Begin typing your search above and press return to search.

అమీర్ లోగ్.. మేకర్స్ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే..

హైదరాబాద్ బస్తీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ‘అమీర్ లోగ్’ మూవీ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్ గా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   14 Aug 2026 9:49 PM IST
అమీర్ లోగ్.. మేకర్స్ కాన్ఫిడెన్స్ ఏ స్థాయిలో ఉందంటే..
X

హైదరాబాద్ బస్తీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ‘అమీర్ లోగ్’ మూవీ పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తోంది. రీసెంట్ గా మేకర్స్ ట్రైలర్ ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. రానా దగ్గుబాటి సంస్థ ‘స్పిరిట్ మీడియా’ ఈ సినిమాను ఆగస్టు 21న థియేటర్లలోకి తీసుకురాబోతోంది. మొదటి నుంచి ప్రమోషన్ లో కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్న మేకర్స్ ఇటీవల ట్రైలర్ లాంచ్ లో కూడా అంతే పాజిటివ్ గా మాట్లాడారు.

ఈ ఈవెంట్‌లో దర్శకుడు రమణా రెడ్డి సోమ మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ పై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించారు. ఇది పక్కా హైదరాబాదీ వైబ్ ఉన్న కథ అని, పెళ్లిచూపులు, బలగం సినిమాల స్థాయిలో తమ అమీర్ లోగ్ కూడా ఆడియన్స్‌కు ఒక స్ట్రాంగ్ కనెక్ట్ ఇస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన 'లిటిల్ హార్ట్స్' డైరెక్టర్ సాయి మార్తాండ్ ట్రైలర్ కంటెంట్‌ను మెచ్చుకున్నారు. సినిమా చాలా రియలిస్టిక్‌గా ఉందని చెబుతూ ఫలక్ నుమా దాస్ రేంజ్‌లో ఇది హిట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

అలాగే మరో గెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ మాట్లాడుతూ ఈ ట్రైలర్ చూస్తుంటే మంచి బిర్యానీ వాసన వస్తోందని ఫన్నీగా కామెంట్ చేశారు. ఆర్టిస్టులందరూ చాలా నేచురల్‌గా చేశారని ఆయన అభినందించారు. ఇందులో ఒక లీడ్ రోల్ చేసిన ఎంసి హరి తన ఎక్స్‌పీరియన్స్ పంచుకున్నాడు. తను పుట్టి పెరిగిన బస్తీ వాతావరణమే సినిమాలో ఉండటం చాలా స్పెషల్ అని చెప్పాడు. ఇదే మూవీతో తమ ఇంట్లో నుంచి ఇద్దరు ఆర్టిస్టులుగా మారుతున్నారని, తన తండ్రి కూడా ఇందులో నటించారని తెలిపాడు.

మరో నటుడు మనోజ్ మాట్లాడుతూ బస్తీలో షూట్ చేస్తున్నప్పుడు లోకల్ జనాలు ఎంతో సపోర్ట్ చేశారని, ఈ కథ అందరినీ నవ్విస్తూనే ఏడిపిస్తుందని చెప్పాడు. సినిమాలో గీత అనే పాత్ర పోషించిన నటి వేధా జలంధర్ తన రోల్ గురించి ఆసక్తికరంగా మాట్లాడింది. తనది చాలా స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ అని, ఇది అమ్మాయిలకు ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉంటుందని తెలిపింది. ఇక నటుడు విశ్వేందర్ రెడ్డి మాట్లాడుతూ డైరెక్టర్ రమణ పైకి సాఫ్ట్‌గా కనిపించినా లోపల ఒక అగ్నిపర్వతం దాగుందని, ప్రతి ఫ్రేమ్ చాలా అద్భుతంగా తీశాడని ప్రశంసించాడు.

ఈ సినిమాకు మ్యూజిక్ చాలా ప్లస్ అవుతుందని టీమ్ నమ్ముతోంది. మ్యూజిక్ డైరెక్టర్ సాయి స్మరణ్ మాట్లాడుతూ తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెప్పాడు. అలాగే లైన్ ప్రొడ్యూసర్ శశి మాట్లాడుతూ ఈవెంట్స్ చేయొద్దని ముందుగా అనుకున్నా, ఇప్పుడు ప్రతి ఈవెంట్ ఒక పండగలా అనిపిస్తోందని అన్నాడు. కంటెంట్ మీద ఉన్న నమ్మకంతోనే టీమ్ అంతా ఇంత పాజిటివ్ ఎనర్జీతో ఉన్నట్లు ఈవెంట్‌లో కనిపించింది.

అవ్వల్ నంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మాధవి రెడ్డి సోమ ఈ చిత్రాన్ని నిర్మించగా, మనోహర్ రెడ్డి సహ నిర్మాతగా ఉన్నారు. ఆగస్టు 21న సినిమాను రిలీజ్ చేస్తున్న స్పిరిట్ మీడియాకు నిర్మాత మాధవి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్వీకే సినిమాటోగ్రఫీ, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ ఈ పక్కా లోకల్ స్టోరీకి మెయిన్ పిల్లర్స్ కానున్నాయి. మరి ఈ బస్తీ కథ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వైబ్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.