిమాలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా..
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత రెండేళ్లు గ్యాప్ తీసుకున్న నవీన్ పొలిశెట్టి ఈ సినిమాతో మరోసారి తన మార్క్ ఎంటర్టైన్మెంట్ చేయనున్నాడు. నవీన్, మీనాక్షి జోడీ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి మీనాక్షి నటించిన సంక్రాంతికి వస్తున్నాం సూపర్ హిట్ సెన్సేషన్ కాగా ఈ సంక్రాంతికి నవీన్ పొలిశెట్టి అనగనగా ఒక రాజు సినిమా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ కి ఒక ఫుల్ మీల్స్ ఎంటర్టైనర్మెంట్ ఇచ్చేందుకు వస్తుంది. మరి ఈ సినిమాపై మేకర్స్ పెట్టుకున్న హోప్స్ కి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
సంక్రాంతికి ఈసారి ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. పోటీలో ప్రభాస్, చిరంజీవి, రవితేజ, శర్వానంద్ సినిమాలు ఉన్నాయి. ఐతే ఆ సినిమాలతో పాటు నవీన్ పొలిశెట్టి నవ్వుల జాతరగా అనగనగా ఒక రాజు కూడా వస్తుంది. సంక్రాంతి అంటేనే సినిమాల పండగ అంటారు. మరి ఈ సంక్రాంతికి రాబోతున్న ఈ సినిమాల్లో ఏది ఎక్కువ ఆడియన్స్ ని అలరిస్తుంది అన్నది చూడాలి.
