Begin typing your search above and press return to search.

థియేటర్‌లోనే చూడండి.. త‌ర్వాత పశ్చాత్తాప ప‌డ‌తారు!

నాగబంధం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహించిన సనాతన గర్జన గ్రాటిట్యూడ్ మీట్‌లో యాక్ట‌ర్ అమిత్ తివారి చేసిన ఎమోష‌న‌ల్ కామెంట్స్ అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి.

By:  Sravani Lakshmi Srungarapu   |   6 July 2026 7:18 PM IST
థియేటర్‌లోనే చూడండి.. త‌ర్వాత పశ్చాత్తాప ప‌డ‌తారు!
X

నాగబంధం సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా నిర్వహించిన సనాతన గర్జన గ్రాటిట్యూడ్ మీట్‌లో యాక్ట‌ర్ అమిత్ తివారి చేసిన ఎమోష‌న‌ల్ కామెంట్స్ అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. సినిమా స‌క్సెస్‌కు కారణమైన ప్రేక్షకులు, మీడియా, చిత్రబృందానికి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, నాగబంధం లాంటి సినిమాలను తప్పకుండా థియేటర్లలో చూసి ఆదరించాలని ప్రేక్షకులకు ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. తాను ఈ స‌క్సెస్ మీట్ కు రావడానికి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయని చెప్పిన అమిత్ మొదటిది, ఆడియ‌న్స్ తో నేరుగా మాట్లాడాలని అనిపించడం. రెండోది, నాగబంధం లాంటి సినిమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ కాకూడదనే మెసేజ్ ను ఇవ్వాల‌నుకోవ‌డ‌మ‌ని చెప్పారు. అంతేకాదు, ఇలాంటి సినిమాల‌ను థియేటర్లలో చూడకపోతే, ఆడియ‌న్స్ ఒక అద్భుతమైన సినీ అనుభూతిని కోల్పోతారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సినిమాలో ఆకట్టుకునే కథ, అద్భుతమైన విజువల్స్, ప్రతి నటుడి నుంచి వచ్చిన స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ ఆడియ‌న్స్ ను కట్టిపడేస్తాయని అమిత్ తివారి అన్నారు. ఇలాంటి క్వాలిటీ సినిమాలు తరచుగా రావని, అందుకే వాటిని బిగ్ స్క్రీన్ పై ఫ్యామిలీ మెంబ‌ర్స్, ఫ్రెండ్స్ తో కలిసి ఆస్వాదించాలని కోరారు. థియేటర్‌లో మాత్రమే ఈ సినిమా అసలు అనుభూతి అందుతుందని ఆయన పేర్కొన్నారు. ప్రేక్షకులే సినిమాకు అసలైన న్యాయనిర్ణేతలని అమిత్ తివారి ఈ సంద‌ర్భంగా అన్నారు. రివ్యూలు రాసేవారు, విమర్శకులు తమ అభిప్రాయాలు చెప్పొచ్చు కానీ ఆఖ‌రికి సినిమా భవితవ్యాన్ని నిర్ణయించేది ప్రేక్షకులేనని అన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ నాగబంధంను చూసి తమ ప్రేమ, ఆశీర్వాదాలతో టీమ్ ను ఎంక‌రేజ్ చేయాల‌ని కోరారు.

ఈ సందర్భంగా నిర్మాతలు కిషోర్, నిషిత, డైరెక్ట‌ర్ అభిషేక్ నామా, హీరో విరాట్ కర్ణ, హీరోయిన్ నభా నటేష్‌తో పాటు చిత్రబృందంలోని ప్రతి సభ్యుడిని అమిత్ తివారి ప్రత్యేకంగా అభినందించారు. సినిమా రూపొందే ప్రతి దశలోనూ వారెంత కష్టపడ్డారో తాను ప్రత్యక్షంగా చూశానని, ఒక గొప్ప సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ఎంతో డెడికేష‌న్ తో వ‌ర్క్ చేశార‌ని ప్రశంసించారు.

నాగబంధం లాంటి సినిమాను తీయ‌డం అంత ఈజీ విష‌యం కాద‌ని, కథ నుంచి నిర్మాణం వరకు ప్రతి అంశంలో రాజీ పడకుండా, పూర్తి నిబద్ధతతో సినిమాను తీశార‌ని చెప్పారు. ఇలాంటి అర్థవంతమైన, టెక్నిక‌ల్ గా ఉన్నతమైన సినిమాల‌ను ప్రేక్షకులు థియేటర్లలో చూసి ప్రోత్సహిస్తేనే మంచి సినిమాలు మరింతగా వస్తాయని అమిత్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నాగబంధంకు పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ లభిస్తుండటం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని అమిత్ తివారి చెప్పారు. ఆడియ‌న్స్ ఆదరణతో ఈ సినిమా మరింత పెద్ద విజయాన్ని అందుకుంటుందనే నమ్మకాన్ని అమిత్ వ్యక్తం చేస్తూ, ఈ సినిమా హిట్‌గా మాత్రమే కాకుండా సూపర్ హిట్, బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని ఆకాంక్షించారు.