రామాయణ : సుగ్రీవుడు ఎవరో తెలుసా?
రణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న 'రామాయణ' సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి.
By: Ramesh Palla | 20 Aug 2025 11:26 AM ISTరణబీర్ కపూర్ రాముడిగా సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తున్న 'రామాయణ' సినిమాపై అంచనాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే సినిమా టైటిల్ టీజర్‌ను విడుదల చేసిన విషయం తెల్సిందే. అప్పటి నుంచి సినిమా గురించి మరింత ప్రచారం జరుగుతోంది. రావణుడిగా కన్నడ స్టార్ కేజీఎఫ్ హీరో యశ్ నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు మరింత పెరిగాయి. సినిమాలోని ప్రతి పాత్రకు పెద్ద పెద్ద స్టార్స్‌ను ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన ఈ సినిమాను రెండు లేదా మూడు పార్ట్‌లుగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి పార్ట్‌ను 2026 దీపావళి సందర్భంగా నవంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని అధికారికంగా ప్రకటించారు. ఆ తర్వాత పార్ట్‌ను 2028 దీపావళికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
రూ.1000 కోట్ల బడ్జెట్‌తో రామాయణ
ప్రముఖ దర్శకుడు నితేష్ తివారీ దర్శకత్వంలో దాదాపుగా రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. సినిమా పూర్తి అయ్యి, విడుదల సమయంకు బడ్జెట్ రెండు రెట్లు పెరిగిన ఆశ్చర్యం లేదని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఈ సినిమా కోసం తీసుకుంటున్న నటీనటుల పారితోషికాలు, సెట్స్, వీఎఫ్‌ఎక్స్ వర్క్ కి బడ్జెట్ భారీగా ఖర్చు అవుతున్నట్లు సమాచారం అందుతోంది. రామాయణ కథ ను ఇప్పటికే పదుల సార్లు ప్రేక్షకులు చూశారు. అయినా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రామాయణంలో ఎన్నో ముఖ్య పాత్రలు ఉంటాయి. అందులో సుగ్రీవుడు పాత్ర అత్యంత ముఖ్యమైనది. సీత దేవిని రావణాసురుడు ఎత్తుకు వెళ్లిన సమయంలో రాముడికి సాయంగా తన వానస సైన్యంను లంకకు పంపించిన రాజు సుగ్రీవుడు. అందుకే సుగ్రీవునికి రాముడు అత్యంత కృతజ్ఞతా పూర్వకంగా ఉంటాడని అంటారు.
రణబీర్, సాయి పల్లవి రాముడు సీతగా..
ఈ సినిమాను రెండు మూడు పార్ట్‌లుగా ప్లాన్ చేస్తున్నారు కనుక ఖచ్చితంగా సుగ్రీవ్ పాత్ర అలా వచ్చి ఇలా వెళ్లి పోయినట్లుగా కాకుండా మంచి స్క్రీన్ స్పేస్ ఉండే అవకాశం ఉంది. అదే కనుక నిజం అయితే తప్పకుండా సుగ్రీవ్ పాత్ర అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఆ పాత్రను ఎవరు పోషిస్తారా అనే చర్చ జరిగినప్పుడు పలు పేర్లు వినిపించాయట. చివరకు ఓటీటీ స్టార్‌గా పేరు దక్కించుకున్న నటుడు అమిత్ సియాల్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ సినిమాలో ఆయన ఖచ్చితంగా ఉంటాడు అని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. సుగ్రీవ్ పాత్ర కోసం టెస్ట్ షూట్ సైతం మిత్ సియాల్ పై జరిగినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. దాదాపుగా రెండు వారాల పాటు టెస్ట్ షూట్ చేసిన తర్వాత ఓకే చేశారని తెలుస్తోంది.
సుగ్రీవ్ పాత్రలో అమిత్ సియాల్
రావణుడి పాత్రకు యశ్ ను తీసుకోవడంతో అంచనాలు పెంచేసిన మేకర్స్ ప్రతి పాత్ర విషయంలోనూ అదే స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అమిత్ సియాల్ సుదీర్ఘ కాలంగా ఇండస్ట్రీలో ఉన్నాడు. సినిమాల్లో చాలా ఏళ్లుగా చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ ఎప్పుడైతే ఓటీటీ కంటెంట్ చేయడం మొదలు పెట్టాడో అప్పటి నుంచి ఈయన నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. మీర్జాపూర్ లో ఈయన చేసిన పాత్ర హైలైట్‌గా నిలిచింది. ప్రేక్షకులను మెప్పించింది. అందుకే ఈ మధ్య కాలంలో వరుసగా బాలీవుడ్ సినిమా ఆఫర్లు దక్కించుకుంటున్నాడు. ఇటీవల రైడ్ 2 అంతకు ముందు స్వాతంత్ర్య వీర్ సావర్కర్, టిక్‌డామ్, జో తేరా హై వో మేరా హై సినిమాలు చేశాడు. సుగ్రీవ్ పాత్ర చేయడం ద్వారా అమిత్ సియాల్ మరింత బిజీ కావడం ఖాయం. రామాయణ సెకండ్ పార్ట్‌లో సుగ్రీవ్ పాత్రలో అమిత్ సియాల్ కనిపించే అవకాశాలు ఉన్నాయి.
