Begin typing your search above and press return to search.

'అమీర్ లోగ్'.. అవి కూడా కలిసొచ్చేలా ఉన్నాయే!

సినిమా రిలీజ్ కు ముందు సెన్సార్ రిపోర్ట్, రన్‌ టైమ్‌ విషయంలో క్లారిటీ రావడం మూవీ టీమ్ కు పెద్ద రిలీఫ్ ఇస్తుంది.

By:  M Prashanth   |   21 July 2026 11:46 AM IST
అమీర్ లోగ్.. అవి కూడా కలిసొచ్చేలా ఉన్నాయే!
X

సినిమా రిలీజ్ కు ముందు సెన్సార్ రిపోర్ట్, రన్‌ టైమ్‌ విషయంలో క్లారిటీ రావడం మూవీ టీమ్ కు పెద్ద రిలీఫ్ ఇస్తుంది. ముఖ్యంగా చిన్న సినిమాలకు కంటెంట్ ఎంత ముఖ్యమో.. అదే స్థాయిలో రన్ టైమ్ కూడా కీలకంగా మారింది. ఇప్పుడు అమీర్ లోగ్ సినిమాకు ఆ రెండూ విషయాలు కలిసొచ్చినట్టు అనిపిస్తోంది. ఒకవైపు సెన్సార్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ రావడం.. మరోవైపు కథకు తగ్గట్టుగా 2 గంటల 1 నిమిషం రన్‌ టైమ్ ఉండటం ప్లస్ గా మారింది.





హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆ లోకల్ కామెడీ స్లైస్ ఆఫ్ లైఫ్ డ్రామా ఇప్పుడు గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే టీజర్‌ తో ఆసక్తి పెంచిన ఆ సినిమాకు తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. ఎలాంటి కట్స్, అడ్డంకులు లేకుండా థియేటర్లలోకి రావడానికి అంతా క్లియర్ అయినట్లే. సాధారణంగా చిన్న సినిమాలకు ర న్‌టైమ్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు మేకర్స్.

కథ ఎంత బలంగా ఉన్నా.. రన్ టైమ్ ఎక్కువైతే ప్రేక్షకులను కట్టిపడేయడం కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో అమీర్ లోగ్ కు రెండు గంటలకు కాస్త ఎక్కువగా ఉన్న రన్‌టైమ్ ఉండటం ఆసక్తికరంగా మారింది. కథలోని కామెడీ, ఎమోషన్స్, లోకల్ ఫ్లేవర్‌ ను ఎక్కడా సాగదీయకుండా ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఆ సినిమాకు వచ్చిన యూ/ఏ సర్టిఫికేట్ కూడా మరో అనుకూల అంశంగా మారింది.

ఫ్యామిలీ ఆడియన్స్, యూత్ ఇద్దరూ చూసే అవకాశం ఉండటంతో థియేట్రికల్ రీచ్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ యాస, గల్లీ లైఫ్, స్నేహాల నేపథ్యంలో సాగే కథ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలనే ప్రయత్నం కనిపిస్తోంది. అమీర్ లోగ్ లో డబ్బు కంటే బంధాలు, స్నేహాలు, చిన్న చిన్న ఆనందాలే అసలైన ప్రాపర్టీ అనే కాన్సెప్ట్‌ ను చూపించనున్నారు.

ముగ్గురు మిడిల్ క్లాస్ ఫ్రెండ్స్ లైఫ్స్ ను మెయిన్ గా చేసుకుని తెరకెక్కిన ఆ సినిమాలో పాతబస్తీ వాతావరణం, తెలంగాణ స్లాంగ్, లోకల్ కల్చర్ మెయిన్ అట్రాక్షన్ గా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్‌ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇక సెన్సార్ కంప్లీట్ కావడం, సరైన రన్‌టైమ్ లాక్ అవ్వడం సినిమాకు విడుదలకు ముందు మరో పాజిటివ్‌ గా మారాయి.

రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా థియేట్రికల్ పంపిణీ బాధ్యతలు తీసుకోవడం కూడా సినిమాకు అదనపు బలం. రమణ రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రాన్ని అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌ పై తెరకెక్కించారు. ఎంసీ హరి, మనోజ్, శశిధర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఏదేమైనా కంటెంట్‌ కు తగ్గ సెన్సార్ క్లియరెన్స్, ప్రేక్షకులను ఇబ్బంది పెట్టని రన్‌ టైమ్.. ఆ రెండు అంశాలు అమీర్ లోగ్ కు విడుదలకు ముందే కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. ఆగస్టులో థియేటర్లలోకి రానున్న ఆ హైదరాబాదీ కథ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.