నా నోటి తిట్లు తింటే కెరీర్ సెట్ అయినట్లే!
బాలీవుడ్ నటి అమైరా దస్తూర్, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌తో ఎదురైన సరదా అనుభవాన్ని పంచుకున్నారు. ‘కుంగ్ ఫూ యోగా’లోని ‘గూస్‌బంప్’ పాట షూటింగ్ సమయంలో డ్యాన్స్ సరిగా రాక అమైరా భయపడ్డారట. అప్పుడు ఫరా ఖాన్.. “నువ్వు నా టైటానిక్ సినిమా లాంటిదానివి.. నా కెరీర్‌ను నాశనం చేస్తావు” అంటూ సరదాగా వ్యాఖ్యానించారని అమైరా గుర్తుచేసుకున్నారు.
By: Srikanth Kontham | 10 Nov 2026 12:30 PM ISTబాలీవుడ్ కొరియోగ్రాఫర్, దర్శకురాలు ఫరా ఖాన్ తనదైన సెన్సాఫ్ హ్యూమర్‌తో నవ్వించడంలో స్పెషలిస్ట్.ఎంత సీరియస్ గా ఉన్నా? నవ్వు జీవితంలో ఎరగని వారిని సైతం తనదైన చలాకీతనం..పంచ్ లతో ఉత్సాహాన్ని నింపుతారు. తన ముందు కూర్చోవాలంటే కచ్చితంగా నవ్వడం తెలియాలి. లేదంటే? టాక్ షో నుంచి బయటకు వచ్చే లోపు తప్పక నవ్వించే ఇంటికి పంపిస్తారు. ఈ నేపథ్యంలో తాజాగా పరాఖాన్ తో బాలీవుడ్ నటి అమైరా దస్తూర్ కెరీర్ ప్రారంభ రోజులకు సంబంధించిన ఆసక్తికర విషయాన్ని రివీల్ చేసారు. ఈ సందర్భంగా అమైరా నటించిన కుంగ్ పూ యోగా రోజుల్లోకి వెళ్లారు.
`కుంగ్ ఫూ యోగా` చిత్రంలోని `గూస్‌బంప్` పాటకు ఫరా ఖాన్ కొరియోగ్రఫీ చేశారు. ఆ సమయంలో ఫరా ఖాన్ సెట్స్‌లో చాలా సీరియస్‌గా ఉంటారని.. ఆమెకు భయపడి తాను కన్నీళ్లు పెట్టుకునే పరిస్థితి వచ్చిందని అమైరా వెల్లడించారు. సెట్‌లో తాను సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోతున్నానని భావించి ఎంతో టెన్షన్ పడ్డానని తెలిపారు. అయితే సెట్స్‌లో ఉన్నట్టుండి దగ్గరకు వచ్చిన ఫరా ఖాన్ కంగ్రాచులేషన్స్ చెప్పడంతో తాను బాగా చేశానని అమైరా సంతోషపడ్డారట.
కానీ ఆ వెంటనే ఫరా ఖాన్ చేసిన వ్యాఖ్య చూసి షాక్ తిన్నానని అమైరా నవ్వేసింది `నువ్వు నా టైటానిక్ సినిమా లాంటిదానివి.. ఖచ్చితంగా నా కెరీర్‌ను నాశనం చేస్తావు` అంటూ ఫరా ఖాన్ తనదైన శైలిలో సరదాగా వ్యాఖ్యానించారని అమైరా దస్తుర్ గుర్తు చేసుకున్నారు. ఫరా ఖాన్ చేసిన ఫన్నీ కామెంట్స్ విని అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. తాను ఎవరిపైనైనా? సెట్స్‌లో గట్టిగా అరిస్తే వారి కెరీర్ మరింత విజయవంతం అవుతుందని ఫరా ఖాన్ నవ్వుతూ బదులిచ్చారు. ఇదే షోలో ప్రముఖ నటుడు బోమన్ ఇరానీ `హ్యాపీ న్యూ ఇయర్` షూటింగ్ సమయంలో ఫరా ఖాన్ చేతిలో తిట్లు తిన్న ఉదంతాన్ని కూడా గుర్తు చేసుకున్నారు.
బాలీవుడ్ సెలబ్రిటీ టాక్ షో అంటే ఇంతే సరదాగా ఉంటుంది. అప్పుడప్పుడు వివాదాలు తెరపైకి వచ్చినా? టాక్ షోల పరంగా బాలీవుడ్ లో సక్సెస్ అయినట్లు ఇంకే భాషలో సక్సెస్ అవ్వలేదు. వేర్వేరు పరిశ్రమల్లో స్థానికంగా టాక్ షోలను పలువురు సెలబ్రిటీలు నిర్వహిస్తున్నారు. కానీ హిందీ టాక్ షోని మాత్రం ఇంత వరకూ ఏ ఇతర లాంగ్వేజ్ టాక్ షో బీట్ చేయలేదన్నది కాదనలేని నిజం.
