టూ మచ్ చెత్త... ఇద్దరు ముద్దుగుమ్మలు అట్లర్ ఫ్లాప్
ఈ మధ్య టాక్ షో లకు మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఓటీటీలు టాక్ షో లను ప్లాన్ చేస్తున్న విషయం తెల్సిందే.
By: Ramesh Palla | 31 Oct 2025 1:21 PM ISTఈ మధ్య టాక్ షో లకు మంచి స్పందన లభిస్తున్న నేపథ్యంలో ప్రముఖ ఓటీటీలు టాక్ షో లను ప్లాన్ చేస్తున్న విషయం తెల్సిందే. అమెజాన్ ప్రైమ్ నుంచి కొత్తగా 'టు మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్' టాక్ షో వస్తున్న విషయం తెల్సిందే. ఈ షో ప్రారంభం అయినప్పటి నుంచి ప్రేక్షకులు సోషల్ మీడియాలో టూ మచ్ గా ట్రోల్స్ చేస్తున్నారు. ఎవరు పడితే వారు టాక్ షో లో మొదలు పెట్టేస్తున్నారు అంటూ ప్రారంభం అయిన ఈ విమర్శలు కంటెంట్ విషయంలోనూ ఎదుర్కోవాల్సి వస్తుంది. అట్లర్ ఫ్లాప్ టాక్ షో అంటూ అమెజాన్ ప్రైమ్ వీడియోను ట్యాగ్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో టూమచ్ చెత్త అంటూ చాలా మంది ఈ టాక్ షో గురించి చేసిన పోస్ట్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలా మంది నెటిజన్స్ ఈ టాక్ షో గురించి నెగిటివ్‌గా మాట్లాడుతున్నారు.
టు మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్...
ఓటీటీ ప్రేక్షకులు టాక్ షో లకు ఆధరణ చూపిస్తున్నారనే ఉద్దేశంతో కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో అమెజాన్ ప్రైమ్ వంటి ఓటీటీలో కొత్త టాక్ షో లను తీసుకు వస్తున్నాయి. ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ తో టాక్ షో చేస్తే బాగుంటుంది. అయితే ఇద్దరు హీరోయిన్స్ మాత్రమే మాట్లాడి వచ్చిన గెస్ట్ ను మాట్లాడనివ్వకుంటే ఎలా అంటూ ఈ షో చూసిన తర్వాత చాలా మంది విమర్శలు చేస్తున్నారు. టాక్ షో అంటే ప్రశ్నలు అడుగుతూ ఉండాలి, వచ్చిన గెస్ట్ సమాధానం చెబుతారు. కానీ ఈ టాక్ షో లో మాత్రం గెస్ట్‌ల కంటే ఇద్దరు ముద్దుగుమ్మలు కమ్ హోస్టలు అయిన కాజోల్, ట్వింకిల్ ఎక్కువగా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. షో చూడని వారు యూట్యూబ్ లో ప్రోమోలు చూసినా అదే విషయం అర్థం అవుతుంది. నెగిటివిటీ వస్తున్నా కూడా ఇటీవల వచ్చిన ఎపిసోడ్స్ లోనూ అదే పద్ధతిని ఆ ఇద్దరు ముద్దుగుమ్మలు కంటిన్యూ చేస్తున్నారు.
అమెజాన్ ప్రైమ్‌లో టాక్ షో...
రెగ్యులర్ రొటీన్ రొమాంటిక్ ముచ్చట్లు, వచ్చిన గెస్ట్‌ల నుంచి కొత్తగా ఏమీ రాబట్టే ప్రయత్నం చేయక పోవడం వంటి కారణాల వల్ల ఈ టాక్ షో కి పెద్దగా ఆధరణ దక్కడం లేదు. సోషల్ మీడియాలో ఈ టాక్ షో గురించి మొదట్లో కాస్త పాజిటివ్‌గానే చర్చ జరిగింది. కానీ తర్వాత తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎపిసోడ్స్ ప్రసారం అవుతున్న కొద్ది ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. ఇప్పటికే టాక్ షో నుంచి అయిదు ఎపిసోడ్స్ వచ్చాయి. మరో రెండు మూడు ఎపిసోడ్స్ తో ఈ సీజన్ పూర్తి అయ్యే అవకాశం ఉందని బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ సీజన్‌కు వచ్చిన స్పందనతో రెండో సీజన్ ఉండక పోవచ్చు అని, ఇప్పటికే టూ మచ్ నెగిటివిటీ వచ్చిన కారణంగా, పెద్దగా వ్యూస్ దక్కని కారణంగా ఈ టాక్ షో కి ఇంతడితో గుడ్ బై చెప్పేస్తే బాగుంటుంది అనేది చాలా మంది అభిప్రాయం.
సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ గెస్ట్‌లుగా మొదటి ఎపిసోడ్...
ఈ టాక్ షో కి హైప్ తీసుకు వచ్చే విధంగా మొదటి ఎపిసోడ్ ను ఏకంగా బాలీవుడ్ సూపర్ స్టార్స్ అయిన అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌లతో ప్రారంభించడం జరిగింది. ఆ ప్రోమో వచ్చిన సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. కానీ ఎపిసోడ్ లో మ్యాటర్ లేకపోవడంతో ప్రేక్షకులు నిరుత్సాహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆలియా భట్, వరుణ్ ధాన్‌లు హాజరు అయ్యారు. వారి ఎపిసోడ్‌లోనూ మ్యాటర్ ఏమీ లేదు అనిపించింది. అయితే మూడో ఎపిసోడ్ కి అక్షయ్ కుమార్, సైఫ్ అలీ ఖాన్ రావడం, ఆ ఎపిసోడ్ కాస్త ఆసక్తికరంగా సాగడం జరిగింది. కానీ ఆ తర్వాత మళ్లీ అదే జరిగింది. నాల్గవ ఎపిసోడ్‌కి చుంకీ పాండే, గోవిందలు హాజరు అయ్యారు. ఈ ఫేడ్ ఔట్ స్టార్స్ ఎపిసోడ్‌ను జనాలు పూర్తిగా పక్కన పెట్టారు. ఆ తర్వాత కరణ్ జోహార్, జాన్వీ కపూర్‌ల ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. మొత్తం సీజన్‌లో ఒకటి రెండు ఎపిసోడ్స్ సైతం పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఇద్దరు ముద్దుగుమ్మల టు మచ్ అట్లర్ ఫ్లాప్ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
