Begin typing your search above and press return to search.

సంక్రాంతిలో పొలిశెట్టి సేఫ్ గేమ్.. టెన్షన్ లేని బిజినెస్!

సంక్రాంతి అంటేనే బాక్సాఫీస్ దగ్గర బిగ్గీస్ మధ్య భారీ ఫైట్ ఉంటుంది. వందల కోట్ల బడ్జెట్, ఎక్కడ చూసినా హడావిడి మామూలుగా ఉండదు.

By:  M Prashanth   |   7 Jan 2026 9:00 PM IST
సంక్రాంతిలో పొలిశెట్టి సేఫ్ గేమ్.. టెన్షన్ లేని బిజినెస్!
X

సంక్రాంతి అంటేనే బాక్సాఫీస్ దగ్గర బిగ్గీస్ మధ్య భారీ ఫైట్ ఉంటుంది. వందల కోట్ల బడ్జెట్, ఎక్కడ చూసినా హడావిడి మామూలుగా ఉండదు. ఈసారి కూడా బజ్ ఉన్న సినిమాలు అన్నీ బరిలోకి దిగుతున్నాయి. అయితే ఈ రచ్చలో సైలెంట్ గా తన మార్క్ చూపించడానికి యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి రెడీ అయ్యారు. నవీన్ పొలిశెట్టి నుంచి సినిమా వస్తోందంటే ఆడియన్స్ కి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది.

కచ్చితంగా నవ్విస్తాడని, క్లీన్ ఎంటర్టైనర్ ఉంటుందని ఫిక్స్ అయిపోతారు. అందుకే ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘అనగనగా ఒక రాజు’ ని సరిగ్గా పండగ టైమ్ చూసి జనవరి 14న థియేటర్లలోకి తెస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ మూవీపై ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది. ఈ సినిమా బిజినెస్ లెక్కలు చూస్తుంటే మేకర్స్ చాలా సేఫ్ గేమ్ ఆడినట్లు తెలుస్తోంది.

అసలు విషయం ఏంటంటే ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు రూ. 40 కోట్ల వరకు ఖర్చు చేశారట. కానీ సినిమా రిలీజ్ అవ్వకముందే దాదాపు మేజర్ ఇన్వెస్ట్ మెంట్ వెనక్కి వచ్చేయడం ఇక్కడ అసలైన ట్విస్ట్. నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలోనే రూ. 27 కోట్లు ఆల్రెడీ రికవరీ అయ్యిందని అంచనా. ఓటీటీ నుంచి రూ. 19 కోట్లు, ఆడియో ద్వారా రూ. 3 కోట్లు, శాటిలైట్ నుంచి మరో రూ. 5 కోట్లు వచ్చాయని అంటున్నారు.

వీటికి తోడు ఓవర్సీస్ హక్కులను రూ. 5 కోట్లకు అమ్మేశారట. ఇలా మొత్తం రూ. 32 కోట్లు ఇప్పటికే చేతికి అందడంతో నిర్మాత నాగవంశీ ఇప్పుడు చాలా రిలాక్స్డ్ గా ఉన్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. బ్రేక్ ఈవెన్ అవ్వడానికి థియేటర్ల నుంచి కేవలం మరో రూ. 8 కోట్లు వస్తే సరిపోతుంది. నిర్మాతలకు ఈ సినిమా సక్సెస్ ఇప్పుడు చాలా అవసరం. గతేడాది సితార సంస్థకు ‘కింగ్ డమ్’, ‘మాస్ జాతర’ లాంటి సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.

తెలుగులో రిలీజ్ చేసిన ‘వార్ 2’ తో కూడా నష్టాలు వచ్చాయి. 2026లో ఏకంగా 8 సినిమాలు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఈ రాజు సినిమాతో మంచి బోణీ కొట్టి ఫామ్ లోకి రావాలని ప్లాన్ చేస్తున్నారు. సంక్రాంతి సీజన్ లో రూ. 8 కోట్ల షేర్ రాబట్టడం నవీన్ పొలిశెట్టికి అంత పెద్ద టాస్క్ ఏమీ కాదు. టాక్ కొంచెం పాజిటివ్ గా వచ్చినా ఈ టార్గెట్ ని చాలా ఈజీగా రీచ్ అయిపోవచ్చు. భారీ రిస్క్ లు లేకుండా సేఫ్ బిజినెస్ తో రావడం నిజంగా మంచి స్ట్రాటజీనే. మరి ఈ సంక్రాంతి రాజు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.