Begin typing your search above and press return to search.

చీరకట్టు.. పూల జడ.. ఆకట్టుకుంటున్న అమైరా దస్తూర్!

తాజాగా అమైరా దస్తూర్ ఎల్లో కలర్ శారీ ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఇందులో అమైరా దస్తూర్ ఎల్లో కలర్ శారీతో పాటు తన పూల జడతో హైలెట్ అయింది.

By:  Madhu Reddy   |   24 Oct 2025 2:00 AM IST
చీరకట్టు.. పూల జడ.. ఆకట్టుకుంటున్న అమైరా దస్తూర్!
X

ఇండియన్ మోడల్.. సినీ హీరోయిన్ అయినటువంటి అమైరా దస్తూర్ ఎప్పటికప్పుడు తన హాట్ అందాలతో కుర్రకారుకు సెగలు పుట్టిస్తూ ఉంటుంది. హిందీ సినిమాల ద్వారా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఎల్లో కలర్ శారీలో ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.. తాజాగా అమైరా దస్తూర్ ఎల్లో కలర్ శారీ ఫొటోస్ ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. ఇందులో అమైరా దస్తూర్ ఎల్లో కలర్ శారీతో పాటు తన పూల జడతో హైలెట్ అయింది.




ముఖ్యంగా మల్లెపూలతో హెయిర్ స్టైల్ చేయించుకున్న ఈ ముద్దుగుమ్మని వెనక నుండి చూస్తే అచ్చ తెలుగు ఆడపిల్లలాగే కనిపిస్తోంది.ఇక స్లీవ్ లెస్ బ్లౌజ్ తో అందాలు హైలైట్ అయ్యేలా ఈ ముద్దుగుమ్మ తన శారీ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఈ శారీలో అమైరా దస్తూర్ మరింత అందంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోస్ చూసిన చాలామంది నెటిజన్స్ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తూ అందమే దిగివచ్చినట్లు ఉంది అన్నట్లుగా కామెంట్లు పెడుతున్నారు. తన నడుము ఒంపు సొంపులు చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. చాలామంది ఈ ఫోటోలు చూసి పలు కామెంట్లు పెడుతున్నారు..




అమైరా దస్తూర్ పర్సనల్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. మోడలింగ్ ద్వారా సినిమాల్లోకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ 2013లో వచ్చిన బాలీవుడ్ మూవీ ఇసాక్ తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హిందీ తో పాటు తెలుగు,తమిళ సినిమాల్లో కూడా నటించింది. ఇక అమైరా దస్తూర్ సందీప్ కిషన్ హీరోగా నటించిన మనసుకు నచ్చింది అనే మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలాగే రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన రాజుగాడు మూవీ లో కూడా హీరోయిన్ గా నటించింది..




ఆ తర్వాత మళ్లీ తెలుగు సినిమాల్లో కనిపించలేదు.ఇక బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన అమైరా దస్తూర్ చివరిగా తమిళంలో వచ్చిన భగీరా అనే సినిమాలో కనిపించింది.. అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లలో కూడా చేసింది. అలా సినిమాలు,వెబ్ సిరీస్ లు అంటూ ఇండస్ట్రీలో కొనసాగిన ఈ ముద్దుగుమ్మకి గత రెండు మూడు సంవత్సరాలు నుండి సినిమాల్లో ఎక్కువగా ఆఫర్స్ రావడం లేదు. అందుకే సినిమాల్లో ఆఫర్స్ అందుకోవడం కోసం ఇలా సోషల్ మీడియానే ప్రధానాయుధంగా మలుచుకొని తన ఫోటోలతో దర్శక నిర్మాతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. మరి ఈ హీరోయిన్ అందాలు చూసైనా సినిమాల్లో ఏవైనా అవకాశాలు వస్తాయా అనేది చూడాలి.