Begin typing your search above and press return to search.

డైరెక్ట‌ర్ల‌పై సెటైర్లు వేసిన ప‌టేల్ బ్యూటీ!

బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పోకడలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

By:  Srikanth Kontham   |   25 March 2026 1:43 PM IST
డైరెక్ట‌ర్ల‌పై సెటైర్లు వేసిన ప‌టేల్ బ్యూటీ!
X

బాలీవుడ్ సీనియర్ నటి అమీషా పటేల్ చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పోకడలపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. నేటి కాలపు దర్శకులు నటీనటులను ఎంచుకునే విధానంపై ఆమె వేసిన సెటైర్లు ఇండస్ట్రీలో చర్చకు దారి తీస్తున్నాయి. ప్రతిభ కంటే సోషల్ మీడియా ఫాలోయింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నారంటూ అమ్మ‌డు చేసిన విమర్శలు నెటిజన్లను ఆలోచింపజేస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో కాస్టింగ్ అనేది కేవలం నటన ఆధారంగా కాకుండా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్యపై ఆధారపడి జరుగుతోందని అమీషా అసహనం వ్యక్తం చేశారు. `ఈ రోజుల్లో చాలా మంది దర్శకులు కేవలం ఇన్‌స్టాగ్రామర్లనే సినిమాల్లోకి తీసుకుంటున్నారు.

ఒక నటుడికి ఎన్ని మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారన్నదే ముఖ్యం తప్ప వారికి ఎంత నటన వచ్చు అనేది ఎవరూ చూడటం లేదు` అంటూ ఆమె నేటి ట్రెండ్‌పై ఘాటు గా స్పందించారు. ఇదే క్రమంలో అమీషా ధురందర్ 2 దర్శకుడు ఆదిత్య ధర్ పై ప్రశంసల వర్షం కురిపించారు. మిగతా దర్శకులలా కాకుండా ఆదిత్య ధర్ కేవలం నటన సామర్థ్యం ఉన్న నిజమైన నటులను మాత్రమే తన సినిమా కోసం ఎంచు కున్నారని కొనియాడారు. సోషల్ మీడియా పాపులారిటీకి పడిపోకుండా పాత్రకు ఎవరు న్యాయం చేస్తారనే కోణంలోనే ఆయన నటీనటుల ఎంపిక చేశారని అందుకే ధురందర్ 2 అంతటి ఘన విజయం సాధించిందని విశ్లేషించారు.

అమీషా చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్‌లోని ఇన్‌ఫ్లుయెన్సర్ కల్చర్ పై నేరుగా దాడి చేసినట్లుగా ఉన్నాయి. కేవలం రీల్స్ చేస్తూ ఫేమస్ అయిన వారిని సినిమాల్లోకి తీసుకురావడం వల్ల నటనకు ప్రాధాన్యత తగ్గిపోతుందని దీనివల్ల సినిమా నాణ్యత దెబ్బతింటుందని ఆమె హెచ్చరించిన‌ట్లు ఉందంటున్నారు. ఆదిత్య ధర్ వంటి దర్శకులు పరిశ్రమకు మార్గదర్శకంగా నిలవాలని నటనను నమ్ముకున్న వారికే అవకాశాలు ఇవ్వాలని అమీషా కోరారు.మొత్తానికి పటేల్ బ్యూటీ చేసిన ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలోని కొత్త , పాత తరం మధ్య ఉన్న అభిప్రాయ భేదాలను స్పష్టం చేస్తున్నాయి.

ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో బాక్సాఫీస్ వద్ద విజయాలు రావని, కేవలం నటన , కంటెంట్ మాత్ర మే సినిమాను కాపాడతాయని ఆమె చాటి చెప్పారు. అమీషా మాటలతో ఏకీభవిస్తున్న చాలా మంది నెటిజన్లు, ఇకనైనా దర్శకులు సోషల్ మీడియా మోజు వీడి అసలైన ప్రతిభను గుర్తించాలని కోరుకుంటున్నారు. అయితే ఈ వ్యాఖ్య‌ల ప‌ట్ల సోష‌ల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్న వారంతా అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. సోష‌ల్ మీడియాను అవ‌కాశం క‌ల్పించుకోవ‌డానికి ఓ వేదిక‌గా తాము వినియోగించుకుంటున్నామ‌ని, యూట్యూబ్ , ఇన్ స్టా వంటి మాధ్య‌మాల ద్వారా త‌మ ప్ర‌తిభ‌ను చాటుకుంటున్నామ‌న్నారు. అలాంటి వారిపై అమీషా ప‌టేల్ చేసిన వ్యాఖ్య‌లు ఎంత వ‌ర‌కూ స‌మంజ‌సం అన్న ప్ర‌శ్న కూడా ఉప్ప‌న్న‌మ‌వుతుంది.