Begin typing your search above and press return to search.

​లంగర్ హౌస్ లవ్ అండ్ ఎమోషన్స్.. ‘అమీర్ లోగ్’పై ప్రొడ్యూసర్స్ కామెంట్స్!

హైదరాబాద్‌లోని లంగర్ హౌస్, లక్ష్మీనగర్ బస్తీల్లో ఎలాంటి కలరింగ్ లేకుండా ఒరిజినల్ లొకేషన్లలోనే ఈ చిత్రాన్ని చాలా సహజంగా చిత్రీకరించారని క్యాంప్ శశి తెలిపారు.

By:  M Prashanth   |   13 Aug 2026 7:10 PM IST
​లంగర్ హౌస్ లవ్ అండ్ ఎమోషన్స్.. ‘అమీర్ లోగ్’పై ప్రొడ్యూసర్స్ కామెంట్స్!
X

యూత్‌ఫుల్ అండ్ నేటివిటీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న 'అమీర్ లోగ్' సినిమా ఆగస్టు 21న థియేటర్లలోకి రావడానికి సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో నిర్మాత మాధవి రెడ్డి సోమ, లైన్ ప్రొడ్యూసర్ క్యాంప్ శశి సినిమాకు సంబంధించిన పలు విషయాలను మీడియాతో పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ను ఆడియన్స్ ముందుకు తీసుకెళ్లడంలో సపోర్ట్ చేస్తున్న మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈవెంట్ లో నిర్మాత మాధవి రెడ్డి మాట్లాడుతూ, ఆగస్టు 21న పండగ రోజు సినిమా రిలీజ్ అవుతుండటం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రేక్షకులందరినీ దేవుళ్లతో సమానంగా భావిస్తామని, అమ్మవారి దీవెనలతో పాటు ప్రేక్షకుల ఆశీస్సులు కూడా తమ చిత్రానికి దక్కాలని ఆకాంక్షించారు. తమను, తమ టీమ్‌ని, ఇందులో పనిచేసిన కుర్రాళ్లందరినీ థియేటర్లలో సినిమా చూసి ఆశీర్వదించాలని కోరారు.

లైన్ ప్రొడ్యూసర్ క్యాంప్ శశి మాట్లాడుతూ, సాధారణంగా చిన్న సినిమాలకు ప్రమోషనల్ ఈవెంట్లు అవసరమా అని చాలామంది అనుకుంటారని, కానీ ఈ సినిమాకు ప్రతి ఈవెంట్ ఒక పెళ్లి వేడుకలా, సంగీత్, మెహందీ ఫంక్షన్లలా జరిగిందని చెప్పారు. దర్శకుడు రమణారెడ్డిని చూస్తే తనకు చాలా ఆశ్చర్యం వేసిందని, ఒక బిజీ ఆర్కిటెక్ట్ అయ్యుండి కూడా ఎక్కడా కోపం, ఇరిటేషన్ లేకుండా చాలా కాన్ఫిడెంట్ గా షూటింగ్ పూర్తి చేశారని కొనియాడారు.

హైదరాబాద్‌లోని లంగర్ హౌస్, లక్ష్మీనగర్ బస్తీల్లో ఎలాంటి కలరింగ్ లేకుండా ఒరిజినల్ లొకేషన్లలోనే ఈ చిత్రాన్ని చాలా సహజంగా చిత్రీకరించారని క్యాంప్ శశి తెలిపారు. రైటింగ్ టీమ్ అంతా కలిసి ఆఫీస్ బాల్కనీలో కూర్చుని నెలల తరబడి స్లైస్ ఆఫ్ లైఫ్ కాన్సెప్ట్ తో ఈ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారని చెప్పారు. లవ్ స్టోరీలు, రొటీన్ ఎలిమెంట్స్ లేకుండా బస్తీలోని మనుషుల మధ్య ఉండే లైఫ్ ని చాలా బ్యూటిఫుల్ గా స్క్రీన్ పై చూపించారని అన్నారు.

డైరెక్టర్ రమణారెడ్డి వర్కింగ్ స్టైల్ ని కాంప్లిమెంట్ చేస్తూ, అసలు సెట్స్ లో అనుభవం లేకుండానే కేవలం కమాండ్స్ తో ఇంత పర్ఫెక్ట్ గా షూట్ చేయడం చిన్న విషయం కాదని చెప్పుకొచ్చారు. నిర్మాత మాధవి రెడ్డి నేటివ్ ప్లేస్ లో షూటింగ్ చేయడం వల్ల వర్క్ చాలా హ్యాపీగా సాగిపోయిందని అన్నారు. ఒక మంచి హానెస్ట్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాను థియేటర్లలో చూసి ఆదరించాలని ఆయన కోరారు.

రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా సమర్పిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి స్మరణ్ సాయి సంగీతం అందించారు. కొత్త నటీనటులతో హైదరాబాద్ పాతబస్తీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ హైదరాబాదీ ఫన్ రైడ్ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. పక్కా లోకల్ ఎమోషన్స్ తో వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ లో అలరిస్తుందో చూడాలి.