పిక్‌టాక్ : ఎరుపెక్కిన అమైరా అందాల షో
కమర్షియల్ యాడ్స్‌లో నటించడం ద్వారా గుర్తింపు దక్కించుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్.
By: Ramesh Palla | 2 Sept 2025 12:36 PM ISTకమర్షియల్ యాడ్స్‌లో నటించడం ద్వారా గుర్తింపు దక్కించుకుని ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అమైరా దస్తూర్. తక్కువ సమయంలోనే ఈ అమ్మడికి ఎక్కువ సినిమాల్లో నటించే అవకాశాలు దక్కాయి. కానీ అదృష్టం కలిసి రాలేదు, ఆమెకు ఆశించిన స్థాయిలో హిట్స్ రాకపోవడంతో కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు ఒడిదొడుకులు ఎదుర్కొంటూనే ఉంది. 2013 నుంచి ఇప్పటి వరకు సినిమాల్లో నటిస్తూ, వార్తల్లో నిలుస్తూనే ఉంది అంటే కారణం ఆమె అందం అనడంలో సందేహం లేదు. ఆకట్టుకునే అందం తో పాటు మంచి ఫిజిక్ ఈ అమ్మడి సొంతం అని ఎన్నో సందర్భాల్లో నిరూపితం అయ్యింది. మరోసారి తన అందమైన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించింది. అందమైన ఈ అమ్మడి యొక్క అందాల షో తో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
అమైరా దస్తూర్ అందాల ఆరబోత
ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 35 లక్షల మంది ఫాలోవర్స్‌ను కలిగి ఉన్న అమైరా దస్తూర్ ఎప్పుడు ఏ ఫోటోలు షేర్ చేసినా వైరల్ కావడం చాలా కామన్ విషయం. ఇప్పుడు అదే తీరున అమైరా దస్తూర్ అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా చూపు తిప్పుకోలేక పోతున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈసారి రెడ్ డ్రెస్ లో నడుము అందం చూపిస్తూ, నాభి షో చేయడం ద్వారా అమైరా దస్తూర్ హీట్ పెంచేసింది. బయట ఉన్న చలికి అమైరా షేర్ చేసిన ఫోటోలతో ఒక్కసారిగా హీట్ పెరిగి పోయిందని నెటిజన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి అందాల షో చేయడం ద్వారా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలిచిన అమైరా దస్తూర్ సినిమాల్లో ఆఫర్లు దక్కించుకోలేక పోవడం మాత్రం చాలా బాధాకరం అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో అందమైన అమైరా
అమైరా దస్తూర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏ ఫోటో షేర్ చేసినా వైరల్ అవుతోంది. ఈమె కెరీర్ ఆరంభం నుంచి ఇప్పటి వరకు అందే అందంతో ఆకట్టుకుంటూ ఉంది. మూడు పదుల వయసులో చేరిన ఈ అమ్మడు ముందు ముందు అయినా మరిన్ని సినిమా ఆఫర్లు దక్కించుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆకట్టుకునే అందం తో పాటు నటన ప్రతిభ ఉన్నా కూడా ఆఫర్లు ఈ అమ్మడికి రాకపోవడానికి కారణం అదృష్టం లేకపోవడం అంటూ కొందరు కామెంట్స్ చేస్తే, కొందరు మాత్రం ఇప్పుడు కాకున్నా ముందు రోజుల్లో అయినా అమైరా దస్తూర్ ఖచ్చితంగా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు దక్కించుకుంటుందని, ఈ అందాల ఆరబోతను కంటిన్యూ చేయాలని చాలా మంది నెటిజన్లు కోరుతున్నారు. అమైరా దస్తూర్ యొక్క అందాల షో ఫోటోలు ఎప్పటిలాగే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మనసుకు నచ్చింది, రాజు గాడు సినిమాల్లో..
తెలుగు సినిమా మనసుకు నచ్చింది తో 2018లో అడుగు పెట్టిన అమైరా దస్తూర్ ఆ వెంటనే రాజు గాడు సినిమాలో నటించే అవకాశాలు దక్కించుకుంది. కానీ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటం తో మళ్లీ తెలుగు నుంచి ఆఫర్ వచ్చినా సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. తెలుగు ప్రేక్షకులకు సినిమాలతో దూరం అయినా ఫోటోలతో దగ్గరగానే ఉంది. ముంబైలోని ఒక పార్సీ ఫ్యామిలీలో జన్మించిన ఈమె ముంబైలోని హెచ్‌ఆర్ కాలేజ్ నుంచి బిజినెస్‌లో బ్యాచిలర్ డిగ్రీని అందుకుంది. బాలీవుడ్‌లో గత ఏడాది సైతం ఈమె నటించిన సినిమా ఒకటి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు ఒక సినిమాకు ఈమె కమిట్ అయిందని, అతి త్వరలోనే ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వస్తుందని సమాచారం అందుతోంది. మళ్లీ తెలుగులో కూడా ఈమె నటించాలని టాలీవుడ్ ప్రేక్షకులు కోరుకుంటున్నారు. మరి అందుకు ఒప్పుకుంటుందా అనేది చూడాలి.
