Begin typing your search above and press return to search.

అమీర్ లోగ్.. ఫుల్ వైబ్ తో అవ్వల్ దావత్..

యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న అమీర్ లోగ్ సినిమా నుంచి ఒకేసారి రెండు అదిరిపోయే అప్డేట్స్ వచ్చాయి.

By:  M Prashanth   |   25 July 2026 7:19 PM IST
అమీర్ లోగ్.. ఫుల్ వైబ్ తో అవ్వల్ దావత్..
X

యూత్‌ఫుల్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న అమీర్ లోగ్ సినిమా నుంచి ఒకేసారి రెండు అదిరిపోయే అప్డేట్స్ వచ్చాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అవ్వల్ నెంబర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మాధవి రెడ్డి సోమ నిర్మించిన ఈ చిత్రానికి రమణ రెడ్డి సోమ దర్శకత్వం వహించారు. రిలీజ్ డేట్ తో పాటే ఆడియన్స్ కు మంచి కిక్ ఇచ్చేలా ఇప్పటికే ట్రెండ్ అవుతున్న అవ్వల్ దావత్ సాంగ్ లిరికల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు.




అవ్వల్ దావత్ లిరికల్ వీడియో చూస్తే సినిమాలోని ఫన్ యాంగిల్ ఏంటో అర్థమవుతోంది. స్మరణ్ సాయి అందించిన మ్యూజిక్ కు సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఎనర్జిటిక్ వాయిస్ తోడవడంతో పాట నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళింది. మనోజ్ కుమార్ జులూరి రాసిన పక్కా హైదరాబాదీ లిరిక్స్ యూత్ కు ఈజీగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దీనికి తోడు అనీ మాస్టర్ కొరియోగ్రఫీ, స్క్రీన్ పై కనిపిస్తున్న కలర్ ఫుల్ విజువల్స్ ఈ సాంగ్ కు మంచి వైబ్ ను తీసుకొచ్చాయి.

ఇక రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేశారు. బ్లూ స్కై, సముద్రపు అలల బ్యాక్ డ్రాప్ లో లీడ్ యాక్టర్లు గాల్లోకి జంప్ చేస్తున్న స్టిల్ సినిమాలోని మరో వైబ్ ను హైలెట్ చేసింది. వాళ్ల బీచ్ అవుట్ ఫిట్స్, ఫేస్ లో కనిపిస్తున్న స్మైల్స్ చూస్తుంటే ఈ అమీర్ లోగ్ గ్యాంగ్ థియేటర్లలో గట్టిగానే ఎంటర్టైన్ చేసేలా ఉన్నారు.

ఒక చిన్న సినిమాకు పెద్ద సపోర్ట్ దొరికితే ఆ రీచ్ వేరేలా ఉంటుంది. ఇప్పుడు ఈ చిత్రానికి టాలీవుడ్ లో అలాంటి సపోర్టే దొరికింది. రాణా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. దీంతో ప్రాజెక్ట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. సరైన కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తాయని ఇప్పటికే రుజువైంది. రాణా సపోర్ట్ తో ఈ చిత్రానికి థియేటర్ల పరంగా కూడా మంచి బిజినెస్ జరిగే ఛాన్స్ ఉంది.

ఈ చిత్రంలో ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేధ జలంధర్ లీడ్ రోల్స్ చేస్తుండగా.. రావణ్ నిత్తురు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఎస్ వి కె సినిమాటోగ్రఫీ అందించగా, రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ బాధ్యతలు చూసుకుంటున్నారు. మనోహర్ రెడ్డి మాంచూరి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రమోషన్ల స్పీడ్ ను రానున్న రోజుల్లో మరింత పెంచబోతున్నారు.

ఈ మధ్య కాలంలో పక్కా లోకల్ నేటివిటీతో, సరికొత్త క్యాస్టింగ్ తో వస్తున్న సినిమాలు ఆడియన్స్ ను బాగానే ఎంటర్టైన్ చేస్తున్నాయి. టీజర్, సాంగ్స్ తో ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసిన అమీర్ లోగ్ టీమ్, ఇప్పుడు ఈ లిరికల్ వీడియోతో అంచనాలను కాస్త పెంచింది. రాణా ట్యాగ్ తో వస్తున్న ఈ యూత్ ఫుల్ డ్రామా ఆగస్టు 21న ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.