Begin typing your search above and press return to search.

వార్డ్ రోబ్ లో వాటికి ప్రత్యేక స్థానం.. స్పెషల్ వీడియో పంచుకున్న అక్కినేని అమల!

ఒకప్పుడు టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా ఏలిన అమల అక్కినేని, నాగార్జునతో వివాహం తర్వాత సినిమాలకు దూరమై ఫ్యామిలీకే ప్రాధాన్యమిచ్చారు.

By:  Madhu Reddy   |   6 Sept 2026 4:16 PM IST
వార్డ్ రోబ్ లో వాటికి ప్రత్యేక స్థానం.. స్పెషల్ వీడియో పంచుకున్న అక్కినేని అమల!
X

ఒకప్పుడు టాలీవుడ్‌లో తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా ఏలిన అమల అక్కినేని, నాగార్జునతో వివాహం తర్వాత సినిమాలకు దూరమై ఫ్యామిలీకే ప్రాధాన్యమిచ్చారు. చాలా కాలం తర్వాత ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ స్పెషల్ శారీ ఫోటోషూట్ ఇప్పుడు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తెల్లటి చేనేత చీరలో ఎంతో ప్రశాంతంగా, రాయల్ లుక్‌తో చేసిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అమల కట్టుకున్న ఈ చీర వెనుక ఒక అందమైన కథ కూడా ఉంది అదేంటో చూద్దాం..

వైట్ కలర్‌పై అమలకు ఉన్న ప్రేమ :

తెలుపు రంగు చీరలను ఇష్టపడని మహిళలు ఉండరంటే అతిశయోక్తి కాదు. అమల అక్కినేని కూడా తనకు తెల్లటి రంగు దుస్తులంటే ఎంతో ఇష్టమని, అవి చూడగానే తన మూడ్ మారిపోతుందని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మన భారతీయ మహిళల వార్డ్‌రోబ్‌లో ఖాదీ, కేరళ కాటన్స్, బెంగాల్ కాటన్స్, కోటా వంటి హ్యాండ్‌లూమ్ చీరలు ఒక నిధి లాంటివని ఆమె అభిప్రాయపడ్డారు.

ప్రతి చీరకు ఒక తీపి జ్ఞాపకం:

తన దగ్గర ఉన్న చాలా చీరలు తాను ఎంతో ప్రేమించే వారి నుంచి కానుకలుగా వచ్చినవని, మరికొన్నింటిని తాను ఏళ్ల తరబడి సేకరించానని అమల చెప్పుకొచ్చారు. ఇక ఇలా తన వద్ద ఉన్న ప్రతి చీర వెనుక ఒక అందమైన కథ, తీపి జ్ఞాపకం దాగి ఉన్నాయని ఆమె ఎంతో ఆనందంగా వెల్లడించారు.

కేరళ-కాంచీపురం కలనేత చీర:

ఈ ప్రత్యేకమైన వీడియో కోసం అమల 'పిచకమ్ వీవ్స్' అనే బ్రాండ్‌కు చెందిన హ్యాండ్‌లూమ్ చీరను ధరించారు. ఈ బ్రాండ్ వ్యవస్థాపకురాలు సుప్రియ తనకు ఈ అందమైన చీరలను పంపారని అమల తెలిపారు. ఇక కేరళ సాంప్రదాయ నెతకు, కాంచీపురం పూల డిజైన్లను మిళితం చేసి ఈ చీరను ఎంతో అద్భుతంగా రూపొందించారు. కేరళ గోల్డెన్ బోర్డర్, కాంచీపురం ఎంబ్రాయిడరీ కలయిక ఈ చీరకు సరికొత్త గ్రేస్‌ను తెచ్చిపెట్టింది.

అమల రాయల్ ఎలిగాన్స్ :

సాంప్రదాయ నేత కార్మికుల నైపుణ్యాన్ని కొనియాడుతూ అమల పోస్ట్ చేసిన ఈ వీడియో, ఫోటోలలో ఆమె దేవతలా మెరిసిపోతున్నారు. ఇక ఎటువంటి హంగులు లేకుండా చాలా సింపుల్‌గా, రాయల్ వైబ్‌తో ఉన్న ఆమెను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. వయసు పెరిగినా ఆమె అందం, ఆకర్షణ అస్సలు తగ్గలేదని కామెంట్లు చేస్తున్నారు.

సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరగా ఉంటున్న అమల అక్కినేని.. మన భారతీయ చేనేత రంగాన్ని ప్రోత్సహిస్తూ చేసిన ఈ పోస్ట్ అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఇక వైట్ శారీలో రాయల్ లుక్‌తో మెరిసిన అమల అక్కినేని పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.