'అమీర్ లోగ్' కాసుల కల సాంగ్.. మనీ వర్సెస్ ఎమోషన్
ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ ఆడియన్స్‌లో ఒక రకమైన ఆసక్తిని రేకెత్తించగా, లేటెస్ట్ గా 'కాసుల కల' అనే పూర్తి లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
By: M Prashanth | 2 Aug 2026 5:25 PM ISTహైదరాబాద్ పాతబస్తీ నెటివిటీ, అక్కడి యువత ఆలోచనలు, రోజువారీ పోరాటాల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం 'అమీర్ లోగ్'. రమణా రెడ్డి సోమ దర్శకత్వంలో మాధవి రెడ్డి సోమ నిర్మిస్తున్న ఈ సినిమాను రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఆగస్టు 21న విడుదల చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన ప్రమోషనల్ స్టఫ్ ఆడియన్స్‌లో ఒక రకమైన ఆసక్తిని రేకెత్తించగా, లేటెస్ట్ గా 'కాసుల కల' అనే పూర్తి లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
డబ్బు సంపాదన, జీవితంలో స్థిరపడాలనే తపన, దాని చుట్టూ తిరిగే మనుషుల సంబంధాల ఆధారంగా ఈ పాటను డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. సాధారణంగా బస్తీల్లో లేదా దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో పెరిగే ప్రతి ఒక్కరి జీవితంలోనూ డబ్బు అనేది అత్యంత కీలకమైన అంశం. అదే పాయింట్‌ని ప్రధానంగా తీసుకుని నిక్లేష్ సుంకోజి రాసిన లిరిక్స్ వినేవారికి చాలా ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. కవిత్వపు ఆడంబరాలు లేకుండా రోజువారీ మాటల్లోనే లిరిక్స్ ఉండటం హైలెట్.
స్మరణ్ సాయి అందించిన ట్యూన్ పాట మూడ్‌కి తగ్గట్లుగా కుదిరింది. ఓవర్ ది టాప్ మ్యూజిక్ హంగామా లేకుండా చాలా సింపుల్ అండ్ క్యాచీ మెలోడీ ఫ్లోతో సాగేలా స్వరపరిచారు. ఇక ఎక్నాథ్ తన గొంతుతో పాటలోని ఎమోషన్‌ను పర్ఫెక్ట్‌గా క్యారీ చేశారు. ఒక సగటు యువకుడి ఆవేదన, ఆశలు, భవిష్యత్తు పై ఉన్న కలలను తన వాయిస్‌తో చాలా నేచురల్‌గా వినిపించారు. లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్ కూడా పాతబస్తీ వాతావరణాన్ని హైలెట్ చేసేలా ఉన్నాయి.
ఇటీవలి కాలంలో చిన్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర నిలదొక్కుకోవాలంటే పక్కా నేటివిటీ లేదా ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే ఎమోషన్ చాలా అవసరం. 'అమీర్ లోగ్' టీమ్ కూడా సరిగ్గా ఇదే కాన్సెప్ట్‌ను నమ్ముకున్నట్లు ఈ పాట ద్వారా అర్థమవుతుంది. రీసెంట్ గా వచ్చిన 'అవ్వల్ దావత్' మాస్ అండ్ ఎనర్జెటిక్ వైబ్ ఇచ్చింది. ఈ 'కాసుల కల' పాట మాత్రం కాస్త ఆలోచింపజేసే ప్రయత్నం చేసింది.
రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ఈ ప్రాజెక్ట్‌కి బ్యాకింగ్ ఇస్తుండటంతో ప్రమోషన్ల పరంగా ఈ సినిమాకు మంచి రీచ్ లభించే అవకాశం ఉంది. పెద్ద స్టార్ కాస్టింగ్ లేకపోయినా, కంటెంట్‌లో నిజాయితీ ఉంటే ఆదరించే తెలుగు ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 21న రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. 'కాసుల కల' పాట వింటుంటే ఇది కేవలం ఒక సినిమా పాటలా కాకుండా, ప్రతి ఒక్కరి రోజువారీ జీవితంలో ఫేస్ చేసే పరిస్థితులను గుర్తుచేసేలా రూపొందింది. ఈ సాంగ్ సినిమా ప్రమోషన్లకి మంచి ప్లస్ పాయింట్‌గా మారే అవకాశం ఉంది.
