భార్య కోపానికి గురికాకుండా లెజెండరీ నటుడి ట్రిక్!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వెండితెరపై ఎలాంటి పాత్రలు పోషించినా? రియల్ లైఫ్‌లో మాత్రం సతీమణి జయ బచ్చన్ ముందు ఎంతో సరదాగా ఉంటారనే విషయం తెలిసిందే.
By: Srikanth Kontham | 25 Aug 2026 7:00 PM ISTబాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వెండితెరపై ఎలాంటి పాత్రలు పోషించినా? రియల్ లైఫ్‌లో మాత్రం సతీమణి జయ బచ్చన్ ముందు ఎంతో సరదాగా ఉంటారనే విషయం తెలిసిందే. కుటుంబంలో చోటుచేసుకుని సరదా విశేషాలు వేటిని మిస్ అవ్వకుండా అభిమానులతో పంచుకుంటారు. తాజాగా అమితాబ్ ఇంటి సీక్రెట్‌ను బయటపెట్టారు. సాధారణంగా ఇలాంటి విషయాలు ఎంత గొప్ప భర్త అయినా సీక్రెట్ గా ఉంచుతారు. చెబితే జనాలు నవ్వుతారేమోనని భయపడతారు. భార్య గుట్టు బయటకు తెలిస్తే? జోకులేసుకుంటారేమోనని అంతా ఆందోళన చెందుతుంటారు.
కానీ అమితాబచ్చన్ మాత్రం ఎలాంటి మోహమాటం లేకుండా ఎంచక్కా ఇంటి గుట్టు విప్పారు. భార్య జయ బచ్చన్ కోపానికి గురికాకుండా ఉండటానికి తాను ఎలాంటి ట్రిక్స్ ఉపయోగిస్తానో అమితాబ్ స్వయంగా వెల్లడించారు. సాధారణంగా ప్రతి ఇళ్లలోనూ భార్యాభర్తల మధ్య చిన్నచిన్న సరదా గొడవలు, కోపాలు సర్వసాధారణమే. అయితే అమితాబ్ బచ్చన్ లాంటి లెజెండరీ యాక్టర్ ఇంట్లో కూడా ఈ పరిస్థితి ఉంటుందని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. జయ బచ్చన్ ఎప్పుడైనా కోపంగా ఉంటే ఆ వాతావరణాన్ని శాంతపరచడానికి తాను ఇంట్లోని చిన్నచిన్న పనుల్లో సహాయం చేస్తానని అమితాబ్ సరదాగా తెలిపారు.
ఇంట్లో శుభ్రత పనుల బాధ్యతను తాను స్వయంగా తీసుకుంటానని పేర్కొన్నారు. ఇళ్లలోని వస్తువులను సర్దడం, శుభ్రం చేయడం వంటి పనుల్లో పాలుపంచుకోవడం ద్వారా జయ బచ్చన్ ఆగ్రహాన్ని చాలా వరకు తగ్గించవ చ్చన్నా రు. భార్య కోపాన్ని చల్లార్చడానికి ఇంతకంటే మంచి మార్గం మరొకటి ఉండదని అమితాబ్ నవ్వేసారు. కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా? కుటుంబంతో గడపడానికి అమితాబ్ ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎదురైన మధురమైన జ్ఞాపకాలను, ఇంటి విషయాలను ఆయన అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.
తాజాగా బయటపెట్టిన సరదా ఇంటి చిట్కా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ హోదాలో ఉన్న వ్యక్తి కూడా సాధారణ భర్తలాగే ఇంట్లో పనులు చేస్తూ భార్య కోపాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించడం చూసి నెటిజ న్లు ఫిదా అవుతున్నారు. ఈ క్యూట్ అండ్ ఫన్నీ డిస్కషన్ అభిమానుల మధ్య చర్చనీయాంశంగా మారింది.
ఇక అమితాబ్ సినిమాల విషయానికి వస్తే 80 ఏళ్ల వయసులోనూ బిగ్ బీ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. ఏ భాషలో అవకాశం వచ్చినా ? కాదనకుండా పనిచేస్తున్నారు. మంచి పాత్రలు ఆఫర్ చేస్తే భాషతో సంబంధం లేని ప్రతీ సందర్బంలోనూ నిరూపిస్తున్నారు. ప్రస్తుతం `కల్కి 2` లో నటిస్తున్నారు. ఇందులో అమితాబ్ పాత్ర మొదటి భాగం వలే పవర్ పుల్ గా ఉంటుందా? ఉండదా? అన్న చర్చ ఇప్పటికే నెట్టింట జరుగుతోంది.
