Begin typing your search above and press return to search.

గార్జియస్ లుక్ లో అమృత!

అమృత అయ్యర్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

By:  Madhu Reddy   |   27 Oct 2025 10:18 AM IST
గార్జియస్ లుక్ లో అమృత!
X

అమృత అయ్యర్.. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా ప్రముఖ యాంకర్ ప్రదీప్ మాచిరాజుతో కలిసి '30 రోజుల్లో ప్రేమించడం ఎలా?' అనే సినిమాతో ఓవర్ నైట్ లోనే లైమ్ లైట్ లోకి వచ్చేసింది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో తేజ సజ్జ నటించిన హనుమాన్ సినిమాలో హీరోయిన్గా నటించి మరోసారి ప్రేక్షకులను అబ్బురపరిచింది.





ఈ సినిమాలో ఈమె నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. అంతేకాదు ఈ సినిమా తర్వాత ఆఫర్లు వరుసగా తలుపు తడతాయని అందరూ అనుకున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో అవకాశాలు అయితే రాలేదు. ఇక బచ్చల మిల్లి సినిమాలో అల్లరి నరేష్ సరసన హీరోయిన్గా నటించినా కానీ ఈ సినిమా కూడా ఈమెకు కలిసి రాలేదని చెప్పాలి. ఇకపోతే అటు సినిమాలకు ఇటు సోషల్ మీడియాకి కూడా కాస్త దూరంగా ఉన్న ఈమె తాజాగా తన స్నేహితులతో కలిసి సరదాగా గడిపిన క్షణాలను ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసుకుంది..ఆ ఫోటోలలో చాలా గార్జియస్ లుక్ లో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది అమృత అయ్యర్.





తాజాగా స్లీవ్ లెస్ ముదురు నీలం రంగు దుస్తులు ధరించిన ఈమె.. ఆ దుస్తులలో తన ఆత్మవిశ్వాసాన్ని రేకెత్తించింది. బోల్డ్ స్లిట్ తో కప్పబడిన స్కర్ట్ ఆమెకు క్లాసీ లుక్కును అందించింది. ఈ గ్లామర్ లుక్కులో చాలా రిలాక్స్డ్ గా కనిపించి సరికొత్త వైబ్ క్రియేట్ చేసింది అమృత అయ్యర్. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి చాలా రోజుల తర్వాత ఇలాంటి లుక్కులో చూసేసరికి అభిమానులు ఈ ఫోటోలను తెగ లైక్, షేర్ చేస్తున్నారు.





అమృత అయ్యర్ విషయానికి వస్తే.. 1994 మే 14న తమిళనాడులోని చెన్నైలో తమిళ్ మాట్లాడే కుటుంబంలో జన్మించింది. కర్ణాటకలోని బెంగళూరులో పెరిగిన ఈమె అక్కడే ఎన్ హెచ్ ఆర్ పాఠశాలలో స్కూల్ విద్యాభ్యాసం పూర్తి చేసి, సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. 2018లో తమిళ చిత్రం పడైవీరన్ సినిమాతో తొలిసారి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈమె ఆ తర్వాత బిగిల్, లిఫ్ట్ వంటి చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది..





రెడ్ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈమె.. ఆ తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమా చేసి ఆకట్టుకుంది. హనుమాన్ సినిమాతో వంద కోట్ల క్లబ్లో చేరిన ఈమె బచ్చల మిల్లి , అర్జున ఫాల్గుణ సినిమాలు చేసింది..