షారుక్ కొడుకు కోసం అంబానీ ఫ్యామిలీ.. తొలి సిరీస్ కే ఆ క్రేజ్ ఏంటి సామీ!
అసలు విషయంలోకి వెళ్తే.. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టోరియల్ డెబ్యూ వెబ్ సిరీస్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' నెట్ ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది
By: Madhu Reddy | 18 Sept 2025 12:30 PM ISTసాధారణంగా ఏ భాష ఇండస్ట్రీలో అయినా సరే సెలబ్రిటీలు తమ తదనంతరం తమ వారసులకు ఒక హోదా కల్పించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఇప్పటికే ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అలా వచ్చిన వారసులలో చాలామంది హీరోలు, హీరోయిన్లుగా తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటుంటే.. మరికొంతమంది వారసులు మాత్రం దర్శకులుగా, మ్యూజిక్ డైరెక్టర్స్ గా, సింగర్స్ గా తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రముఖ బాలీవుడ్ బడా హీరో షారుఖ్ ఖాన్ కొడుకు కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈయన హీరోగా కాకుండా డైరెక్టర్గా ఏకంగా ఒక వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించి, తన వెబ్ సిరీస్ ను విడుదలకు ఉంచబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన ఆ తొలి వెబ్ సిరీస్ ప్రీమియర్ వేడుక చాలా ఘనంగా జరగగా.. ఈ కార్యక్రమానికి ఏకంగా అంబానీ కుటుంబం విచ్చేసి సందడి చేయడం వైరల్ గా మారింది.
అసలు విషయంలోకి వెళ్తే.. షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టోరియల్ డెబ్యూ వెబ్ సిరీస్ 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' నెట్ ఫ్లిక్స్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 17న ముంబైలోని దీని ప్రీమియర్ ను నిర్వాహకులు ప్రదర్శించారు. ఇందులో పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలతో పాటు అంబానీ కుటుంబం కూడా పాల్గొని సందడి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ముఖ్యంగా అంబానీ కుటుంబం నుంచి ముఖేష్ అంబానీ, నీతా అంబానీతో పాటు ఆకాష్ అంబానీ, శ్లోకా మెహతా, రాధిక మర్చంట్ వచ్చి ఫోటోలకు ఫోజులిచ్చారు. ఆర్యన్ ఖాన్ మొదటి సినిమా ప్రీమియర్ కి ఏకంగా ప్రపంచ కుబేరుడు ముఖేష్ అంబానీ కుటుంబంతో సహా కదలి రావడంతో ఆర్యన్ ఖాన్ క్రేజ్ మామూలుగా లేదని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తండ్రి పరంపరను కొనసాగించడానికి ఆర్యన్ ఖాన్ మొదటి అడుగు వేశారని ఆయనకు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు సెలబ్రెటీలు.
ఇకపోతే ది బ్యాడ్స్ అఫ్ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి అతిథి పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దీంతో ఈ వెబ్ సిరీస్ పై బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా ఆసక్తి నెలకొంది. ఇందులో లక్ష్య , బాబీ దేవోల్, సహేర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు ఈ వెబ్ సిరీస్ ను రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.
ఇకపోతే ఈ ప్రీమియర్ షో తర్వాత సెలబ్రిటీలు ఆర్యన్ ఖాన్ పై ప్రశంసలు కూడా కురిపించారు.." మీ కుటుంబం, స్నేహితులతో పాటు ఇండస్ట్రీలోని వారంతా కూడా నీ ప్రతిభాను చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా నువ్వు ఈ సిరీస్ ను ఎంత కష్టపడి తెరకెక్కించావో అర్థం అవుతోంది. రెండేళ్లకు పైగా దీనికోసం నువ్వు శ్రమించడం నేను కల్లారా చూసాను. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది" అంటూ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ కూడా నోట్ పంచుకున్నారు.
