Begin typing your search above and press return to search.

కెరీర్‌లోనే అమ‌లాపాల్ అత్యంత బోల్డ్ నిర్ణయం

అయితే అమ‌ల కెరీర్‌‌లో బోల్డ్ అండ్ సంచలన చిత్రంగా నిలిచిన `ఆడై` సినిమా గురించి మరోసారి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

By:  Srikanth Kontham   |   30 Sept 2026 3:00 PM IST
కెరీర్‌లోనే అమ‌లాపాల్ అత్యంత బోల్డ్ నిర్ణయం
X

దక్షిణాది చిత్ర పరిశ్రమలో విభిన్నమైన పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రతిభావంతురాలు అమలా పాల్. అమ్మ‌డు కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ ప్రశంసలు అందుకున్నారు. అయితే అమ‌ల కెరీర్‌‌లో బోల్డ్ అండ్ సంచలన చిత్రంగా నిలిచిన `ఆడై` సినిమా గురించి మరోసారి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో ఓ కీలక సన్నివేశం కోసం నగ్నంగా నటించాల్సి వచ్చినప్పుడు ఎంతగా భ‌య‌ప‌డిందో? రివీల్ చేసారు.

రత్నకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన `ఆడై` చిత్రంలో అమలా పాల్ కామిని అనే బోల్డ్ రెబల్ పాత్రలో నటించారు. ట్రైలర్ విడుదలైనప్పట్నుంచే ఇండస్ట్రీలో పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. ముఖ్యంగా కీలక సన్నివేశాలలో ఆమె వస్త్రాలు లేకుండా కెమెరా ముందుకు రావాల్సి రావడం అప్పట్లో ఓ సంచలనం. ఈ సీన్ షూటింగ్ సమయంలో పడిన మానసిక సంఘర్షణ గురించి కెమెరా ముందుకు వచ్చే ధైర్యం ఎలా తెచ్చుకుందనే దాని గురించి వివరించారు.

నిజ జీవితంలో నటిగా, మహిళగా అలాంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం అంత సులభం కాదని అమలా పాల్ పేర్కొన్నారు. ఆ సీన్ షూట్ చేయడానికి ముందు రోజు రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదని, సమాజం నుంచి ఎలాంటి విమర్శలు వస్తాయోనని తీవ్రమైన భయానికి గురయ్యానని తెలిపారు. తన కుటుంబం, స్నేహితులు ఈ నిర్ణయాన్ని ఎలా స్వీకరిస్తారనే ఆందోళన తనను కుంగదీసిందని అయితే ఒక నటిగా కథ డిమాండ్ చేసినప్పుడు ఈ సవాల్‌ను స్వీకరించాలని భావించిన‌ట్లు తెలిపారు.

షూటింగ్ సమయంలో రత్నకుమార్ .. చిత్ర యూనిట్ ఎంతగానో అండగా నిలిచారని అమ‌ల‌ కృతజ్ఞతలు తెలిపారు. కేవలం తక్కువ మంది టెక్నీషియన్ల సమక్షంలో, ఎంతో కఠినమైన భద్రత , గోప్యత మధ్య ఆ సన్నివేశాలను చిత్రీకరించినట్లు గుర్తుచేసుకున్నారు. సెట్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ తనను ఒక నటిగా గౌరవిస్తూ ఆ సీన్ ఇంటెన్సిటీని కాపాడేందుకు సహకరించారని తెలిపారు. ఆ నమ్మకమే తనకు ఆ సమయంలో ధైర్యాన్ని చ్చిందన్నారు.

సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి .. విమర్శకుల నుంచి చిత్రానికి ఊహించని విధంగా ప్రశంసలు దక్కాయన్నారు. వివాదం కోసం కాకుండా కథలో పాత్ర ప్రాధాన్యతను బట్టే ఆ సీన్ డిజైన్ చేశారని ప్రేక్షకులు అర్థం చేసుకున్నారని తెలిపారు. తన కెరీర్‌‌లో ఇదొక టర్నింగ్ పాయింట్ అయిన సినిమా అని ఈ ప్రయోగం ద్వారా తాను నటిగా మరింత పరిపక్వత సాధించానని గర్వంగా పేర్కొన్నారు.