బ్లాక్ అవుట్ ఫిట్ లో కునుకు లేకుండా చేస్తున్న బ్యూటీ..
ఈ క్రమంలోనే కొంతమంది గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. మరి కొంతమంది సాంప్రదాయంగా కనిపించి ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
By: Madhu Reddy | 16 Dec 2025 12:04 PM ISTసినిమా ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ టైం ఎంతకాలం ఉంటుందో చెప్పడం అసాధ్యం. అందుకే చాలామంది తమ ఉనికిని చాటుకోవడానికి ఒక బలమైన పాత్ర కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకొంతమంది ఇలా సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ద్వారా తమ పాపులారిటీని పెంపొందించుకొని అభిమానులలో చెరగని ముద్ర వేసుకోవాలని ప్రయత్నం చేస్తారు. ఈ క్రమంలోనే కొంతమంది గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. మరి కొంతమంది సాంప్రదాయంగా కనిపించి ఫాలోవర్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఇంకొంతమంది ఏదో ఒక రకమైన విషయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే ఈమధ్య కాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను మెప్పిస్తూ.. తన గ్లామర్ తో యువతను ఫాలోవర్స్ గా మార్చుకుంటున్న వారి జాబితాలో అమైరా దస్తూర్ కూడా చేరిపోయింది. ప్రతిరోజు ఏదో ఒక ఫోటో షూట్ తో ప్రేక్షకులను అలరించే ఈమె తాజాగా బ్లాక్ అవుట్ ఫిట్ ధరించి తన అందంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తాజాగా బ్లాక్ కలర్ శారీని తలపించేలా ఉన్న ఈ డ్రెస్ ఈమె మేని ఛాయను రెట్టింపు చేసిందని చెప్పవచ్చు. బ్లాక్ అవుట్ ఫిట్ లో అమైరా అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఏది ఏమైనా ఈ అమ్మడి అందానికి ఫ్యాన్స్ దాసోహం అంటూ ఉండడం గమనార్హం. ప్రస్తుతం అమైరా షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
తమిళంలో ధనుష్ సరసన అనేకుడు అనే సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె తెలుగులో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన మనసుకు నచ్చింది అనే సినిమాలో కూడా నటించింది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా హిందీ, తమిళ్లో ఎక్కువ సినిమాలు చేసి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్ గా మారిపోయింది. నిజానికి మనసుకు నచ్చింది అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హిందీ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పదేళ్లకు పైగానే అవుతున్నా.. ఆశించిన స్థాయిలో గుర్తింపు లభించడం లేదు.
నిజానికి తెలుగులో ఈమె నటించిన సినిమాలు డిజాస్టర్ కావడం వల్ల ఈమెకు తెలుగులో అవకాశాలు తలుపు తట్టలేదు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఇసాక్ తర్వాత మిస్టర్ ఎక్స్, రాజ్మా చావల్, జడ్జిమెంటల్ హై క్యా , ప్రస్థానం , కోయి జానేనా వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు కూడా పోషించింది. అయితే ఏ చిత్రం కూడా ఈమెకు ఊహించిన స్థాయిలో సక్సెస్ ను అందించలేదు. ముఖ్యంగా ఈమె నటించిన కొన్ని సినిమాలు సక్సెస్ సాధించినా.. ఈమె నటనకు పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి. అటు అందం విషయంలో అందరినీ ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలో కలకాలం కొనసాగే హక్కు ఉన్నప్పటికీ అవకాశాలు లేకపోవడం నిజంగా బాధాకరమనే చెప్పాలి. కనీసం ఇప్పటికైనా ఈమెకు ఇండస్ట్రీలో అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
