Begin typing your search above and press return to search.

ఆంద్రా టు తెలంగాణ ఊపేస్తుంది అనుకుంటే..!

నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్ లో అతని డైలాగ్స్, స్క్రీన్ ప్లే లోనే వచ్చిన సినిమా అనగనగా ఒక రాజు.

By:  Ramesh Boddu   |   19 Jan 2026 5:35 PM IST
ఆంద్రా టు తెలంగాణ ఊపేస్తుంది అనుకుంటే..!
X

నవీన్ పొలిశెట్టి లీడ్ రోల్ లో అతని డైలాగ్స్, స్క్రీన్ ప్లే లోనే వచ్చిన సినిమా అనగనగా ఒక రాజు. సంక్రాంతి సినిమాల పండగలో తను కూడా జాయిన్ అయ్యి ప్రేక్షకులకు ఒక మంచి ఆహ్లాదకరమైన ఎంటర్టైనింగ్ సినిమా ఇచ్చాడు నవీన్ పొలిశెట్టి. పేరుకి మారి అని డైరెక్టర్ ని పెట్టినా సరే ఈ సినిమా విషయంలో అన్నీ తానై నడిపించాడు నవీన్ పొలిశెట్టి. అందుకే ఈ సినిమా సక్సెస్ విషయంలో ఎక్కువ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది.

సితార బ్యానర్ లో ఐటెం సాంగ్స్ క్రేజ్..

ఐతే సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ కలిసి నిర్మించిన అనగనగా ఒక రాజు సినిమాలో నవీన్ పొలిశెట్టి సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలో భీమవరం బాల్మా సాంగ్ రిలీజ్ ముందే బాగా ఎక్కేసింది. రాజు గారి పెళ్లిరో సాంగ్ కూడా ప్రేక్షకులను అలరించింది. ఐతే సితార బ్యానర్ లో స్పెషల్ ఐటెం సాంగ్స్ కి మంచి క్రేజ్ ఉంటుంది. మాస్ ఆడియన్స్ ని మెప్పించేలా ఈ సాంగ్స్ ఉంటాయి.

గుంటూరు కారం లో కుర్చీ మడతపెట్టి సాంగ్ రాగా.. సితార నుంచి వచ్చిన మ్యాడ్, మ్యాడ్ 2 లో కూడా స్పెషల్ సాంగ్స్ ఆకట్టుకున్నాయి. కానీ సంక్రాంతికి వచ్చిన అనగనగా ఒక రాజు సినిమాలో ఆంధ్రా టు తెలంగాణ సాంగ్ మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయింది. అనగనగా ఒక రాజు సినిమా ప్రేక్షకులను సూపర్ ఎంటర్టైన్ చేసినా ఈ సాంగ్ విషయంలో మాత్రం కాస్త నిరుత్సాహ పరిచింది. సినిమాలోనే కాదు ఈ సాంగ్ యూట్యూబ్ లో కూడా ఆడియన్స్ పెద్దగా పట్టించుకోలేదు.

సంక్రాంతి రేసులో వచ్చిన ఐదు సినిమాల్లో..

మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించిన ఆంధ్రా టు తెలంగాణ సాంగ్ ని శాన్వీ మేఘన గ్లామర్ షోతో అలరించే ప్రయత్నం చేసింది. ఐతే మామూలుగా అయితే స్పెషల్ ఐటెం సాంగ్స్ ఏవైనా మాస్ ఆడియన్స్ కి వెంటనే ఎక్కేస్తాయి. ఆ వైబ్ తోనే ఎక్కడ విన్నా ఆ సాంగ్ వినిపిస్తుంది. కానీ అనగనగా ఒక రాజు సినిమాలో ఈ సాంగ్ మాత్రం అంత ఇంపాక్ట్ చూపించలేదు. సినిమా విషయంలో సాటిస్ఫై అయిన ఆడియన్స్ ఐటెం సాంగ్ ని మాత్రం ఎంజాయ్ చేయలేకపోయారు.

ఇక సంక్రాంతి రేసులో వచ్చిన ఐదు సినిమాల్లో నవీన్ పొలిశెట్టి తన సత్తా చాటాడు. ఏదైతే ఆడియన్స్ తన మీద పెట్టుకున్న ఎక్స్ పెక్టేషన్స్ ని రీచ్ అయ్యే అవుట్ తో వచ్చి సక్సెస్ అందుకున్నాడు. ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో అన్నీ కూడా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలనే కాన్సెప్ట్ తోనే వచ్చాయి. అందుకే సినిమాలు కూడా మాక్సిమం మెప్పించాయి.