Begin typing your search above and press return to search.

షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు ఒకేసారి మూడు సమస్యలు ఎదురయ్యాయి. ఆయన నివాసం జల్సాకు బాంబు బెదిరింపులు రావడంతో పాటు, ఆ బంగ్లాపై వారసత్వ హక్కుల వివాదం మొదలైంది. అమితాబ్ సోదరుడి భార్య రమోలా.. జయా బచ్చన్‌కు 1993లో జరిగిన గిఫ్ట్ డీడ్‌ను కోర్టులో సవాలు చేశారు. మరోవైపు జయా తల్లి ఇందిరా బాధురి (95) ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

By:  Sivaji Kontham   |   13 Nov 2026 9:39 AM IST
షాకింగ్: బాలీవుడ్ మెగాస్టార్ కుటుంబంలో ఆస్తి వివాదాలు?
X

ఓవైపు మెగాస్టార్ ఇంటికి గ్యాంగ్ స్ట‌ర్ బెదిరింపులు.. మ‌రోవైపు ఆస్తి త‌గాదా..! ఇంకోవైపు ఆయ‌న అత్త‌ గారు హాస్పిట‌లైజేష్. ముంబై ప‌రిశ్ర‌మ‌లో ప్ర‌స్తుతం ఈ మూడు ఘ‌ట‌న‌ల‌పైనా పెద్ద చ‌ర్చ సాగుతోంది. ఒకేసారి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ అన్నిటినీ స‌మ‌ర్థంగా ఎదుర్కొంటున్నారు. ఆయ‌న మొక్క‌వోని ధీక్ష‌తో న‌ట‌న ప‌రంగా త‌న క‌మిట్ మెంట్ల‌ను పూర్తి చేస్తూనే, రోజువారీ కార్య‌క‌లాపాల‌ను కొన‌సాగిస్తున్నారు. అదే స‌మ‌యంలో అభిమానుల‌ను కూడా ప‌ల‌క‌రిస్తున్నారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ వార‌స‌త్వ సంప‌ద‌గా, సొంత ఇల్లుగా ప్రచారంలో ఉన్న‌ `జల్సా` కుటుంబ వివాదానికి కార‌ణమైంది. జయా బచ్చన్‌కు ప్రతిష్టాత్మక బంగ్లాను బదిలీ చేసే బహుమతి పత్రాన్ని అమితాబ్ సోద‌రుడు (త‌మ్ముడు) అజితాబ్ బ‌చ్చ‌న్ భార్య‌ రమోలా కోర్టులో సవాలు చేశారు. ప్ర‌స్తుతం జ‌ల్సా బంగ్లా గురించిన వివాదం న‌డుస్తుండ‌గానే...మ‌రోవైపు ఆ ఇంటికి ఈమెయిల్ ద్వారా ఇప్ప‌టికే మూడు సార్లు బాంబు బెదిరింపులు ఎదుర‌వ్వ‌డం క‌ల‌క‌లం రేపింది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప‌నేనా? ఇది అంటూ ముంబై పోలీసులు దీనిపై ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇంత‌లోనే ఇప్పుడు ఊహించ‌ని లీగ‌ల్ ట్విస్టు ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అమితాబ్ వ‌దిన గారు జ‌ల్సా ఇంటి వార‌స‌త్వ హ‌క్కుల‌పై కోర్టులో స‌వాల్ చేయ‌డంతో ఈ వివాదంపై ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు మొద‌ల‌య్యాయి.

ఇదే స‌మ‌యంలో అమితాబ్ బ‌చ్చ‌న్ అత్త గారైన ఇందిరా బాధురి (జ‌యాబ‌చ్చ‌న్ త‌ల్లి- వ‌య‌సు 95) ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్నార‌నే వార్త అందింది. అయితే వ‌య‌సు సంబంధ స‌మ‌స్య‌ల‌తో పాటు హార్ట్ సంబంధ స‌మ‌స్య‌ల‌కు చికిత్స పొందుతున్న ఆమె కోలుకుంటున్నార‌ని స‌మాచారం. ఇవి మూడూ మూడు భిన్న‌మైన‌ ఘ‌ట‌న‌లు. కానీ ఒకే స‌మ‌యంలో మీడియాలో హాట్ టాపిగ్గా మారాయి.

అస‌లు `జ‌ల్సా` ఎలా వివాదంలోకి వ‌చ్చింది?

అస‌లు జ‌ల్సా వివాదం పూర్వాప‌రాల్లోకి వెళితే... నిజానికి ఈ భ‌వంతిని జ‌యాబ‌చ్చ‌న్ గిఫ్ట్ డీడ్ గా పొందారు. అయితే అమితాబ్ తమ్ముడు అజితాబ్ బచ్చన్ భార్య రమోలా బచ్చన్.. 1993లో జయా బచ్చన్ పేరిట జరిగిన గిఫ్ట్ డీడ్‌ను సవాలు చేస్తూ గత ఏడు నెలలుగా రిజిస్ట్రేషన్ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. తనకు తెలియకుండా.. తన అనుమతి లేకుండానే ఈ బదిలీ జరిగిందని ఆమె ఆరోపిస్తున్నారు. కపోల్ హౌసింగ్ సొసైటీ రికార్డుల్లో జయా బచ్చన్ పేరు ఉన్నా .. ప్రభుత్వ ప్రాపర్టీ కార్డులో ఇప్పటికీ తన పేరే ఉందని.. దానిని తొలగించే ప్రయత్నాలు జరగడంతోనే ఈ వివాదం తెరపైకి వచ్చిందని రమోలా పేర్కొన్నారు. అంతేకాకుండా 1993 నాటి ఆ గిఫ్ట్ డీడ్‌ను ఎలాంటి స్టాంప్ డ్యూటీ చెల్లించకుండా.. సాక్షులు లేకుండా తెల్ల కాగితంపై తయారు చేశారని.. తర్వాత `అభయ్ యోజన` పథకం కింద దానిని క్రమబద్ధీకరించిన తీరుపైనా అమితాబ్ సోద‌రుని భార్య‌ ర‌మోలా అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారం ప్రస్తుతం అంధేరిలోని కో-ఆపరేటివ్ సొసైటీస్ డిప్యూటీ రిజిస్ట్రార్ కార్యాలయానికి చేరగా.. ఫిర్యాదు అందినట్లు ధృవీకరించిన డిప్యూటీ రిజిస్ట్రార్ ఫయాజ్ ములానీ విచారణ ప్రారంభించి ప్రతివాదులను వివరణ కోరినట్లు తెలిపారు. గతంలో నిర్మాత ఎన్.సి. సిప్పీ వద్ద ఉన్న ఈ బంగ్లాను 1982లో `సత్తే పే సత్తా` సినిమా పారితోషికంగా అమితాబ్ పొందినట్లు కథనాలు వ‌చ్చాయి. దశాబ్దాలుగా బచ్చన్ కుటుంబానికి చిరునామాగా నిలిచిన `జల్సా`పై ఇప్పుడు న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. కాగా ఈ వివాదంపై అమితాబ్, జయా బచ్చన్ ఇంకా స్పందించాల్సి ఉంది.