Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్‌ స్టార్ సినిమాలో విల‌న్‌గా అంబ‌టి?

అయితే అంబ‌టికి ఉన్న శ‌త్రుత్వం దృష్ట్యా సినీప‌రిశ్ర‌మ‌లో అత‌డికి అవ‌కాశాలు క‌ల్పించేది ఎవ‌రు? అనేదే పెద్ద ప్ర‌శ్న‌.

By:  Sivaji Kontham   |   15 March 2026 10:17 AM IST
ప‌వ‌ర్‌ స్టార్ సినిమాలో విల‌న్‌గా అంబ‌టి?
X

వైకాపా నాయకుడు అంబ‌టి రాంబాబు భోళా మ‌న‌స్త‌త్వం, గ‌ళ‌గ‌ళా మాట్లాడే ప్ర‌తిభ‌ గురించి తెలిసిందే. ఆయ‌న ప్ర‌త్య‌ర్థుల‌పై విరుచుకుప‌డుతూ అద్భుత‌మైన వాక్ఛాతుర్యంతో క‌ట్టి ప‌డేస్తుంటారు. అయితే ముఖ్య‌మంత్రుల స్థాయి వారిని విమ‌ర్శించి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది.. అయినా ఆయ‌న మార‌లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి.

ఇదిలా ఉంటే అంబ‌టి సినిమాల్లోకి రావాల‌ని కోరుకుంటున్నారు. త‌న‌ను గుర్తించి త‌న భావోద్వేగాల‌ను ప‌ట్టించుకుని ఎవ‌రైనా ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అవ‌కాశాలు క‌ల్పిస్తే తాను న‌టించ‌డానికి సిద్ధ‌మేన‌ని అంబ‌టి ప్ర‌క‌టించారు. ఆయ‌న ప్రక‌ట‌న చూసాక నిజంగానే న‌ట‌న విష‌యంలో సీరియ‌స్ గా ఉన్నార‌నే సంకేతాలు అందాయి.

అయితే అంబ‌టికి ఉన్న శ‌త్రుత్వం దృష్ట్యా సినీప‌రిశ్ర‌మ‌లో అత‌డికి అవ‌కాశాలు క‌ల్పించేది ఎవ‌రు? అనేదే పెద్ద ప్ర‌శ్న‌. అంబ‌టి రూపం.. ఆహార్యం, అభినివేశం ఇవ‌న్నీ న‌టన‌కు స‌రిపోతాయి. గాంభీర్యమైన గొంతు కూడా పెద్ద ప్ల‌స్ అవుతుంది. అయితే ఆయ‌న కోసం క‌థ‌లు రాసేది ఎవ‌రు? సినిమాలు నిర్మించేది ఎవ‌రు? అన్న‌దే ఇప్ప‌టికి స‌స్పెన్స్. త‌న‌కు బ‌ద్ధ వ్య‌తిరేకి అయిన‌ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమాలో విల‌న్ వేషం వేయిస్తే బావుంటుంద‌ని కూడా కొంద‌రు కామెంట్లు చేస్తున్నారు.

రాజ‌కీయాల నుంచి సినిమాల్లోకి వెళ్లి రాణించిన భార‌తీయ న‌టీన‌టుల‌ గురించి వివ‌రాలు ప‌రిశీలిస్తే.... ఈ జాబితాలో రితేష్ దేశ్ ముఖ్‌, ప్ర‌తీక్ బ‌బ్బ‌ర్, స్మృతి ఇరానీ, చిరాగ్ పాశ్వాన్, అరుణ్ గోవిల్ స‌హా ప‌లువురు ఉన్నారు. నందమూరి హరికృష్ణ వంటి వారు రాజకీయాల్లో ఉంటూనే సినిమాల్లో నటించి మెప్పించారు. కాబ‌ట్టి అంబటి కూడా హ‌రికృష్ణ‌ను అనుస‌రిస్తే బావుంటుంద‌ని ప‌లువురు నెటిజ‌నులు సూచించారు. సీమ నుంచి డాక్ట‌ర్ శివ‌ప్ర‌సాద్ కూడా న‌టుడిగా, రాజ‌కీయ నాయ‌కుడిగా రాణించారు. అయితే శ‌త్రుత్వం పెట్టుకుంటే గ్లామ‌ర్ రంగంలో రాణించ‌డం చాలా క‌ష్టం. దీనిని బ‌ట్టి అంబ‌టి త‌న‌ను తాను మ‌లుచుకోవాల‌ని కూడా కొంద‌రు సూచిస్తున్నారు.

సాధారణంగా నటీనటులు గ్లామర్ రంగం నుండి రాజకీయాల్లోకి రావడం మనం చూస్తుంటాం. కానీ దానికి భిన్నంగా రాజకీయ నేపథ్యం ఉండి లేదా రాజకీయాల్లో ఉండి సినిమాల్లోకి వచ్చి తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వారు భారతీయ చిత్ర పరిశ్రమలో అరుదుగా కనిపిస్తారు. కానీ ఒక డ‌జ‌ను మంది వ‌ర‌కూ ఇరు రంగాల్లోను రాణించారు.