Begin typing your search above and press return to search.

'అమీర్ లోగ్' టీజర్.. ఫుల్‌ గా హైప్ పెంచేలా..

చిన్న సినిమాకు ప్రేక్షకుల్లో గుర్తింపు రావాలంటే కంటెంట్‌ తో పాటు సరైన ప్రమోషన్, రిలీజ్ కూడా చాలా ముఖ్యం.

By:  M Prashanth   |   6 July 2026 11:58 AM IST
అమీర్ లోగ్ టీజర్.. ఫుల్‌ గా హైప్ పెంచేలా..
X

చిన్న సినిమాకు ప్రేక్షకుల్లో గుర్తింపు రావాలంటే కంటెంట్‌ తో పాటు సరైన ప్రమోషన్, రిలీజ్ కూడా చాలా ముఖ్యం. ఆ విషయంలో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి చిన్న చిత్రాలకు తనవంతు అండగా నిలుస్తున్నారు. వైవిధ్యమైన కంటెంట్‌ తో తెరకెక్కిన సినిమాలను ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా యూత్‌ ఫుల్ ఎంటర్టైనర్‌ గా రూపొందిన అమీర్ లోగ్ సినిమాకు ఆయనకు చెందిన స్పిరిట్ మీడియా అండగా నిలిచింది.





ఇప్పటికే ఆ చిత్రంపై ఆసక్తి నెలకొనగా.. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై హైప్‌ మరింత పెంచేలా కనిపిస్తోంది. హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోస్‌ లో జరిగిన కార్యక్రమంలో అమీర్ లోగ్ టీజర్‌ ను మూవీ టీమ్ రిలీజ్ చేసింది. ప్యూర్ హైదరాబాదీ సోల్ అనే కాన్సెప్ట్‌ కు తగ్గట్లుగానే టీజర్‌ ను కట్ చేశారు. హైదరాబాద్ గల్లీలు, లోకల్ కల్చర్, అక్కడి యువత మాట్లాడుకునే స్లాంగ్‌ తో టీజర్ ఫన్నీగా సాగింది. ముఖ్యంగా ముగ్గురు స్నేహితుల మధ్య వచ్చే సన్నివేశాలు, కామెడీ డైలాగ్స్ యూత్‌ ను ఆకట్టుకునేలా ఉన్నాయి.

సాధారణంగా హైదరాబాద్ బ్యాక్‌ డ్రాప్‌ తో సినిమాలు వచ్చినప్పుడు అక్కడి కల్చర్‌ న్యాచురల్ గా చూపించడం కీలకం. ఏమాత్రం తేడా వచ్చినా ఆర్టిఫీషియల్ గా అనిపించే అవకాశం ఉంటుంది. అయితే అమీర్ లోగ్ టీజర్‌ లో మాత్రం ఆ విషయంలో మూవీ టీమ్ జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. లోకల్ స్లాంగ్, గల్లీ ముచ్చట్లు, యువత మధ్య జరిగే సరదా సంభాషణలను సహజంగా చూపించే ప్రయత్నం చేశారు.

సినిమాలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్ లీడ్ రోల్స్ లో నటించారు. హైదరాబాద్ గల్లీల్లో తిరిగే ముగ్గురు యువకుల పాత్రల్లో వీరు సహజంగా కనిపించారు. ముఖ్యంగా వారి మధ్య కెమిస్ట్రీ, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ టీజర్‌ లో హైలైట్‌ గా నిలిచాయి. కొత్త నటీనటులే అయినప్పటికీ పాత్రలకు తగ్గట్లుగా కనిపించడం సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది. వేద జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి కీలక పాత్రల్లో నటించారు.

కామెడీతోనే సినిమాను నడిపించకుండా ఫ్రెండ్ షిప్, యూత్ లైఫ్ జర్నీ, వారికి ఎదురయ్యే పరిస్థితులతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. నేటి యువతకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం కూడా దర్శకుడు రమణా రెడ్డి సోమ చేసినట్లు చిత్రబృందం చెబుతోంది. టీజర్‌ లో స్మరణ్ సాయి అందించిన బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలకు మరింత ఎనర్జీని తీసుకొచ్చింది. ఓవరల్ గా టీజర్ పాజిటివ్ రెస్పాన్స్ అందుకోవడం ప్రమోషన్స్‌ కు మరింత బూస్ట్ ఇచ్చినట్లయింది.

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ ఎల్ఎల్‌ పీ బ్యానర్‌ పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఆ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌ కు తోడు టీజర్‌ లో పక్కా హైదరాబాదీ ఫ్లేవర్, కామెడీ, ఫ్రెండ్‌ షిప్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటున్నాయి. దీనికి స్పిరిట్ మీడియా అండ తోడవడంతో అమీర్ లోగ్ పై హైప్ మరింత పెరిగిందనే చెప్పాలి. మరి టీజర్‌ తో పెరిగిన అంచనాలను సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి.