అక్కినేని అమల తండ్రి అంత కష్టపడ్డారా?
అక్కినేని అమల.. పరిచయం అక్కర్లేని పేరు. పలు సినిమాల్లో నటించిన అమల నటిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 21 Nov 2025 7:00 PM ISTఅక్కినేని అమల.. పరిచయం అక్కర్లేని పేరు. పలు సినిమాల్లో నటించిన అమల నటిగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అక్కినేని నాగార్జునను పెళ్లి చేసుకుని అక్కినేని కోడలిగా మారిన అమల పేరు చెప్పగానే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చేది తన శాంత స్వభావం మరియు చిరునవ్వు. క్లాసికల్ డ్యాన్స్ లో మంచి ప్రావీణ్యమున్న అమల సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ అక్కినేని ఫ్యామిలీకి మంచి పేరు తీసుకొస్తున్నారు.
80-90 దశకాల్లో హీరోయిన్ గా రాణించిన అమల, అక్కినేని నాగార్జునను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వారిద్దరూ కలిసి నటించిన శివ మూవీ రీసెంట్ గానే రీరిలీజవగా, రీరిలీజ్ లో కూడా శివ మంచి రిజల్ట్ ను అందుకుంది. అయితే అమల మంచి క్లాసికల్ డ్యాన్సర్, నటి, సేవా సంస్కర్త అని తప్పించి ఆమె చిన్నతనం గురించి ఎప్పుడూ ఎవరికీ చెప్పింది లేదు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమల తన గురించి, తన ఫ్యామిలీ గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు.
తల్లిదండ్రులిద్దరూ నేవీ ఆఫీసర్లు
అమల తల్లి ఐరిష్ కాగా, తండ్రి బెంగాలీ. తన తండ్రి చిన్నప్పుడు బెంగాల్ విభజన జరగడంతో తమ ఆస్తులన్నీ కోల్పోయి, కట్టుబట్టులతోనే తన తండ్రి రాత్రికి రాత్రి ఇంటి నుంచి పారపోయారని, బాగా చదువుకుంటే పైకొస్తామని స్టడీస్ పై ఫోకస్ చేసి బాగా చదివి యూకే నౌకాదళంలో ఉద్యోగం సంపాదించారని, తన తండ్రికి 9 మంది చెల్లెళ్లు, తమ్ముళ్లని ఆయన సంపాదించిందంతా వారికే పెట్టారని చెప్పిన అమల, తన తల్లిదండ్రులిద్దరూ నేవీలో ఆఫీసర్లు అని, ఉద్యోగరీత్యా ఎన్నో ప్రదేశాలు మారారని, అలా తనకు 9 ఏళ్ల వయసులో వైజాగ్ లో ఉన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నట్టు చెప్పారు అమల.
9 ఏళ్ల వయసులోనే డ్యాన్స్ స్కూల్ లో
డ్యాన్స్ నేర్చుకునే టైమ్ లో డ్యాన్స్ టీచర్ మీ కూతురికి మంచి టాలెంట్ ఉంది. చెన్నైలోని కళాక్షేత్రంలో జాయిన్ చేయమని చెప్పడంతో 9 ఏళ్ల వయసులోనే తనను అక్కడ స్కూల్ లో జాయిన్ చేశారని, 19 ఏళ్ల వరకు అక్కడే హాస్టల్ లో ఉండి చదువుకుంటూనే దేశంలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా నాట్యప్రదర్శనలు ఇచ్చానని చెప్పారు. తాను కళాక్షేత్ర స్కూల్ లో ఉన్నప్పుడే డైరెక్టర్ టి. రాజేందర్ అతని మూవీ కోసం క్లాసికల్ డ్యాన్సర్ కావాలని కళాక్షేత్రకు వచ్చారని, అలా తనకు అవకాశమొచ్చి హీరోయిన్ గా మారినట్టు అమల చెప్పారు. తన చిన్నతనం గురించి అమల మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.
