కోడళ్లపై పెత్తనం చెలాయించను.. అక్కినేని అమల
ఈ క్రమంలోనే కోడళ్లతో తన అనుబంధం గురించి నాగ్ సతీమణి అమల రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో పంచుకున్నారు.
By: M Prashanth | 18 Oct 2025 12:26 PM ISTఅక్కినేని వారి ఇంట ఇటీవల కాలంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. నాగార్జున ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 2024లో హీరోయిన్ శోభిత దూళిపాళను చైతన్య వివాహం చేసుకోగా... ఈ ఏడాదే ముంబైకి చెందిన వ్యాపారవేత్త జైనబ్ రివ్జీను అఖిల్ పెళ్లాడారు. దీంతో కొత్త కోడళ్ల రాకతో అక్కినేని వారి ఇళ్లు కలకలాడుతుంది. అయితే మామూలుగా అందరి ఇళ్లలో అత్తా- కోడళ్లు ఎలా ఉంటారో అందరీ తెలుసు.
కానీ, సెలబ్రిటీలు ఎలా ఉంటారు? ఆ రిలేషన్ ఎలా మెయింటేన్ చేస్తారో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సెలబ్రిటీల ఇంట్లో అత్తా- కోడళ్ల మధ్య బాండింగ్, వాళ్లు అనుసరించే విధానాలు తెలుసుకోవాలని అనుకుంటారు. ఈ క్రమంలోనే కోడళ్లతో తన అనుబంధం గురించి నాగ్ సతీమణి అమల రీసెంట్ గా ఓ ఇంటర్య్వూలో పంచుకున్నారు. తన కోడళ్ల గురించి గొప్పగా చెప్పారు. ఆమె కోడళ్లు బంగారం అని అన్నారు.
తమ ఇంటికి శోభిత, జైనబ్ రావడంతో తనకు గర్ల్ సర్కిల్ ఏర్పడిందని అమల అన్నారు. వాళ్లు ఎప్పుడూ ఆనందంగా కనిపిస్తారని, వాళ్ల వల్లే జీవితం సరికొత్తగా మారిందని చెప్పారు. కోడళ్లతో ఉన్నప్పుడు భలే సరదాగా ఉంటుందని, ఇక వాళ్ల వ్యక్తిగత విషయాల్లో తలదూర్చనని చెప్పారు. అలాగే ఇంట్లో వాళ్లకు ఇవ్వాల్సిన స్పేస్, కావాల్సిన ఫ్రీడమ్ ఉంటాయని, కోడళ్లు ఇలాగే ఉండాలన్న పట్టింపులేమీ తనకు లేవని అమల చెప్పారు.
నా కోడళ్లు ఎల్లప్పుడూ నాతోనే ఉండాలన్న నిబంధనలేవీ పెట్టను. వాళ్లు తమతమ రంగాల్లో రాణిస్తున్నారు. అలా వాళ్లు బిజీగానే ఉంటున్నారు. అంతేకానీ నాకు ప్రత్యేకంగా టైమ్ కేటాయించాలని కోరుకోను. ఇలాగే ఉండాలని డిమాండ్ కూడా చేసే అత్తను నేను కాదు. భార్యగానూ ఏనాడు అలాంటి డిమాండ్లు ఏమీ నాకు లేవు. కానీ టైమ్ దొరికినప్పుడు మాత్రం అందరం సరదాగా గడుపుతాం. ఆ కొద్ది సమయాన్ని నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అని అమల చెప్పుకొచ్చారు.
దీంతో తన కోడళ్లలో అమల తన కోడళ్లతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారని, అత్తా - కోడళ్ల రిలేషన్ ఇంతే హెల్దీగా ఉండాలని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అయితే పిల్లల పెంపకం విషయంలో మాత్రం అమె చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారట. తప్పు చేస్తే అస్సలు ఊరుకునే వారు కాదట. కాగా, అమల 1992లో నాగార్జునను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు అఖిల్ ఉన్నారు. తమ పెళ్లికి ముందు నాగ్- అమల కలిసి పలు సినిమాల్లో నటించారు. ఇక నాగార్జున తొలి భార్య లక్ష్మీ దగ్గుబాటి కుమారుడు నాగచైతన్య అని అందరికి తెలిసిందే!
