Begin typing your search above and press return to search.

అమీర్ లోగ్ టీజర్ లాంఛ్ ఈవెంట్.. హైలైట్స్ ఇవే..

హైదరాబాద్ గల్లీ బ్యాక్‌ డ్రాప్‌ లో సరికొత్త యూత్‌ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కిన మూవీ అమీర్ లోగ్.

By:  M Prashanth   |   6 July 2026 1:01 PM IST
అమీర్ లోగ్ టీజర్ లాంఛ్ ఈవెంట్.. హైలైట్స్ ఇవే..
X

హైదరాబాద్ గల్లీ బ్యాక్‌ డ్రాప్‌ లో సరికొత్త యూత్‌ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్‌ గా తెరకెక్కిన మూవీ అమీర్ లోగ్. ప్యూర్ హైదరాబాదీ నేటివిటీ, కల్చర్‌ తో రూపొందిన ఆ సినిమా త్వరలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.





ఈ సందర్భంగా దర్శకుడు రమణ రెడ్డి మాట్లాడుతూ.. తాను రాసుకున్న స్క్రిప్ట్‌ ను క్యాస్టింగ్ ఊహించిన దానికంటే అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చారని తెలిపారు. టీజర్‌లో కనిపించిన వైబ్ సినిమా అంతా ఉంటుందని చెప్పారు. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలు చిత్రంలో ఉన్నాయని పేర్కొన్నారు. కామ్రేడ్ కళ్యాణ్ దర్శకుడు వెంకట్ కృష్ణ మాట్లాడుతూ.. రమణ రెడ్డి వృత్తిరీత్యా ఆర్కిటెక్ట్ అని, భారీ నిర్మాణాలను తీర్చిదిద్దిన అనుభవం ఆయనకు ఉందని తెలిపారు. సినిమాపై ఎంతో సమయం పెట్టి, కష్టపడి పనిచేశారని చెప్పారు.

సినిమాను ప్రేమించి ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరారు. సంగీత దర్శకుడు స్మరణ్ సాయి నుంచి మరోసారి మంచి మ్యూజికల్ ఫీస్ట్ చూడబోతున్నామని పేర్కొన్నారు.బిసంగీత దర్శకుడు స్మరణ్ సాయి మాట్లాడుతూ.. అమీర్ లోగ్ తనకు ఎంతో ప్రత్యేకమైన చిత్రమని తెలిపారు. తాను హైదరాబాదీనని, సినిమా మొత్తం లంగర్ హౌస్ పరిసరాల్లో చిత్రీకరించినట్లు చెప్పారు. చాలా కాలం తర్వాత ప్రాపర్ హైదరాబాద్ నేటివిటీతో వస్తున్న చిత్రమిదని పేర్కొన్నారు. సినిమాలో చాలా బిర్యానీ షాట్స్ ఉన్నాయని సరదాగా చెప్పారు. ఫ్రెష్ ఫేసెస్‌ తో తెరకెక్కిన ఈ సినిమాలో

హైదరాబాదీ స్టైల్ పాటలు ఉంటాయని వెల్లడించారు.

నటుడు శశిధర్ మాట్లాడుతూ.. దర్శకుడు రమణ రెడ్డి తమకు దేవుడితో సమానమని చెప్పారు. ఒక నటుడు వంద ఆడిషన్స్‌ కు వెళ్తే.. 95 చోట్ల రిజెక్ట్ అవుతాయని, ఎంపికైన ఐదు సినిమాలే అతడి ఫ్యూచర్ ను నిర్ణయిస్తాయని తెలిపారు. అలాంటి అవకాశాన్ని తనకు ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు చెప్పారు. స్మరణ్ అద్భుతమైన సంగీతం అందించారని ప్రశంసించారు.

నటుడు మనోజ్ మాట్లాడుతూ.. తమలాంటి కొత్త నటీనటులకు అండగా నిలుస్తున్న స్పిరిట్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. టీజర్ ఈవెంట్‌కు హాజరైన వంశీ నందిపాటికి ధన్యవాదాలు చెప్పారు. సంగీతం ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని, పాటలు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతాయని పేర్కొన్నారు. హీరోయిన్ వేద జలంధర్ మాట్లాడుతూ.. అమీర్ లోగ్ సినిమాకు దర్శకుడు రమణ రెడ్డినే బాస్ అని చెప్పారు.

టీజర్ చూస్తే ఆయన స్క్రిప్ట్‌ పై ఉన్న క్లారిటీ అర్థమవుతుందని తెలిపారు. సినిమాలో తాను గీత పాత్రలో కనిపించనున్నట్లు చెప్పారు. ఆ పాత్ర తనకు కొత్త అనుభూతిని ఇచ్చిందని పేర్కొన్నారు. స్మరణ్ సంగీతం స్క్రిప్ట్‌ ను మరో నాలుగు మెట్లు పైకి తీసుకెళ్లిందని ప్రశంసించారు. తమ టీమ్ తక్కువ మాట్లాడుతుందని.. తమ నటనే ఎక్కువ మాట్లాడుతుందని ధీమా వ్యక్తం చేశారు.