Begin typing your search above and press return to search.

అమీర్ లోగ్ 'సీదా హెలికాప్టర్ షాట్'.. యూత్‌ ను ఊపేస్తోందిగా!

హైదరాబాద్ గల్లీల్లో వినిపించే భాష, ఫ్రెండ్స్ మధ్య కనిపించే బాండింగ్, జీవితంలో గెలవాలనే తపన.. ఈ మూడు అంశాలు కలిస్తే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నంగా కనిపిస్తోంది సీదా హెలికాప్టర్ షాట్.

By:  M Prashanth   |   18 July 2026 12:57 PM IST
అమీర్ లోగ్ సీదా హెలికాప్టర్ షాట్.. యూత్‌ ను ఊపేస్తోందిగా!
X

హైదరాబాద్ గల్లీల్లో వినిపించే భాష, ఫ్రెండ్స్ మధ్య కనిపించే బాండింగ్, జీవితంలో గెలవాలనే తపన.. ఈ మూడు అంశాలు కలిస్తే ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నంగా కనిపిస్తోంది సీదా హెలికాప్టర్ షాట్. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న అమీర్ లోగ్ సినిమా నుంచి విడుదలైన ఆ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. యూత్ నుంచి మంచి రెస్పాన్స్ ను సంపాదించుకుంటోంది.

స్ట్రీట్ ఆంథమ్ తరహాలో రూపొందిన ఆ సాంగ్‌ లో ఎనర్జీ, యాటిట్యూడ్, లోకల్ ఫ్లేవర్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఇటీవల విడుదలైన టీజర్‌ తో ఇప్పటికే ఆసక్తి పెంచుకున్న అమీర్ లోగ్ మూవీ టీమ్, ఇప్పుడు ఆ పాట ద్వారా సినిమాకు మరో రేంజ్ లో ప్రమోషన్స్ ను తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా పాటలో కనిపించే విజువల్స్, బీట్‌లు, లిరిక్స్ అన్నీ కలిసి యూత్‌ ను టార్గెట్ చేసినట్లు అనిపిస్తున్నాయి.

స్మరణ్ సాయి అందించిన సంగీతం పాటకు ప్రధాన బలంగా నిలిచింది. మొదటి నుంచి చివరి వరకు హై ఎనర్జీని కంటిన్యూ చేస్తూ, స్ట్రీట్ మ్యూజిక్ వైబ్‌ ను ప్రేక్షకులకు అందించేలా ట్యూన్‌ను రూపొందించారు. పాటలో వినిపించే ర్యాప్ ఎలిమెంట్స్, బీట్ డ్రాప్స్ యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ పాటను రాసి, పాడిన ఎంసీ హరి తన స్టైల్‌ ను మరోసారి చూపించారు.

సాధారణంగా సిటీ యూత్ మాట్లాడే భాషను పాటలో ఉపయోగించడం వల్ల అది మరింత నేచురల్ గా అనిపిస్తోంది. ఫ్రెండ్ షిప్, డ్రీమ్స్, సెల్ఫ్ డెడికేషన్ వంటి అంశాలను పాటలో రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నం కనిపిస్తోంది. జీవితంలో ఏదైనా సాధించాలంటే పోరాడాల్సిందే అనే సందేశాన్ని కొన్ని లైన్లు స్ట్రాంగ్ గా చెబుతున్నాయి. అలాగే ఆ పాటలో లీడ్ రోల్స్ మధ్య ఉన్న ఫ్రెండ్‌ షిప్‌ ను కూడా హైలైట్ చేశారు.

ఒకరికి ఒకరు అండగా నిలిచే యువకుల కథలా ఆ సాంగ్ కనిపిస్తోంది. అందుకే ఇది కేవలం ఒక ప్రమోషనల్ సాంగ్‌ గా కాకుండా, సినిమాలోని పాత్రల పర్సనాలిటీ పరిచయం చేసే ప్రయత్నంగా అనిపిస్తోంది. పాటలో గ్లామర్ కంటే నేచురల్ విజువల్స్‌ కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరంలోని వీధులు, గల్లీలు, యూత్ లైఫ్ స్టైల్ ను చూపించే షాట్లు పాటకు మరింత రియాలిస్టిక్ ఫీల్ తీసుకొచ్చాయి.

మెయిన్ క్యాస్టింగ్ స్టైలిష్‌ గా కనిపించడమే కాకుండా, వారి బాడీ లాంగ్వేజ్ కూడా పాటలోని ఎనర్జీని పెంచుతోంది. సినిమాటోగ్రాఫర్ ఎస్‌వీకే కెమెరా వర్క్, ఎడిటర్ రోహిత్ పెనుమత్స కట్స్ పాటకు వేగాన్ని తీసుకొచ్చాయి. దీంతో సీదా హెలికాప్టర్ షాట్ సాంగ్ ఒక స్ట్రీట్ గ్యాంగ్ ఆంథమ్‌ లా అనిపిస్తోంది. సినిమాకు యూత్‌ లో మరింత బజ్ తీసుకొచ్చేలా కనిపిస్తోంది. లోకల్ ఫ్లేవర్, స్ట్రీట్ ఎనర్జీ, ఫ్రెండ్‌ షిప్ ఎమోషన్ కలిసిన ఆ పాట ప్రస్తుతం యువత ప్లేలిస్ట్‌ లో చోటు దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినిమా విడుదలకు ముందే ఆ సాంగ్‌ తో మేకర్స్ దృష్టిని ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.