కొడుకుతో అమలాపాల్ ఓనం సెలబ్రేషన్స్
అందులో భాగంగానే ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ కూడా ఓనం సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు..
By: Madhu Reddy | 7 Sept 2025 12:21 PM ISTకేరళ రాష్ట్రంలో అత్యంత ఘనంగా జరుపుకునే పండుగలలో ఓనం పండుగ కూడా ఒకటి.. వ్యవసాయ పండుగగా చెప్పుకునే ఈ ఓనం పండుగ కేరళ ప్రజలకు అతి పెద్ద పండుగ అని చెప్పవచ్చు.. సామాన్యులను మొదలుకొని సెలబ్రిటీల వరకు ఈ పండుగలో ప్రతి ఒక్కరూ భాగం అవుతారు. ఇంటిని అందంగా పువ్వులతో అలంకరించి.. సాంప్రదాయ దుస్తులు ధరించి పూజలో పాల్గొంటారు. కేరళ కాలమానం ప్రకారం .. ఆగస్టు - సెప్టెంబర్ నెలల మధ్యలో వచ్చే ఈ పండుగ కోసం కేరళ ప్రజలు ఎంతగానో ఎదురు చూస్తారు. అలాంటి ఈ పండుగ రానే వచ్చేసింది. ఇక సెలబ్రిటీలందరూ కూడా తమ తమ కుటుంబ సభ్యులతో ఓనమ్ సెలబ్రేషన్స్ జరుపుకుంటూ ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు.
అందులో భాగంగానే ప్రముఖ హీరోయిన్ అమలాపాల్ కూడా ఓనం సెలబ్రేషన్స్ ను ఘనంగా నిర్వహించారు.. తన కొడుకు సమక్షంలో భర్తతో కలిసి ఆమె జరుపుకున్న ఈ ఓనం సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా అమలాపాల్ తన భర్త , కొడుకుతో కలిసి సాంప్రదాయ దుస్తులు ధరించి ఓనం పండుగను జరుపుకున్నారు. ప్రత్యేకంగా ఇంటిని పువ్వులతో అలంకరించిన వీరు.. అందులో భాగంగానే రుచికరమైన భోజనంతో పండుగను పూర్తి చేసుకున్నారు. భార్య, భర్త, కొడుకు మాత్రమే కాకుండా మిగతా కుటుంబ సభ్యులు కూడా ఈ ఓనం సెలబ్రేషన్స్లో సందడి చేశారు.
ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలను అమలాపాల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా షేర్ చేయడంతో ఇది చూసిన అభిమానులు తెగ సంతోష పడిపోతున్నారు.. తమ అభిమాన హీరోయిన్ ఫ్యామిలీని ఒకే చోట ఈ ఓనం సెలబ్రేషన్స్ లో భాగంగా చూడడంతో మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అమలాపాల్ కెరియర్ విషయానికి వస్తే.. కేరళ కుట్టి అయిన ఈ అమ్మడు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. 'నీల తామర' అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత పలు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో 'ఇద్దరమ్మాయిలతో', 'నాయక్' వంటి చిత్రాలు ఒకే ఏడాది చేసి రెండు చిత్రాలతో కూడా మంచి విజయాన్ని అందుకుంది అమలాపాల్.. ఆ తర్వాత జెండాపై కపిరాజు, పిట్టకథలు లాంటి చిత్రాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా సినిమాలతోనే కాదు వెబ్ సిరీస్ లతో కూడా ఆకట్టుకుంది అమలాపాల్.
ఇకపోతే 2014లో ప్రముఖ దర్శకుడు విజయ్ ను వివాహం చేసుకొని.. 2017 లో మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత జగత్ దేశాయ్ అనే వ్యక్తితో 2023 నవంబర్ 5న వివాహం జరగగా.. వీరికి పండంటి మగ బిడ్డ జన్మించారు. ప్రస్తుతం ఒకవైపు కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తూనే మరొకవైపు మలయాళంలో మూడు చిత్రాలను లైన్ లో పెట్టింది ఈ ముద్దుగుమ్మ.. మరి ఈ చిత్రాలన్నీ కూడా ఈమె కెరీర్ కు ఎలా దోహదపడతాయో చూడాలి.
