Begin typing your search above and press return to search.

పింక్ శారీలో వర్షాకాలపు వేళ గిలిగింతలు పెడుతున్న అమైరా!

వర్షాకాలం మొదలైన నేపథ్యంలో అటు సెలబ్రిటీలు ఈ సీజన్ ను మరింత సెలబ్రేట్ చేసుకుంటున్నారు.

By:  Madhu Reddy   |   25 Jun 2026 12:02 PM IST
పింక్ శారీలో వర్షాకాలపు వేళ గిలిగింతలు పెడుతున్న అమైరా!
X

వర్షాకాలం మొదలైన నేపథ్యంలో అటు సెలబ్రిటీలు ఈ సీజన్ ను మరింత సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏకంగా రూఫ్ పై ఫోటోలకు ఫోజులిస్తూ షేర్ చేస్తున్న ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఎప్పుడూ సాంప్రదాయంగా కనిపిస్తూ అప్పుడప్పుడు గ్లామర్ ఒలకబోస్తూ ప్రేక్షకులను, ఇటు నెటిజెన్స్ ను అలరించే ఎంతోమంది సెలబ్రిటీలు ఈ సీజన్లో తమ అందాలను రెట్టింపు చేసుకొని గ్లామర్ లుక్ లో కనిపించి హొయలు పోతున్నారు. అటు సాంప్రదాయంగా కనిపిస్తూనే ఇటు సెగలు పుట్టించేలా ఫోటోలకు ఫోజులిస్తున్నారు.





అలాంటి వారిలో ప్రముఖ హీరోయిన్ అమైరా దస్తూర్ కూడా ఒకరు. అందం, అభినయంతో అలరిస్తూ కుర్ర కారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఈ వర్షాకాలన్ని తనకు అనుకూలంగా మార్చుకుందేమో అన్నట్లుగా ఫోటోలకు ఫోజులిచ్చింది. పెంకుటిల్లు పై రూఫ్ ఎక్కిన ఈమె అక్కడ వెల్లకిలా పడుకొని చీరకట్టులో గ్లామర్ వలకబోసింది.. ఉల్లి పొరలాంటి సిఫాన్ పింక్ కలర్ చీర కట్టుకున్న ఈమె.. దీనికి కాంబినేషన్లో డీప్ ఫ్రంట్ వీక్ కలిగిన స్లీవ్ లెస్ బ్లూ కలర్ బ్లౌజ్ ధరించి తన లుక్కును పర్ఫెక్ట్ గా మార్చుకుంది. మొత్తానికైతే ఈ చీరకట్టులో గ్లామర్ వలకబోస్తూ ఈమె షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.





మోడల్గా తన కెరీర్ను మొదలుపెట్టిన ఈమె.. 2013లో వచ్చిన ఇసాక్ అనే చిత్రం ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టింది. బాలీవుడ్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈమె ఆ తర్వాత తెలుగు, తమిళ్ భాష చిత్రాలలో కూడా నటించింది. హిందీలోకి వచ్చింది 2013 లోనే అయినా తెలుగులో మాత్రం మనసుకు నచ్చింది అనే సినిమాతో 2018లో అడుగుపెట్టి, ఆ తర్వాత రాజుగాడు అనే మరో తెలుగు సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.





ఈ సినిమా తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు. కానీ ఎక్కువగా హిందీ , తమిళ్ చిత్రాలలో నటిస్తూ తన సినిమా కెరియర్ను కొనసాగిస్తున్న ఈమె అటు వెబ్ సిరీస్లలో కూడా నటించింది. 2018లో వచ్చిన ది ట్రిప్ 2 అనే హిందీ, ఇంగ్లీష్ వెబ్ సిరీస్ తో ఓటిటి రంగంలోకి అడుగుపెట్టిన అమైరా .. 2021లో తాండవ్, 2022లో డోంగ్రి టు దుబాయ్ వంటి వెబ్ సిరీస్లలో నటించి ఆకట్టుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలలో అవకాశాలు అందుకుంటోంది. ఇటు సోషల్ మీడియాలో గ్లామర్ వలకబోస్తూ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేస్తోంది.