24 గంటల షిఫ్ట్ తర్వాత కేబీసీ షూటింగ్‌కు మెగాస్టార్!
ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి వృత్తిపరమైన అంకితభావాన్ని చాటుకున్నారు. వయసు 83 ఏళ్లు దాటినా? పనిపట్ల ఆయన చూపుతున్న ఉత్సాహం .. నిబద్ధత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
By: Srikanth Kontham | 6 Aug 2026 4:03 PM ISTపని గంటల విషయంలో బాలీవుడ్ హీరోయిన్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్న సంగతి తెలిసిందే. అందరిలాగే తమకు 8 గంటల పని విధానం తీసుకురావాలని...అదనంగా పనిచేస్తే అదనరంగా పైకం చెల్లించాలనే డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ విషయంపై చాలా మంది నటీమణులు ఎంతో ఓపెన్ గా మాట్లాడారు. దీపికా పదుకొణే అయితే పని గంటలు నచ్చక వదులకున్న ప్రాజెక్ట్ లు ఎన్నో ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మరోసారి వృత్తిపరమైన అంకితభావాన్ని చాటుకున్నారు. వయసు 83 ఏళ్లు దాటినా? పనిపట్ల ఆయన చూపుతున్న ఉత్సాహం .. నిబద్ధత అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ప్రముఖ టెలివిజన్ క్విజ్ రియాలిటీ షో `కౌన్ బనేగా కరోడ్‌పతి` కొత్త సీజన్ షూటింగ్ కోసం అమితాబ్ బచ్చన్ ఏకంగా 24 గంటల పాటు నిరంతరం పనిచేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఆయన షూటింగ్ షిఫ్ట్ మరుసటి రోజు ఉదయం 7 గంటల వరకు నిర్విరామంగా సాగింది. ఈ సుదీర్ఘమైన .. కఠినమైన పనివేళల గురించి బిగ్ బీ ఇలా రాసుకొచ్చారు. సమయానికి పనులను పూర్తి చేయడం ఎంత ముఖ్యమో వివరించారు. అనుకున్న సమయానికి అంతా పూర్తి చేసినట్లు అమితాబ్ తెలిపారు. `సమయం చిక్కింది. ఉదయం 7 గంటలకు ముగిసింది.
నిన్న ఉదయం 7 గంటలకు మొదలైన పని ఇది. కానీ దీని ప్రెజెంటేషన్ ..సమయపాలన ఎంతో అవసరం. అందుకే దాన్ని పూర్తి చేశాను` అంటూ తన బ్లాగ్‌లో రాసుకొచ్చారు. కేబీసీ మొదటి ప్రసార తేదీ ఇప్పటికే ఖరారైందని.. ఒకవేళ తాను ఆ పనిని చేయడంలో విఫలమైతే తన స్థానంలో మరొకరిని తీసుకునేవారని సరదాగా వ్యాఖ్యానించారు .` ఎనభై ఏళ్ల వయసులోనూ ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ప్రతి క్షణాన్ని పనికే అంకితం చేస్తున్న అమితాబ్ బచ్చన్ తీరు నేటి యువ నటులకు ఒక పాఠం లాంటిది. చిన్న చిన్న అలసటలకే వెనకడుగు వేసే రోజుల్లో అమితాబ్ డెడికేషన్ ఎప్పటికీ ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలబెడుతుంది.
ఆరోగ్యపరమైన సవాళ్లు ఎదురవుతున్నా? కెరీర్ ప్రారంభం నాటి ఉత్సాహాన్నే ఇప్పటికీ కొనసాగించడం అమితాబ్ గొప్పతనానికి నిదర్శనం. అమితాబ్ ఇప్పటికీ సినిమాల్లో అంతే యాక్టివ్ గా పనిచేస్తున్నారు. యాక్షన్ సన్నివేశౄలైనా..రిస్క్ షాట్ప్ అయినా ఏమాత్రం రాజీ పడకుండా పని చేస్తున్నారు. `కల్కి` సినిమాలో అశ్వథామ పాత్రల కోసం అమితాబ్ ఎంతగా శ్రమించారో? తెరపై కనిపించిన సంగతి తెలిసిందే. కల్కి 2 లో అంతకు మంచి అమితాబ్ పాత్ర హైలైట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అలాగే బాలీవుడ్ లో సైతం ఛాలెంజింగ్ రోఎల్స్ వచ్చినా? ఎక్కడా రాజీ పడకుండా కమిట్ అవుతున్నారు.
