CILECT కాంగ్రెస్ 2025: ఆకట్టుకుంటున్న అమలా స్పీచ్!
అక్కినేని అమల హీరోయిన్ అయినప్పటికీ నాగార్జునతో పెళ్లి తర్వాత సినిమాలన్నింటికీ గుడ్ బై చెప్పేసి ఇంటి పట్టునే ఉంటూ ఒక మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది
By: Madhu Reddy | 29 Oct 2025 1:33 PM ISTఅక్కినేని అమల హీరోయిన్ అయినప్పటికీ నాగార్జునతో పెళ్లి తర్వాత సినిమాలన్నింటికీ గుడ్ బై చెప్పేసి ఇంటి పట్టునే ఉంటూ ఒక మంచి ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత పిల్లలు పెద్దయ్యాక మళ్లీ కొన్ని సినిమాల్లో కీరోల్స్ పోషించింది. అయితే అలాంటి అమల తాజాగా మెక్సికోలోని యూనివర్సిడాడ్ డి గ్వాడలజారా నిర్వహిస్తున్న CILECT కాంగ్రెస్ 2025 సంస్థకు అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా నుండి ప్రాతినిధ్యం వహించింది. CILECT అంటే ప్రముఖ చలనచిత్ర టెలివిజన్ మరియు మీడియా పాఠశాలల ప్రపంచ సంస్థ.. ఈ సంస్థ ద్వారా చలనచిత్రం మరియు మీడియా ఎడ్యుకేషన్లో సహకారం, పరిశోధన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.
"21వ శతాబ్దపు సినిమాలో మనస్సాక్షి యొక్క పరివర్తన శక్తి" అనే థీమ్ పై ఈ ఏడాది ఫోకస్ చేశారు. ఇందులో కథ చెప్పడం,సామాజిక అవగాహన, సానుభూతి బాధ్యతాయుతమైన చిత్ర నిర్మాణాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది పరిశోధన చేస్తారు.. అయితే ఈ CILECT కాంగ్రెస్ 2025 కి అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా తరఫున అమల ప్రాతినిధ్యం వహించింది. అయితే ఈ కార్యక్రమంలో అక్కినేని అమల మాట్లాడుతూ .. "CILECT కాంగ్రెస్ 2025 కి మా అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాను. గత ఏడాది చైనాలోని బీజింగ్ లో జరిగిన కాంగ్రెస్ విద్యలో ఏఐపై దృష్టి సాధించగా..ఈ ఏడాది మెక్సికోలోని గ్వాడలజారాలో జరిగిన 21వ శతాబ్దపు సినిమాలో మనస్సాక్షి యొక్క పరివర్తన శక్తి అనే థీమ్ ని ఎంచుకున్నారు. సినిమా అనేది కేవలం ఎంటర్టైన్మెంట్ కి మూలం మాత్రమే కాదు. పరివర్తనాత్మక ఆలోచన మార్పులు ప్రారంభించడానికి ఒక శక్తివంతమైన సాధనం కూడా..
విద్యావేత్తలుగా విద్యార్థులు తమ సృజనాత్మకతను సున్నితత్వం, ధైర్యాన్ని ఉపయోగించి వారికి ముఖ్యమైన కథలను చెప్పడంలో సహాయ పడడానికి మేం ప్రయత్నిస్తాం అంటూ అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా కి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న అక్కినేని అమల మాట్లాడారు. ప్రస్తుతం అమల ఆ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకున్నాయి.
అమల ఆ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల అంతర్జాతీయ భాగస్వామ్యాలను పెంపొందించి.. భారతదేశంలో చలన చిత్ర మరియు మీడియా ఎడ్యుకేషన్ లో ఏకీకృతం చేయడానికి అన్నపూర్ణ కాలేజ్ ఎంత అంకితభావంతో పనిచేస్తుందో అర్థమవుతుంది.
