అతడితో ఒక నైట్ ఉండాలని.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
'కహోనా ప్యార్ హై' సినిమాతో సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం బాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అమీషా పటేల్.
By: Ramesh Palla | 26 Sept 2025 10:00 PM IST'కహోనా ప్యార్ హై' సినిమాతో సరిగ్గా పాతిక సంవత్సరాల క్రితం బాలీవుడ్‌లో అడుగు పెట్టిన ముద్దుగుమ్మ అమీషా పటేల్. ప్రస్తుతం అయిదు పదుల వయసులో ఉన్నప్పటికీ అమీషా పటేల్ ఆకట్టుకునే అందంతో పాటు, వరుస సినిమాలు చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ప్రస్తుతం ఆ మధ్య కాస్త సైలెంట్‌గా ఉన్న అమీషా పటేల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేసేందుకు ఆసక్తిగా ఉంది. అదే సమయంలో సినిమాలో తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండాలని ఇప్పటికీ బలంగా కోరుకునే హీరోయిన్ ఈమె. సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ మరీ వయసు మీద పడ్డటువంటి పాత్రలను చేయను అని చెప్పడం ద్వారా ఈమె అందరిని ఆశ్చర్యపరుస్తోంది. సోషల్ మీడియాలో ఈమధ్య రెగ్యులర్‌గా ఏదో విషయాల కారణంగా నిలుస్తున్న అమీషా పటేల్ తాజా పాడ్‌కాస్ట్‌లో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
పాడ్‌కాస్డ్‌లో అమీషా పటేల్ కామెంట్స్
ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో అమీషా పటేల్ తన చిన్నప్పటి క్రష్ ను గురించి చెప్పింది. చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్కడు తనకు క్రష్ అంటూ హాలీవుడ్ సూపర్ స్టార్ టామ్ క్రూజ్ పై తనకు ఉన్న అభిమానంను చాటుకుంది. ఆయన ఒప్పుకుంటే ఆయనతో ఒక నైట్ కలిసి ఉండేందుకు కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ బోల్డ్‌గా అమీషా వ్యాఖ్యలు చేసింది. సాధారణంగా హీరోయిన్స్ తమ క్రష్ గురించి చెబుతారు, కానీ మరీ ఇంతగా ఓపెన్ అవ్వరు. అమీషా ఈ విషయంలో ఆ స్థాయి వ్యాఖ్యలు చేసింది అంటే ఆమెకు టామ్ క్రూజ్ పై ఏ స్థాయిలో అభిమానం, అంతకు మించిన ఫీలింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కొత్తగా అమీషా తన క్రష్ గురించి చెప్పలేదు. గతంలోనూ సాక్ష్యాలతో సహా ఈ విషయాన్ని గురించి అమీషా పటేల్ చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. బాలీవుడ్ టాప్ స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఈమె హాలీవుడ్ స్టార్‌పై అభిమానంను కనబర్చడం విశేషం.
టామ్ క్రూప్ అంటే చాలా ఇష్టం..
టామ్ క్రూజ్ గురించి అమీషా పటేల్ ఇంకా మాట్లాడుతూ... ఎప్పటికీ అతను నా క్రష్. అతడి కోసం నేను ఏం చేసేందుకు అయినా సిద్ధంగా ఉంటాను, అతడిపై నాకు ఉన్న అభిమానం చాటుకునేందుకు అతడితో ఒక నైట్ ఉండేందుకు కూడా సిద్ధమే అంది. నాకు అవకాశం ఉంటే తప్పకుండా పెళ్లి చేసుకునేదాన్ని అని కూడా చెప్పుకొచ్చింది. ఒక సెలబ్రిటీ మరో సెలబ్రిటీపై ఈ స్థాయిలో క్రష్ ఉండటం, ప్రేమ, అభిమానంను ఈ స్థాయిలో చూపించడం విడ్డూరంగా ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి తన పెన్సిల్ బాక్స్ మొదలుకుని ప్రతి చోట కూడా టామ్ క్రూజ్ ఫోటోలు ఉండేవని చెప్పుకొచ్చింది. హాలీవుడ్ సినిమాల్లో నటించే అవకాశం వస్తే, అది టామ్ క్రూజ్ తో నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తాను అంది. టామ్ క్రూజ్ సినిమాలో చిన్న పాత్ర వచ్చినా చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పుకొచ్చింది.
గదర్ 2 తో రీ ఎంట్రీ ఇచ్చిన అమీషా పటేల్
ఇక అమీషా పటేల్ పెళ్లి గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లి గురించి నేను ఎప్పుడూ వ్యతిరేకంగా లేను అని చెప్పుకొచ్చింది. తన మనసుకు తగ్గ వాడు, మనసుకు నచ్చిన వాడు తారసపడితే అతడిని పెళ్లి చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు. తాను గతంలో ఎప్పుడూ పెళ్లికి వ్యతిరేకంగా మాట్లాడలేదు అంది. తాను పెళ్లి చేసుకునే విషయంలో ఎప్పుడూ నెగటివ్‌గా ఆలోచించలేదని, కాని నచ్చిన వాడు లభించక పోవడం వల్లే పెళ్లి చేసుకోలేదని అమీషా చెప్పింది. సినిమాల్లో కాస్త గ్యాప్ తర్వాత గదర్ 2 తో రీ ఎంట్రీ ఇచ్చిన ఈమెకు బ్లాక్ బస్టర్ సక్సెస్ దక్కింది. దాంతో ఈమె వరుసగా సినిమాల్లో నటించే అవకాశాలు సొంతం చేసుకుంటుంది. గదర్ 2 సినిమా విషయంలో చిన్న వివాదం అయినా కూడా ఆ తర్వాత ఇండస్ట్రీలో ఈమెకు ఉన్న పరిచయం కారణంగా సినిమా ఆఫర్లు వరుసగా వస్తూనే ఉన్నాయి. గతంలో టాలీవుడ్‌లో నటించిన ఈమె ఛాన్స్ వస్తే మళ్లీ తెలుగు సినిమాల్లో నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదని సన్నిహితులతో చెప్పినట్లు సమాచారం.
