Begin typing your search above and press return to search.

ఓపెన్ కామెంట్స్.. 'ఆల్ఫా' మేకర్స్ రిస్క్ తీసుకున్నారా?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, యంగ్ బ్యూటీ శర్వరీ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ఆల్ఫా మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

By:  M Prashanth   |   19 Jun 2026 12:00 AM IST
ఓపెన్ కామెంట్స్.. ఆల్ఫా మేకర్స్ రిస్క్ తీసుకున్నారా?
X

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్, యంగ్ బ్యూటీ శర్వరీ లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ఆల్ఫా మూవీ ట్రైలర్ రీసెంట్ గా రిలీజై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో వస్తున్న తొలి ఉమెన్ ఓరియంటెడ్ యాక్షన్ సినిమా కావడంతో ట్రైలర్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ట్రైలర్‌ లోని యాక్షన్ సీన్స్ కంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ జరుగుతున్న అంశం కామెంట్స్ సెక్షన్.

సాధారణంగా పెద్ద సినిమాల ట్రైలర్లు విడుదలైనప్పుడు మేకర్స్ యూట్యూబ్‌ లో కామెంట్స్‌ ను పరిమితం చేయడం లేదా స్ట్రిక్ట్ గా మోడరేట్ చేయడం కనిపిస్తుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ పెరిగిన తర్వాత ఆ విధానం మరింత ఎక్కువైంది. కానీ ఆల్ఫా ట్రైలర్ విషయంలో మాత్రం మేకర్స్ కామెంట్స్‌ ను పూర్తిగా ఓపెన్‌ గా ఉంచారు. ఇదే ఇప్పుడు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

ట్రైలర్ విడుదలైన వెంటనే యూట్యూబ్‌ లో వేల సంఖ్యలో కామెంట్స్ వచ్చాయి. అందులో కొందరు అలియా భట్, శర్వరీ యాక్షన్ సీన్స్ ను ప్రశంసిస్తే, మరికొందరు సినిమా కాన్సెప్ట్‌ పై సెటైరికల్ కామెంట్స్ చేశారు. కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రత్యేక చర్చకు దారి తీశాయి. ట్రైలర్ కంటే కామెంట్స్ చదవడమే ఎక్కువ ఎంటర్‌టైనింగ్‌ గా ఉందంటూ కొందరు నెటిజన్లు సరదాగా పోస్టులు చేస్తున్నారు.

ఇదంతా చూస్తే కామెంట్స్‌ ను ఓపెన్‌గా ఉంచడం మేకర్స్ తీసుకున్న రిస్క్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రశంసలతో పాటు విమర్శలు కూడా అందరికీ కనిపించేలా మారాయి. అయితే మరో యాంగిల్ రలో చూస్తే ఇది ధైర్యమైన నిర్ణయమనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉన్న వెల్కమ్ చెప్పేందుకు రెడీగా ఉన్నామని మేకర్స్ ఇన్ డైరెక్ట్ చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియా జెనరేషన్ లో ట్రోలింగ్ కూడా ప్రమోషన్స్ లో ఒక పార్ట్ అయిపోయింది. ఒక సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకుంటే అది మార్కెటింగ్‌ కు కూడా ఉపయోగపడుతుంది. ఆల్ఫా విషయంలో అదే జరుగుతున్నట్లు కనిపిస్తోంది. ట్రైలర్‌ పై వచ్చిన పాజిటివ్, నెగిటివ్ రెస్పాన్సులు.. సినిమాను మరింత హాట్ టాపిక్ గా మార్చాయి.

అలియా భట్, శర్వరీ కలిసి చేసిన యాక్షన్ సీన్స్, బాబీ డియోల్ విలన్ రోల్, స్పై యూనివర్స్‌ కు సంబంధించిన లింక్స్ ఇప్పటికే ఆసక్తిని పెంచుతున్నాయి. దీనికి తోడు కామెంట్స్ సెక్షన్‌ లో జరుగుతున్న చర్చలు కూడా సినిమాకు ఎక్స్ ట్రా ప్రమోషన్ ను తీసుకొస్తున్నాయి. ఏదేమైనా ఆల్ఫా ట్రైలర్‌ కు వచ్చిన రెస్పాన్స్ కంటే, ఆ రెస్పాన్స్ ను ఫ్రీగా వ్యక్తం చేసే ఛాన్స్ ఇవ్వడమే ఇప్పుడు పెద్ద చర్చగా మారింది. కామెంట్స్‌ ను ఓపెన్‌ గా ఉంచిన మేకర్స్ నిర్ణయం రిస్క్‌ గా మారుతుందా? లేక సినిమాకు ఎక్స్ ట్రా బజ్ తీసుకొస్తుందా? అన్నది రిలీజ్ తర్వాత క్లారిటీ రానుంది.