Begin typing your search above and press return to search.

90కోట్ల అప్పుతో దివాళా..55 కోర్టు కేసులు.. అయినా ఈ స్టార్ జ‌గజ్జేత‌!

బాలీవుడ్‌లో అత్యంత ధనవంతుడైన నటుడు షారుఖ్ ఖాన్, అత్యంత ధనవంతురాలైన నటి జూహి చావ్లా. కానీ 82 ఏళ్ల వయసులో అమితాబ్ టాప్ 5లో ఒకరిగా నిలిచాడు.

By:  Sivaji Kontham   |   7 Oct 2025 10:22 AM IST
90కోట్ల అప్పుతో దివాళా..55 కోర్టు కేసులు.. అయినా ఈ స్టార్ జ‌గజ్జేత‌!
X

దాదాపు 90కోట్ల అప్పుతో అత‌డు దివాళా తీసాడు. కోర్టులో త‌న‌పై 55 కేసులు న‌మోద‌య్యాయి. అయినా అన్నిటినీ త‌న ధృఢ సంక‌ల్పం హార్డ్ వ‌ర్క్ తో అధిగ‌మించాడు. అప్పుల‌న్నీ తీర్చేయ‌డ‌మే గాక‌, ఈరోజు హ్యాపీయెస్ట్ స్టార్ గా త‌న కుటుంబాన్ని ముందుకు న‌డిపిస్తున్నాడు. అంతేకాదు.. తెలివైన పెట్టుబ‌డుల‌తో బాలీవుడ్ లో వేరే ఎవ‌రూ సాధించ‌లేని స్థాయికి ఎదిగాడు. దాదాపు 1630 కోట్ల ఆస్తుల‌తో బాలీవుడ్‌లోని రిచెస్ట్ స్టార్ ల‌ జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. ఆయ‌న ఎవ‌రో తెలుసా? ... క‌చ్ఛితంగా అది బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్.

బాలీవుడ్‌లో అత్యంత ధనవంతుడైన నటుడు షారుఖ్ ఖాన్, అత్యంత ధనవంతురాలైన నటి జూహి చావ్లా. కానీ 82 ఏళ్ల వయసులో అమితాబ్ టాప్ 5లో ఒకరిగా నిలిచాడు. 90 కోట్ల అప్పు తీర్చి 55 కోర్టు కేసుల‌లో నిరూపించుకుని ఆ తర్వాత తన కెరీర్‌ను పునరుద్ధరించుకున్నాడు. ఏబీ కార్పొరేష‌న్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థ‌ను స్థాపించి సినిమాలు నిర్మించి తీవ్రంగా న‌ష్ట‌పోయి అప్పుల‌పాలైన అమితాబ్ ఒకానొక ద‌శ‌లో దివాళా స్థితిని ఎదుర్కొని తిరిగి కంబ్యాక్ అయిన తీరు ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే. తీవ్ర‌మైన ఒత్తిళ్లు, అనారోగ్యాన్ని కూడా ఎదుర్కొన్న‌ అమితాబ్ జీవితం ఇత‌రుల‌కు వాస్త‌వానికి అతిపెద్ద స్ఫూర్తి.

ద‌శాబ్ధాలుగా ఆయ‌న స్టార్ డ‌మ్ విస్త‌రిస్తోందే కానీ త‌ర‌గ‌డం లేదు. ఇప్ప‌టికీ బుల్లితెర హోస్ట్ లలో అత్యుత్త‌మ హోస్ట్ గా అత‌డు మ‌న్న‌న‌లు అందుకుంటున్నారు. ద‌క్షిణాదినా అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న ఏకైక బాలీవుడ్ స్టార్ అత‌డు. 82 వ‌య‌సులోను నిరంత‌రం బ్లాగులు రాస్తూ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నారు. ఇన్నిర‌కాల బిజీ షెడ్యూల్స్ ని ఎలా నిర్వ‌హించాలో ఆయ‌న నేటిత‌రానికి నేర్పిస్తున్నారు. షారూఖ్‌, హృతిక్ త‌న‌కంటే ర్యాంక్ ప‌రంగా ధ‌న‌వంతులు కావొచ్చు.. కానీ త‌న‌లోని నిబ‌ద్ధ‌త‌, క్ర‌మ‌శిక్ష‌ణ, కార్య‌ద‌క్ష‌త‌ ముందు ఎవ‌రూ స‌రిపోర‌ని అమితాబ్ నిరూపిస్తున్నారు.

అమితాబ్ బ‌చ్చ‌న్ ఇటీవ‌ల ద‌క్షిణాది స్టార్ల సినిమాల్లో అతిథి పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. కానీ అశ్వ‌త్థామ‌గా క‌ల్కి 2898 ఏడి చిత్రంలో పూర్తి నిడివి పాత్ర‌తో ఔరా అనిపించారు. త‌దుప‌రి క‌ల్కి 2లోను ఆయ‌న న‌టించ‌నున్నారు.