ఆ ఐటెమ్ సాంగ్ లో ఆమె కాదు, మన తెలుగమ్మాయే!
ఐటెమ్ సాంగ్స్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ మధ్య ఐటెమ్ సాంగ్స్‌నే స్పెషల్ సాంగ్స్ అని కూడా అంటున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 3 Jan 2026 4:22 PM ISTఐటెమ్ సాంగ్స్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ మధ్య ఐటెమ్ సాంగ్స్‌నే స్పెషల్ సాంగ్స్ అని కూడా అంటున్నారు. ఒకప్పుడు ఐటెమ్ సాంగ్స్ చేయడం కోసం ప్రత్యేకంగా కొందరు భామలుండేవారు. కానీ ఇప్పుడలా కాదు. ట్రెండ్ మారింది. హీరోయిన్లతోనే వాటిని చేయించి దాన్ని స్పెషల్ సాంగ్ అంటున్నారు. ఎప్పుడైతే హీరోయిన్లు కూడా ఈ సాంగ్స్ చేసే ట్రెండ్ మొదలైందో అప్పట్నుంచి వాటికి డిమాండ్ బాగా పెరిగింది.
ఇప్పటికే పలువురు హీరోయిన్లు భారీ బడ్జెట్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి మరింత పాపులర్ అయ్యారు. అయితే ఈ ఐటెమ్ సాంగ్స్ క్రేజ్ ను గుర్తించిన మేకర్స్ చాలా వరకు తమ సినిమాల్లో కూడా అలాంటి సాంగ్స్ పెట్టి ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయాలని చూస్తున్నారు. ఇక అసలు విషయానికొస్తే ఈ ఇయర్ సంక్రాంతికి పలు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడటానికి రెడీ అవుతున్నాయి.
ఈ సంక్రాంతికి భారీ పోటీ
అందులో ది రాజా సాబ్, మన శంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఈసారి పండగకి బాక్సాఫీస్ వద్ద భారీ పోటీనే నెలకొంది. అయితే ఈ పండగ సినిమాల్లో ఒక్క సినిమా తప్పించి మిగిలిన ఏ మూవీలోనూ ఏటెమ్ సాంగ్ లేదు. ఆ సినిమా మరేదో కాదు, అనగనగా ఒక రాజు.
జనవర 14న అనగనగా ఒక రాజు
నవీన్ పోలిశెట్టి హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా మారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న రిలీజ్ కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయగా, తాజాగా ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ ఉన్నట్టు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని, ఆ సాంగ్ లో సౌత్ బ్యూటీ రాశీ ఖన్నా నటించనుందని వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ ఉన్న మాట నిజమే కానీ, ముందుగా వార్తలొచ్చినట్టు అందులో రాశీ ఖన్నా కాకుండా, మన తెలుగమ్మాయి శాన్వీ మేఘన కనిపించనుందని తెలుస్తోంది. మరి ఈ సాంగ్ ఏ మేరకు ఆకట్టుకుంటుందో, నవీన్ ఈ పండగకు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి. కాగా ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నాగవంశీ నిర్మించిన సంగతి తెలిసిందే.
