అమితాబ్ పాదాలకు నమస్కరిస్తే.. బెదిరింపులా?
బాలీవుడ్ దిగ్గజ నటుడు.. సీనియర్ మోస్ట్ కథానాయకుడు .. అమితాబ్ బచ్చన్‌కు బెదిరింపులు వచ్చాయి.
By: Garuda Media | 31 Oct 2025 7:00 PM ISTబాలీవుడ్ దిగ్గజ నటుడు.. సీనియర్ మోస్ట్ కథానాయకుడు .. అమితాబ్ బచ్చన్‌కు బెదిరింపులు వచ్చాయి. అయితే.. ఆయనకు ఏ వర్గం నుంచి బెదిరింపులు వచ్చాయన్న విషయాన్ని కేంద్ర నిఘా వర్గాలు చెప్పలేదు. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్‌కు భద్రతను పెంచుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయనకు వై కేటగిరీ బద్రత ఉన్న విషయం తెలిసిందే. ఆయన సతీమణి రాజ్యసభ సభ్యురాలు.
అసలు ఏం జరిగింది?
అమితాబ్ .. కౌన్ బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇటీవల పంజాబ్‌కు చెందిన వర్థమాన గాయకుడు.. దిల్జీత్ దోసాంజ్ హాజరయ్యారు. అయితే.. ఆయన అమితాబ్ గౌరవార్థం.. తనకు ప్రియమైన కథానాయకుడిపై ఉన్న అభిమానంతో వేదికపైకి ఎక్కుతూనే అమితాబ్ పాదాలకు నమస్కారం చేశారు. ఇది.. పెను వివాదానికి దారి తీసింది. అమితాబ్ ఉత్తరాది బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఆయనకు సిక్కు అయిన దిల్జీత్ నమస్కారం చేయడం ఏంటనేది ప్రధాన వివాదం.
ఈ వివాదంలోకి నిషేధిత ఖలీస్థానీ ఉగ్రవాదులు ప్రవేశించారు. ఈ క్రమంలో తొలుత దిల్జీత్‌నే వారు హెచ్చరించారు. అంతేకాదు.. శనివారం నిర్వహించనున్న దిల్జీత్ కార్యక్రమాన్ని నిలిపి వేయాలని ఆదేశించారు. ఒకవేళ తమ ఆదేశాలు కాదని.. నిర్వహిస్తే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే అమితాబ్‌కు బెదిరింపులు వచ్చాయని తెలుస్తోంది. అయితే.. ఎవరు ఆయనను బెదిరించారో.. కేంద్ర నిఘా వర్గాలు వెల్లడించడం లేదు.
తీవ్ర విమర్శలు..
దేశానికి మంచి పేరు తెచ్చిన అమితాబ్ బచ్చన్.. కులాలకు, మతాలకు అతీతంగా అభిమానుడని.. పంజాబ్‌లోని కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఆయన పాదాలకు నమస్కరించడం.. వర్ధమాన గాయకుడిగా దిల్జిత్ చేసిన మంచిపనేనని అంటున్నాయి. ఇలా బెదిరింపులకు దిగడం సరికాదని.. సంస్కృతి, సంప్రదాయాలను, పెద్దల పట్ల గౌరవాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయ.
