Begin typing your search above and press return to search.

ఓటీటీ షోలో ఇండియా కూటమి ఎంపీ?

డిజిటల్ విప్లవం -ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల విస్తృతి కారణంగా వినోద రంగంలో సరికొత్త ప్రయోగాలు చోటుచేసు కుంటున్నాయి.

By:  Srikanth Kontham   |   14 Jun 2026 4:56 PM IST
ఓటీటీ షోలో ఇండియా కూటమి ఎంపీ?
X

డిజిటల్ విప్లవం -ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల విస్తృతి కారణంగా వినోద రంగంలో సరికొత్త ప్రయోగాలు చోటుచేసు కుంటున్నాయి. ఇప్పటి వరకు సినిమా తారలు, క్రీడాకారులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మాత్రమే రియాలిటీ షోలలో సందడి చేయడం చూశాం. అయితే కాలంతో పాటు మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా రాజకీయ నాయకులు కూడా డిజిటల్ స్క్రీన్‌పై అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సరికొత్త రియాలిటీ షోను రూపొందించడానికి సన్నాహాలు చేస్తోంది.

తాజా సమాచారం ప్రకారం `ఇండియా` కూటమికి చెందిన పార్లమెంట్ సభ్యుడు ఈ ప్రతిష్టాత్మక ఓటీటీ రియాలిటీ షోలో భాగస్వామ్యం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇండస్ట్రీలో భారీ రియాలిటీ ఫార్మాట్లను విజయవంతంగా తెరకెక్కించే ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ బానిజయ్ ఆసియా ఈ షోను నిర్మించబోతోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని.. సదరు ఎంపీతో మేకర్స్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

బానిజయ్ ఆసియా సంస్థ భారతదేశంలో బిగ్ బాస్, ఖత్రోన్ కే ఖిలాడీ వంటి అతిపెద్ద రియాలిటీ షోలను నిర్వహించడంలో దిట్ట. అందువల్ల యాక్టివ్ రాజకీయ నాయకుడిని డిజిటల్ స్క్రీన్‌పై ప్రెజెంట్ చేయడానికి వారు ఎలాంటి వినూత్న ఫార్మాట్‌ను ఎంచుకోబోతున్నారనేది బాలీవుడ్ .. రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఒక డాక్యుమెంటరీ లేదా ప్రచార చిత్రం తరహాలో కాకుండా వీక్షకులను ఆకట్టుకునేలా ఆసక్తికరమైన ఎంటర్‌టైన్‌మెంట్ ఎలిమెంట్స్‌తో ఈ రియాలిటీ షో సాగనుందని తెలుస్తోంది.

నేటి ఆధునిక యుగంలో రాజకీయ నాయకులకు సాంప్రదాయ మీడియా మాత్రమే కాకుండా యువతను ఆకట్టుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లు ఎంతో అవసరంగా మారాయి. ఓటీటీ షోల ద్వారా వారి వ్యక్తిగత జీవితాన్ని, వారి నిజమైన ఆలోచనా విధానాన్ని , తెరవెనుక వారిలోని హ్యూమన్ యాంగిల్‌ను ప్రజలకు మరింత దగ్గరగా చూపించే అవకాశం లభిస్తుంది. ఇది ఒక రకంగా సదరు నాయకుడి పొలిటికల్ ఇమేజ్ బిల్డింగ్‌కు.. పబ్లిక్ రిలేషన్స్ వ్యూహాలకు దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

గతంలో కూడా కొంతమంది రాజకీయ ప్రముఖులు టాక్ షోలలో లేదా సెలబ్రిటీ ఇంటర్వ్యూలలో అతిథులుగా పాల్గొని సందడి చేశారు. కానీ పూర్తిస్థాయి రియాలిటీ షో ఫార్మాట్‌లో ఒక సిట్టింగ్ ఎంపీ కనిపించడం అనేది భారతీయ డిజిటల్ స్పేస్ హిస్టరీలోనే సరికొత్త మైలురాయిగా నిలవనుంది. ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడూ రొటీన్ డ్రామాలకు భిన్నంగా రియల్ అండ్ అన్‌స్క్రిప్టెడ్ కంటెంట్‌ను చూడటానికి ఇష్టపడతారు. కాబట్టి రాజకీయ నాయకుడి దైనందిన జీవితం ..వ్యక్తిత్వం చుట్టూ తిరిగే ఈ షో ఖచ్చితంగా భారీ వ్యూస్‌ను రాబట్టగలదని మేకర్స్ నమ్ముతున్నారు.

అమెజాన్ ప్రైమ్ వీడియో - బానిజయ్ ఆసియా కలయికలో రాబోతున్న ఈ పొలిటికల్-ఎంటర్‌టైన్‌మెంట్ కాంబినేషన్ డిజిటల్ కంటెంట్ మేకింగ్‌లో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టబోతోంది. చర్చలు గనుక సఫలమై, సదరు ఎంపీ షోకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే భవిష్యత్తులో మరికొంతమంది రాజకీయ నాయకులు కూడా ఓటీటీ బాట పట్టే అవకాశం ఉంది. గ్లామర్ రంగానికి- అధికార రాజకీయాలకు మధ్య ఉన్న పరస్పర బంధాన్ని ఈ సరికొత్త షో ఏ విధంగా ఆవిష్కరిస్తుందో తెలియాలంటే? అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.