సినిమా అంటే టైమ్ పాస్ కాదు..
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అమర్ కౌశిక్ తెరకెక్కిస్తున్న మహావతార్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ పరుశురాముడిగా నటిస్తున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 6 Nov 2025 10:34 AM ISTగత కొన్ని సంవత్సరాల క్రితం వెనక్కి చూసుకుంటే సినిమాను కేవలం సినిమాలాగే చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు నిజ జీవిత సంఘటనలను ఆధారంగా చేసుకొని సినిమాలను తెరకెక్కించడమే కాకుండా దర్శకులు కూడా తమ ప్రాంతాలకు సంబంధించిన ఎన్నో విషయాలను సమాజానికి తెలియజేయాలనే నేపథ్యంలో చిత్రాలు చేస్తూ అందరిని ఆకట్టుకుంటున్నారు.. నిజానికి ఒక్కో ప్రాంతంలో ఒక్కో విషయం జరిగే ఉంటుంది. అయితే అవన్నీ అందరికీ తెలిసే ప్రసక్తే లేదు. కానీ వాటన్నింటినీ ఇప్పుడు సినిమాగా చూపిస్తూ ఇటు ప్రజలలో కూడా అన్ని విషయాలపై అవగాహన కల్పిస్తున్నారు దర్శకనిర్మాతలు.
నిజ జీవిత సంఘటనలే కాకుండా దైవత్వంతో కూడిన విషయాలను కూడా సినిమా రూపంలో చూపిస్తూ.. భక్తి భావాన్ని పెంచుతున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇలా ప్రజలకు ఉపయోగపడే సినిమాలు చేయడమే కాకుండా ఈ సినిమాలు చేస్తున్న సమయంలో దర్శకులు, హీరోలు తీసుకుంటున్న నిర్ణయాలు.. పాటిస్తున్న నియమాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి . ఉదాహరణకు హీరో రిషబ్ శెట్టి.. కాంతార 1&2 సినిమాల షూటింగ్ మొదలైనప్పటి నుంచి విడుదల అయ్యే వరకు ఎన్ని జాగ్రత్తలు ..ఎన్ని పద్ధతులు.. ఎన్ని నియమాలు పాటించారో అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు ఈయన దారిలోనే మరో యంగ్ హీరో, డైరెక్టర్ నడుస్తున్నారు. తమ సినిమా దైవాత్మిక అంశాలతో తెరకెక్కుతున్న నేపథ్యంలో మాంసాహారాన్ని కూడా పక్కనపెట్టి తమ డెడికేషన్ ఏంటో చూపిస్తున్నారు.
అసలు విషయంలోకి వెళ్తే.. ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ అమర్ కౌశిక్ తెరకెక్కిస్తున్న మహావతార్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ పరుశురాముడిగా నటిస్తున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయగా అది అభిమానులలో విపరీతమైన ఉత్సాహాన్ని క్రియేట్ చేసింది.. ఇక కథపై దృష్టి కేంద్రీకరించడానికి.. ఆధ్యాత్మికంగా కనెక్ట్ అవ్వడానికి విక్కీ కౌశల్ తో పాటు దర్శకుడు అమర్ కౌశిక్ కూడా ఇద్దరూ మద్యం , మాంసాహారం మానేయాలని నిర్ణయించుకున్నారట. అంతేకాదు పరుశురాముడు బ్రాహ్మణుడిగా జీవించిన విష్ణువు యొక్క అవతారం కాబట్టి అత్యంత పవిత్రంగా సినిమాను తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారు.
మేకర్స్ వచ్చే ఏడాది ప్రత్యేకమైన పూజా కార్యక్రమంతో ఈ సినిమాను ప్రారంభించాలని సన్నహాలు చేస్తున్నారు.. అందులో భాగంగానే అమర్ కౌశిక్ ఇప్పటికే తన ఆహార పద్ధతులను కూడా మార్చుకున్నారట. అలాగే విక్కీ కూడా తన ప్రస్తుత చిత్రం లవ్ అండ్ వార్ సినిమా పూర్తి అయిన తర్వాత మాంసాహారాన్ని మానేయబోతున్నారని సమాచారం. ఇకపోతే పరుశురాముడి శక్తివంతమైన దైవిక పాత్ర పట్ల గౌరవం చూపించే మార్గం ఇదే అని.. అమర్ కౌశిక్ ఈ ప్రాజెక్టు హృదయానికి చాలా దగ్గరగా ఉందని, అరుణాచల ప్రదేశ్ లోని పరుశురామ్ కుండ్ సమీపంలో పెరిగానని తెలిపారు.
ఇకపోతే ఈ సినిమాను వచ్చే యేడాది క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వచ్చే యేడాది షూటింగ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో 2027లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఏది ఏమైనా ఈమధ్య సినిమా అంటే టైంపాస్ కాదని.. డబ్బుల కోసం అసలే కాదని.. ఒక సినిమాను భక్తి భావంతో తెరకేక్కించేటప్పుడు ఆ భక్తి మనలో కూడా ఉండాలి అని దర్శక నిర్మాతలు హీరోలు తీసుకుంటున్న ఈ నిర్ణయాలకు అందరూ ఫిదా అవుతున్నారు.
