ఇక చాలు ఆపండి మ్యాడమ్.. పబ్లిసిటీ కోసం ఇవేమి డ్రామాలు?
అందుకే ఇంతకుముందు గదర్ 2 రిలీజ్ సమయంలో దర్శకుడు అనీల్ శర్మతో గొడవ పెట్టుకుంది. తనకు చెప్పకుండానే క్లైమాక్స్ మార్చేసి తనను మోసం చేసారని అమీషా తీవ్రంగా ఆరోపించింది.
By: Sivaji Kontham | 19 Aug 2025 4:00 AM ISTపవన్ కల్యాణ్ `బద్రి` సినిమాలో నటించింది అమీషా పటేల్. రేణు దేశాయ్ తో పాటు మరో కథానాయికగా అమీషా నటనకు మంచి పేరొచ్చింది. ఆ తరవాత నానీలో మహేష్ సరసన, నరసింహుడులో ఎన్టీఆర్ సరసనా నటించింది. ఆకతాయ్ అనే చిత్రంలో ఐటమ్ పాటలో నర్తించింది. కానీ ఆ తరువాత ఈ అమ్మడికి తెలుగులో ఆశించిన అవకాశాలేవీ రాలేదు.
అమీషా చాలా కాలంగా హిందీ చిత్రసీమలో తన ఉనికిని చాటుకునేందుకు తన ప్రయత్నాలను మాత్రం విడిచిపెట్టడం లేదు. అక్కడ తన కమ్యూనికేషన్ ని తెలివిగా ఉపయోగించుకుని నెమ్మదిగా కెరీర్ బండిని ముందుకు సాగిస్తోంది. ప్రతియేటా కనీసం రెండు హిందీ సినిమాలు అయినా చేస్తూ బండి నడిపించేస్తోంది. మరోవైపు అమీషా నిర్మాతగాను సినిమాల్ని నిర్మించేందుకు ప్రయత్నించినా అది సఫలం కాలేదు.
ఇక అమీషాకు హిందీ చిత్రసీమలో గుర్తింపు తెచ్చిన సినిమాలు ఏవైనా ఉన్నాయా? అంటే అవి కచ్ఛితంగా గదర్, గదర్ 2. సీక్వెల్ సహా రెండు వరుస బ్లాక్ బస్టర్లతో గదర్ ఫ్రాంఛైజీ నాయికగా ప్రత్యేక గౌరవం అందుకుంది అమీషా. సన్నీడియోల్ సరసన పర్ఫెక్ట్ పెయిర్ అని నిరూపించుకుంది. అందుకే ఇప్పడు గదర్ 3లో భాగం అయ్యేందుకు అమీషా ఇంకా ఎదురు చూడలేనని అంటోంది. తనను దర్శకనిర్మాతలు హైడ్ చేసి వేరొక నాయికను ఎంపిక చేయకుండా ఆపేందుకు చాలా డ్రామాలాడుతోంది. అసలే అమీషా వయసు 50. ఈ వయసులో తన పాత్రను ఇంకా కొనసాగించడం అంత మంచిది కాదేమో! అనే ఆలోచన దర్శక రచయితలు, నిర్మాతలకు వస్తే .. దానిని తట్టుకునేందుకు కూడా సిద్ధంగా లేదు అమీషా.
అందుకే ఇంతకుముందు గదర్ 2 రిలీజ్ సమయంలో దర్శకుడు అనీల్ శర్మతో గొడవ పెట్టుకుంది. తనకు చెప్పకుండానే క్లైమాక్స్ మార్చేసి తనను మోసం చేసారని అమీషా తీవ్రంగా ఆరోపించింది. తాను గదర్ 3లో నటించాలంటే గదర్ - ఏక్ ప్రేమకథ విషయంలో స్టోరి ఎలా క్లీన్ గా వినిపించారో అదే తీరుగా తనకు మొత్తం స్క్రిప్టును వినిపిస్తేనే గదర్ 3లో నటిస్తానని అమీషా పటేల్ సీరియస్ అయింది.
అయితే ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. దర్శకుడు అనీల్ శర్మతో అమీషా విభేధాలు ఈ కొద్ది సమయంలోనే సమసిపోయాయి. ఈ సందర్భంగా అనీల్ శర్మ పాపులర్ మీడియాతో మాట్లాడుతూ- సకీనా(అమీషా)- తారా (సన్నీ) పాత్రలు తిరిగి మూడో భాగంలో కనిపిస్తాయి. కానీ గదర్ 3 చిత్రీకరణకు వెళ్లే ముందే సకీనా పాత్ర గురించి మరింత లోతుగా అధ్యయనం చేస్తాం. ఈ సినిమా స్క్రిప్టు కూడా సిద్ధంగా ఉంది. కానీ సెట్స్ పైకి వెళ్లేందుకు మరో రెండేళ్లు పడుతుంది అని తెలిపారు. అయితే అనీల్ శర్మ తాజా సందేశం విన్న తర్వాత దర్శకుడితో కలిసి అమీషా డ్రామాలాడిందని కౌంటర్లు వేస్తున్నారు. అమీషా మ్యాడమ్ పబ్లిసిటీ కోసం ఇవేమి ట్రిక్కులు? అనవసర హంగామా ఆపేయండి! అని కొందరు సూచిస్తున్నారు. 50 ప్లస్ ఆంటీ ఇంకా లైమ్ లైట్ లో ఉండాలనుకుంటోంది.. అందుకే ఇలా కథలు పడుతోంది! అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈసారి కథలో తారా సింగ్ అతడి కుమారుడు జీతే సింగ్ చుట్టూ కథ తిరుగుతుంది. ఇందులో అమీషా రోల్ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి.
