మూవీని చూసిన వారంతా ఇది వాళ్ల కథే అనుకుంటారట!
హైదరాబాద్ పాతబస్తీ గల్లీలు, అక్కడి లైఫ్ స్టైల్, రిలేషన్స్, ఎమోషన్స్.. ఇవన్నీ సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే ప్రేక్షకులు తమ జీవితాన్ని చూసుకున్నట్లే అనిపిస్తుందని అమీర్ లోగ్ మూవీ టీమ్ చెబుతోంది.
By: M Prashanth | 25 July 2026 10:33 PM ISTహైదరాబాద్ పాతబస్తీ గల్లీలు, అక్కడి లైఫ్ స్టైల్, రిలేషన్స్, ఎమోషన్స్.. ఇవన్నీ సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే ప్రేక్షకులు తమ జీవితాన్ని చూసుకున్నట్లే అనిపిస్తుందని అమీర్ లోగ్ మూవీ టీమ్ చెబుతోంది. హైదరాబాద్ కల్చర్ ను రిఫ్లెక్ట్ చేసే యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుండగా, తాజాగా విడుదల చేసిన అవ్వల్ దావత్ సాంగ్ తో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.
అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మిస్తున్న ఆ చిత్రానికి రమణా రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్నారు. రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఆ సినిమాను విడుదల చేస్తుండటం విశేషం. ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేధా జలంధర్, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, యోగి లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొన్న మూవీ టీమ్ తమ ఎక్స్పీరియన్స్ ను పంచుకుంది.
ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ స్మరణ్ సాయి మాట్లాడుతూ.. కల్చర్ ను రిఫ్లెక్ట్ చేసేలా చిత్రాలకు వర్క్ చేయడం తనకు ఇష్టమని చెప్పారు. హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాలను దర్శకుడు రమణా రెడ్డి ఎంతో నేచురల్ గా, అందంగా చిత్రీకరించారని పేర్కొన్నారు. "తెలుగులో అమీర్ లోగ్ ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుంది. ఈ సినిమా కోసం పని చేయడం చాలా ఆనందంగా ఉంది. నన్ను ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని అందరూ ఆదరించాలి" అని ఆయన కోరారు.
హీరోయిన్ వేధా జలంధర్ మాట్లాడుతూ.. "అమీర్ లోగ్ ప్రపంచంలోకి అందరినీ ఆహ్వానించడానికి మేమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. బస్తీల్లో ఉండే బంధాలు, అక్కడి మనుషుల మధ్య ఉండే అనుబంధాన్ని దర్శకుడు చాలా అందంగా చూపించారు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఇది మా కథే అని అనుకునేలా ఉంటుంది" అని తెలిపారు. నటుడు ఎంసీ హరి మాట్లాడుతూ.. తాజాగా విడుదలైన అవ్వల్ దావత్ పాటకు మంచి స్పందన వస్తోందన్నారు. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులను మా ప్రపంచంలోకి, మా బస్తీలోకి తీసుకెళ్తాం. ప్రతి ఒక్కరినీ ఈ చిత్రం ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉంది" అని చెప్పారు.
నటుడు శశిధర్ మాట్లాడుతూ.. "అవ్వల్ దావత్ పాటకు స్మరణ్ సాయి అందించిన సంగీతం, మనోజ్ రాసిన సాహిత్యం, రాహుల్ ఆలపించిన తీరు ప్రేక్షకులను అలరిస్తుంది. ఇది పక్కా తెలుగు, హైదరాబాదీ నేటివిటీతో రూపొందిన చిత్రం. ఆగస్టు 21న థియేటర్లలో కలుద్దాం" అని అన్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నేపథ్యంలో అమీర్ లోగ్ కూడా అదే బాటలో ప్రయాణిస్తోంది.
ముఖ్యంగా హైదరాబాద్ పాతబస్తీ లైఫ్ స్టైల్ ను నేచురాలిటీతో చూపించనున్న ఆ చిత్రం ప్రేక్షకులకు ఎంత మేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. ఆ సినిమాకు ఎస్‌వీకే సినిమాటోగ్రఫీ అందించగా, రోహిత్ పెనుమత్స ఎడిటర్ గా వ్యవహరించారు. స్మరణ్ సాయి సంగీతం సమకూర్చగా, స్వప్నిక్ రావు సింక్ సౌండ్, మిక్సింగ్ బాధ్యతలు నిర్వహించారు. సాయి యోగి చీఫ్ ఏడీగా, సందీప్ బోరెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా, శరత్ పోలవరపు లైన్ ప్రొడ్యూసర్ గా పని చేశారు.
